ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు శిక్షను కొట్టివేసిన బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్

ఫొటో సోర్స్, A S VASANTHA
దిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. వీరికి మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై గతంలో మహారాష్ట్రలోని గడ్చిరౌలి కోర్టు యూఏపీఏ (చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం) కింద జీవిత ఖైదు విధించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
బాంబే హైకోర్టులోని జస్టిస్ రోహిత్ దేవ్, జస్టిల్ అనిల్ పన్సారేలతో కూడా డివిజన్ బెంచ్ సాయిబాబాతోపాటు మరో ఐదుగురికి విధించిన శిక్షలను కొట్టివేసింది.
ఇతర కేసులేమీ లేకుంటే, వారిని వెంటనే విడుదల చేయాలని కోర్టు పేర్కొన్నట్లు ది హిందూ పత్రిక వెల్లడించింది.
సాయిబాబాతోపాటు ప్రశాంత్ రాహీ, హేం మిశ్రా, విజయ్ టిక్రి, పాండు నరోటె, మహేశ్ టిక్రి ల శిక్షలను కోర్టు కొట్టేసింది. ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాండు నరోటే ఈ ఏడాది ఆగస్టులో స్వైన్ ఫ్లూ సోకడంతో జైలులోనే మరణించారు.
2017లో గడ్చిరౌలి కోర్టు తనకు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ ప్రొఫెసర్ సాయిబాబా బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
విడుదల కోసంగతంలో పిటిషన్లు
తనకు తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయని, క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లిని చూడాలంటూ సాయిబాబా పెరోల్ కోసం పిటిషన్ వేయగా, 2020 మేలో బాంబే హైకోర్టు దానిని తోసిపుచ్చింది. అదే ఏడాది ఆగస్టులో సాయిబాబా తల్లి మరణించారు.
ఆరోగ్య కారణాల వల్ల తనకు బెయిల్ ఇవ్వాలంటూ సాయిబాబా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను నాగపూర్ బెంచ్ జులై 28, 2020న కొట్టి వేసింది.

ప్రొఫెసర్ సాయిబాబా ఎవరు?
దిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జి.ఎన్.సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు అరెస్టుచేశారు. 2017 మార్చిలో యూఏపీఏ చట్టం కింద ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. ఆయనను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో గల అండా సెల్‌లో నిర్బంధించారు.
వైద్య పరిభాషలో చెప్పాలంటే సాయిబాబాకు 90 శాతం వైకల్యముంది. ఐదేళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. రెండు కాళ్లూ నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచీ ఆయన వీల్‌చైర్‌కే పరిమితయ్యారు. 2014 నుంచి జైలులోనే ఉన్న ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలున్నాయి. మరోవైపు ఆయనకు హృద్రోగ సమస్యలూ ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
కొంత కాలం కిందటి వరకు ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు విరసం నేత వరవరరావు ఆరోగ్య విషయంలో వారి బంధువులు, అభిమానుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ప్రభుత్వం వారికి జైలులో సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలేదని, కరోనావైరస్ పేరుతో చంపేయడానికి కుట్ర చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
అయితే, వారి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. కేస్లుల్లో తీవ్రత దృష్ట్యా వయసు, అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వకూడదని న్యాయస్థానాల్లో వాదిస్తూ వచ్చింది.
తాజాగా బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ ఆయన్ను విడుదల చేయాలని తీర్పు ఇచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, A S VASANTHA
2020లో వసంత రాసిన లేఖలోని ముఖ్యాంశాలు
ప్రొఫెసర్ సాయిబాబా.. తన ఆరోగ్యం రీత్యా బెయిల్ ఇవ్వాలని గతంలో కూడా కోరినపుడు.. ఆయనపై మోపిన ఆరోపణల దృష్ట్యా వికలాంగుడనే కారుణ్య కారణాలతో బెయిల్ ఇవ్వలేమని అప్పట్లో గడ్చిరౌలి సెషన్స్ కోర్టు వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం ఆయనకు కనీస సదుపాయాలు కూడా కల్పించడంలేదని, అందుకే ఆయన నిరాహార దీక్ష చేపడుతున్నారని గతంలో సాయిబాబా భార్య ఎ.ఎస్.వసంతకుమారి 2020 అక్టోబర్ లో చెప్పారు. నాగ్‌పుర్ జైలు సూపరింటెండెంట్‌కు ఆమె ఓ లేఖ రాశారు.
''అక్టోబరు 21 నుంచి సాయిబాబా నిరహార దీక్ష చేస్తానని చెప్పారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలి. ఆయనకు మౌలిక హక్కులు కల్పించాలి'' అని ఆమె ఆ లేఖలో కోరారు.
''జైలులో మౌలిక హక్కులు కూడా కల్పించడంలేదని ఆయన నాకు ఫోన్‌లో చెప్పారు. ఆయన చెబుతున్న వివరాల ప్రకారం.. కొన్ని నెలలుగా ఆయనకు మందులు ఇవ్వడం లేదు. వైద్యులు సూచించినట్లుగా ఆయనకు ఎలాంటి సహాయకులను నియమించలేదు. ఆయన రోజూ ఫిజియోథెరపీ చేయాలని వైద్యులు సూచించారు. కానీ, మీరు దానికి అనుమతించడంలేదు. అంతేకాదు మేం పంపించిన కొన్ని పుస్తకాలు, లేఖలు మీరు మధ్యలో ఆపేసినట్లు తెలిసింది. అందుకే, తాను నిరాహార దీక్ష చేపడతానని చెప్పారు.''

''ఒక ఖైదీగా తనకు మౌలిక హక్కులు కల్పించడంలేదని, వేధింపులకు గురిచేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆయన దిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. నిరంతరం ఆయన పుస్తకాలు చదివేవారు. వాటి నుంచి ఆయన్ను దూరం చేయొద్దు. మేం ప్రఖ్యాత రచయితల రచనలనే పంపిస్తున్నాం. దయచేసి అవి ఆయనకు అందించండి''.
''ఆయనకు హృద్రోగాలు ఉన్నాయి. ఆయనకు మందులు ఎప్పటికప్పుడు అందించాలి. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మేం చాలా బాధపడుతున్నాం. ఆయన నిరాహార దీక్ష చేపట్టకూడదని మేం భావిస్తున్నాం. దీని గురించి ఆయనకు మేం లేఖ కూడా రాశాం. దయచేసి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఆయనకు ప్రాథమిక హక్కులు కల్పించాలి''.
''ఆయనతో వెంటనే ఫోన్‌కాల్ మాట్లాడేందుకు కుటుంబాన్ని అనుమతించాలి. ఆయన దీక్ష కొనసాగించకుండా మేం ఒప్పిస్తాం. మా అభ్యర్థనలపై సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. ఆయన సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం''అని వసంత వివరించారు.
మరోవైపు ప్రొఫెసర్ సాయిబాబాకు వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని 'కమిటీ ఫర్ ద డిఫెన్స్ అండ్ రిలీజ్ ఫర్ డాక్టర్ జీఎన్ సాయిబాబా' చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ కూడా జైలు సూపరింటెండ్‌కు లేఖ రాశారు.
''నిరాహార దీక్ష వల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని ఆందోళనగా ఉంది. ఆయన దీక్ష చేపట్టకూడదని మేం భావిస్తున్నాం. దయచేసి మా అభ్యర్థనను ఆయనకు తెలియజేయండి''అని లేఖలో కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు.
''జైలు అనేది ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి.. అంతేకానీ వారిని శిక్షించడానికి కాదు. సాయిబాబా డిమాండ్లను పరిష్కరించాలని మేం కోరుతున్నాం''.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
''యూఏపీఏను రద్దు చేయాలి''
సాయిబాబాపై మోపిన అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)ను రద్దు చేయాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్‌సీపీ ఎమ్మెల్యే సుప్రియా సూలే, మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, విద్యావేత్తలు గతంలో డిమాండ్ చేశారు.
''పౌర హక్కులు, ప్రజాస్వామ్యం, సమాఖ్య స్ఫూర్తిపై ప్రభుత్వం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలి''అని హేమంత్ సోరెన్ అప్పట్లో వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- కర్ణాటకలో హిజాబ్ వివాదం ఎంతో మంది విద్యార్థుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపించిందంటే...
- Income Tax: ఆదాయ పన్నును మ్యాగ్జిమం తగ్గించుకోవడం ఎలా?
- 'స్పామ్ కాల్స్ గోలేంట్రా బాబూ' అని మీకెప్పుడైనా అనిపించిందా... దీనికి విరుగుడు ఏంటి?
- ప్రశ్న పత్రంలో ఇస్లాంను దూషించారంటూ టీజే జోసెఫ్ చేయి నరికారు, ఇప్పుడు ఆ ప్రొఫెసర్ ఎలా ఉన్నారు?
- ‘హిందీని రుద్దుతున్నారు’ అంటూ ఎందుకు విమర్శలు పెరుగుతున్నాయి,అమిత్ షా కమిటీ సిఫారసుల్లో ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












