క్రిస్ హెమ్స్‌వర్త్: ‘నువ్వు లెజెండ్’.. మీరాబాయి చానుకు థోర్ హీరో ప్రశంస

ఫొటో సోర్స్, CLIVE BRUNSKILL
బర్మింగ్‌హాంలో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్‌లో తొలి స్వర్ణ పతకాన్ని సాధించారు. ఆమె ఈ పతకం సాధించడం పట్ల దేశ ప్రజల నుంచి మాత్రమే కాకుండా హాలీవుడ్ తారల దృష్టిని కూడా ఆకర్షించారు.
హాలీవుడ్ స్టార్ క్రిస్ హెమ్స్‌వర్త్ కూడా మీరాబాయి చానును ప్రశంసించారు. ఆయన "థోర్" సినిమాలో హీరోగా నటించి భారతదేశంలో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
మీరా బాయి చేసిన ట్వీట్ పై ఒక యూజర్ చేసిన కామెంట్‌కు ఆయన స్పందించారు.
స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న మీరా బాయి చాను దేశ ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ జులై 31న ఒక ట్వీట్ చేశారు.
"201 కేజీల బరువును ఎత్తడం అంత తేలికైన పని కాదు. కానీ, కోట్లాది ప్రజల అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతీ సవాలును పూర్తి చేసేందుకు ఒకే ఒక్క అవకాశం దక్కుతుంది" అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈమె చేసిన ట్వీట్ పై సౌరభ్ సిన్హా అనే యూజర్ "థోర్ ఇక ఆయుధాన్ని వదిలేయాల్సిన సమయం వచ్చింది" అంటూ క్రిస్ హెమ్స్‌వర్త్‌ను ట్యాగ్ చేశారు.
ఆయన మీరాబాయి ఎత్తిన బరువును థోర్ సినిమాలోని బరువైన ఆయుధంతో పోల్చారు.
థోర్ సినిమాలో ప్రధాన పాత్ర థోర్ ఓడిన్‌సన్ దగ్గర సుత్తిని పోలిన ఆయుధం ఉంటుంది. ఇది చాలా బరువుతో ఉంటుందని, ప్రత్యేక శక్తులున్నవారు మాత్రమే దీనిని ఎత్తగలరు అని సినిమాలో చూపిస్తారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ కామెంట్ కు క్రిస్ హెమ్స్‌వర్త్ స్పందించారు.
"ఆమె అర్హురాలు. అభినందనలు సైఖోమ్! మీరొక లెజెండ్" అని అంటూ ట్వీట్ చేశారు.
క్రిస్ ట్వీట్ కు మీరాబాయి స్పందిస్తూ మీరాబాయి ధన్యవాదాలు తెలిపారు. "థాంక్యూ సో మచ్. మీ చిత్రాలు చూడటాన్ని ఎల్లప్పుడూ ఇష్టపడతా" అంటూ ఆయన్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
మీరా బాయి
తొలి ప్రయత్నంలోనే 84 కిలోల బరువును ఎత్తిన చాను, రెండో ప్రయత్నంలో 88 కేజీలతో వ్యక్తిగత అత్యుత్తమ రికార్డును సమం చేసింది.
టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి రజత పతక విజేత. కామన్వెల్త్‌లో 49 కేజీల కేటగిరీలో ఆమె స్వర్ణం సాధిస్తారని మొదటి నుంచి భావించారు.
రియో ఒలింపిక్స్‌కు వెళ్లినప్పుడు మీరాబాయి కథ వేరేలా ఉంది.
2016లో మీరాబాయి ఒలింపిక్స్‌లో తన విభాగంలో రెండో అథ్లెట్. కానీ, ఆమె పేరు ఒలింపిక్స్‌లో 'డిడ్ నాట్ ఫినిష్' విభాగంలో కనిపించింది.
మీరా రోజువారీ ప్రాక్టీస్‌లో తేలికగా బరువును ఎత్తగా, ఆ రోజు ఒలింపిక్స్‌లో ఆమె చేతులు బిగుసుకుపోయాయి. అప్పటికి భారతదేశంలో రాత్రి సమయం కావడంతో ఆ దృశ్యాన్ని చాలా తక్కువమంది చూశారు.
పత్రికల్లో ఈ వార్త రాగానే, క్రీడాభిమానుల దృష్టిలో మీరాబాయి విలన్‌గా మారారు. 2016 ఘటన తర్వాత ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడంతో కౌన్సెలింగ్ ఇవ్వాల్సి వచ్చింది.
ఈ వైఫల్యం తర్వాత, ఒకదశలో మీరా ఆటకు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకుంది. కానీ, పట్టు వదలకుండా అంతర్జాతీయ పోటీల్లో పునరాగమనం చేసింది.
2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 48 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నఆమె, ఇప్పుడు మళ్లీ గోల్డ్ సాధించారు.
1994 ఆగస్టు 8న మణిపూర్‌లోని ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన మీరాబాయి, చిన్నప్పటి నుంచి ఆటల్లో చాలా ప్రతిభ చూపింది. ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు లేని ఆమె గ్రామం, రాజధాని ఇంఫాల్‌కు 200 కి.మీ దూరంలో ఉంటుంది.
తాను పుట్టిన గ్రామంలో ట్రైనింగ్ ఇచ్చేవారు లేకపోవడంతో అక్కడి నుంచి 50-60 కిలోమీటర్ల దూరం వెళ్లి శిక్షణ తీసుకుందామె.

ఫొటో సోర్స్, Getty Images
థోర్
థోర్ ఒక వినోదాత్మక చిత్రం. పురాణాల్లో కనిపించే ఒక శక్తివంతమైన పురుషుడి పాత్రను పోషించారు. వీరికి అతీత శక్తులున్నట్లు సినిమాలో చూపిస్తారు.
థోర్ దగ్గర ఉండే ప్రత్యేక సుత్తి ఎప్పటికీ విరగదు, చెక్కు చెదరదు. ఈ సుత్తి ఎప్పుడూ అసలైన హక్కుదారుని దగ్గరే ఉంటుంది.
ఐస్‌ల్యాండ్‌కు చెందిన 13వ శతాబ్దపు చరిత్రకారులు స్నోరీ స్టర్ లూసన్ రచించిన రచనల ఆధారంగా ఈ పాత్రను సృష్టించారు.
ఆస్ట్రేలియాలో జన్మించిన 38 ఏళ్ల క్రిస్ హెమ్స్‌వర్త్ థోర్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను అలరించారు. భారతదేశంలో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి, భారత్ వృద్ధి మందగమనంలో ఉందా?
- 'స్పేస్ ఎక్స్ క్యాప్సూల్' శకలం: అంతరిక్షం నుంచి జారింది.. పొలంలో పడింది..
- సీఎంకు ప్రత్యేక గది, హెలీప్యాడ్, దాదాపు 10లక్షల సీసీ కెమెరాల అనుసంధానం....కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలేంటి, దానిపై విమర్శలేంటి?
- అప్పు తీర్చాలంటూ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తే ఏం చేయవచ్చు, మీకున్న హక్కులేంటి
- జూ ఎన్‌క్లోజర్‌లో మొసళ్లకు బదులు అందమైన హ్యాండ్‌బ్యాగ్ పెట్టారు, సందర్శకులు దాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













