రతన్ టాటా: ‘లక్ష రూపాయల’ కారులో తాజ్ హోటల్‌కు వచ్చిన పారిశ్రామిక దిగ్గజం, వైరల్‌గా మారిన వీడియో

నానో కారు ఆవిష్కరణ‌లో రతన్ టాటా
ఫొటో క్యాప్షన్, నానో కారు ఆవిష్కరణ‌ సమయంలో రతన్ టాటా

భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా, ప్రపంచంలోనే అత్యంత చవకైన కార్లలో ఒకటైన ‘నానో’లో ప్రయాణించడంతో సామాజిక మాధ్యమాల్లో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ అయిన రతన్ టాటా నిరాడంబరంగా ఉంటారు.

2009లో టాటా కంపెనీ నానో కారును ఆవిష్కరించింది. కానీ, పదేళ్ల తర్వాత ఈ కారు ఉత్పత్తిని నిలిపివేసింది. అయితే, ఈ కారులో ప్రయాణించడం ద్వారా ఆయన మరోసారి నానోపై తనకున్న ఇష్టాన్ని చాటుకున్నారు.

నానో బేస్ మోడల్ ధర కేవలం లక్ష రూపాయలే కావడంతో ఈ కారుకు... ఆవిష్కరణ సమయంలోనే పెద్ద ఎత్తున అభిమానులు ఏర్పడ్డారు.

అయితే తొలినాళ్లలో విజయం సాధించిన తర్వాత ఉత్పత్తి, మార్కెటింగ్‌లో సమస్యల కారణంగా తయారీదారులు ఈ బ్రాండు తయారీపై ఆసక్తి చూపలేదు.

తొలి బ్యాచ్‌గా తయారైన లక్ష నానో కార్లను లాటరీ పద్ధతిలో అమ్మారు. అప్పటికే కార్ల సరఫరా కంటే డిమాండ్ అధికంగా ఉండటంతో లాటరీ పద్ధతిని ఎంచుకున్నారు.

వీడియో క్యాప్షన్, అక్షతా మూర్తి బ్రిటన్ రాణి కంటే ధనవంతురాలా, ఆమె చుట్టూ రాజకీయ దుమారం ఎందుకు?

ఆ తర్వాతి సంవత్సరాల్లో వీటి డిమాండ్ తగ్గుతూ వచ్చింది. నానో ఆవిష్కరణలో పొరపాట్లు జరిగాయని 2012లో టాటా అంగీకరించారు.

అయినప్పటికీ, ఈ ప్రాజెక్టుపై ఆయనకున్న ప్రేమ అలాగే ఉండిపోయింది. ఇది ''భారతీయులందరికీ అందుబాటులో ఉండే కారు'' అని ఆయన తరచుగా చెప్పేవారు.

జాగ్వర్, లాండ్ రోవర్స్ వంటి విలాసవంతమైన కార్లను తయారు చేసే సంస్థ యజమాని అయిన రతన్ టాటా, నానో కారులో ప్రయాణించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.

నానో కారులో ఆయన మంగళవారం ముంబయిలోని తాజ్ హోటల్‌కు రావడాన్ని 'మాస్టర్‌క్లాస్'గా అభివర్ణిస్తున్నారు. తాజ్ హోటల్ కూడా టాటాకు చెందినదే.

ప్రముఖ ఫొటోగ్రాఫర్ విరల్ భయానీ, తాజ్ హోటల్‌కు టాటా వస్తోన్న వీడియోను పోస్ట్ చేశారు. ఆ తర్వాత భారత సామాజిక మాధ్యమాల్లో రతన్ టాటాపై పొగడ్తలు మొదలయ్యాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారుగా పేరు పొందిన, భారతదేశ కార్ల మార్కెట్‌లో సంచలనం సృష్టించిన టాటా నానో కారు జ్ఞాపకాలను ఈ వీడియో మరోసారి గుర్తుచేసింది.

నానో కారు తనకు ఎందుకు అంత ప్రత్యేకమో అనే దాని గురించి కొన్ని రోజుల క్రితం రతన్ టాటా సోషల్ మీడియా వేదికగా చర్చించారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

మరోవైపు, నానో కారును ఎలక్ట్రిక్ కారుగా మళ్లీ ఆవిష్కరించాలని టాటా గ్రూపు ప్రణాళికలు రచిస్తుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

వృద్ధి చెందుతోన్న ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌ను అందిపుచ్చుకునేందుకు చాలా భారత కంపెనీలతో పాటు ప్రపంచ కంపెనీలు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాయి.

అయితే, ఎలక్ట్రిక్ కార్ల కోసం చార్జింగ్ స్టేషన్లు, సప్లయ్-చైన్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై భారత్ భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ఈ మహిళల సంస్థకు పేరు కూడా లేదు, కానీ వీళ్ల ఉత్పత్తులు అమెరికా వెళ్తున్నాయి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)