బీఆర్ చోప్రా 'మహాభారత్' సీరియల్ భీముడు ప్రవీణ్ కుమార్ మృతి

ఫొటో సోర్స్, @PBNS_India
బీఆర్ చోప్రా దర్శకత్వంలో దూరదర్శన్‌లో ప్రసారమైన మహాభారత్ సీరియల్‌లో భీముడి పాత్ర పోషించిన నటుడు ప్రవీణ్ కుమార్ మృతిచెందారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.
మహాభారత్ సీరియల్‌తోపాటూ ఆయన ఎన్నో సీరియళ్లు, బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు.
ఆయన మృతికి సంతాపం తెలుపుతూ అదే సీరియల్లో ధర్మరాజు పాత్ర పోషించిన గజేంద్ర చౌహాన్ ట్వీట్ చేశారు.
"ఈరోజు ఉదయం మరో విషాద వార్త తెలిసింది. నా మహాభారత్ సోదరుడు ప్రవీణ్ కుమార్ మనల్ని వదిలి అనంతలోకాలకు వెళ్లిపోయారు. నమ్మలేకపోతున్నా. మీరు ఎప్పుడూ మా జ్ఞాపకాల్లో ఉండిపోతారు" అన్నారు.
మహాభారత్ 1988 నుంచి 1990 వరకూ ప్రతి ఆదివారం దూరదర్శన్‌లో ప్రసారమయ్యింది. అప్పట్లో అన్ని రాష్ట్రాల్లో ప్రజలు భాషతో సంబంధం లేకుండా దీనిని ఆదరించారు.

ఫొటో సోర్స్, @Gajjusay
ఎవరీ ప్రవీణ్ కుమార్
ప్రవీణ్ కుమార్ సోబ్టీ పంజాబ్‌లో జన్మించారు.
మహాభారత్ సీరియల్‌లోని నటులు చాలా పాపులర్ అయ్యారు. వారిలో భారీకాయంతో కనిపించే బీముడి పాత్ర అందరినీ ఆకట్టుకుంది.
ఆ పాత్ర చేసిన ప్రవీణ్ కుమార్ మాజీ సైనికుడు. 20 ఏళ్ల వయసులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో చేరారు.
అధికారులు ఆయనలో మంచి క్రీడాకారుడిని గుర్తించారు. దీంతో ఆయన అథ్లెటిక్స్‌లో డిస్కస్ త్రో, హామర్ త్రోలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.
ఏసియన్ గేమ్స్, కామన్ వెల్త్ గేమ్స్‌లో పతకాలు కూడా గెలిచిన ప్రవీణ్ కుమార్, రెండు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు.
ప్రవీణ్ కుమార్ 50కి పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. 2013లో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత 2014లో బీజేపీలో చేరారు.
ఇవి కూడా చదవండి:
- 600 రోజులుగా జూమ్‌లోనే పాఠాలు, 4 కోట్ల మంది చిన్నారుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడనుంది
- రామానుజాచార్యులు ఎవరు? సమాజం కోసం, సమానత్వం కోసం ఆయన ఏం చేశారు? రూ. వెయ్యి కోట్ల విగ్రహంపై విమర్శలు ఏంటి?
- ఆంధ్రప్రదేశ్: ఉద్యోగులు ఆశించినవన్నీ జరగవా? కొత్త పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా?
- కొండబడి: "9 గూడెంలలో ఒక్కడే పదోతరగతి వరకూ వెళ్లాడు.. దీంతో బడే గూడెంకు వెళ్లింది"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








