పుష్ప సినిమా రియల్ స్టోరీ... ఎర్ర చందనం స్మగ్లింగ్ ఎలా జరుగుతుందంటే

వీడియో క్యాప్షన్, పుష్ప సినిమా రియల్ స్టోరీ... ఎర్ర చందనం స్మగ్లింగ్ ఎలా జరుగుతుందంటే

ఎర్రచందనం స్మగ్లర్లు కొందరు కీలకైన వ్యక్తుల డైరెక్షన్స్‌లో నడుస్తారు.

మొత్తం ఏడు దశల్లో ఈ అక్రమ రవాణా జరుగుతుంది.

అటవీ ప్రాంతంలో ఉన్న చెక్ పోస్టులు దాటించి ఎగుమతులు చేస్తుంటారు.

ఈ మొత్తం వ్యవహారంలో అసలు వారు బాగానే ఉన్నా, కింది స్థాయి కూలీలే నలిగి పోతుంటారని గతంలో స్మగ్లింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్న ఓ వ్యక్తి బీబీసీతో చెప్పారు.

''వాటిని ఎక్కడికి తీసుకెళ్తారో నాకు తెలియదు. వేరే వాళ్ల మాటలు విని తెలియకుండా ఆ పనికి వెళ్ళాను. చెట్లు వేరే వాళ్ళు నరుకుతారు. నా పని వాటిని మోయడం. భుజాలు బాగా నొప్పులు పుట్టేవి. ఇంత చేసినా కూలీ ఐదారొందల కన్నా ఎక్కువ ఉండదు. ఇందులోకి రావడం వల్ల కేసుల్లో ఇరుక్కున్నాను. మా ఊర్లో పరువు పోయింది. మా అమ్మానాన్నలు అప్పులు చేసి ఎన్నో కష్టాలు పడి నన్ను బెయిల్ మీద బైటికి తెచ్చారు. నా భార్య బిడ్డలు కూడా నావల్ల ఊళ్లో తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. నన్ను ఈ పనికి తీసుకెళ్ళిన వాళ్లు ఎవరూ నాకు సహాయం చేయలేదు. ఇలాంటి పనులు చేసేవాళ్లకు నాలాగా బాధలు తప్పవని చెప్పగలను'' అని ఆ వ్యక్తి వివరించారు. ఆయన తన పేరు బైటపెట్టడానికి ఇష్టపడ లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)