గాలిపటంతో పాటు 40 అడుగుల ఎత్తుకు ఎగిరిన యువకుడు

వీడియో క్యాప్షన్, గాలిపటంతో పాటు గాల్లోకి ఎగిరిన యువకుడు

శ్రీలంకలోని జాఫ్నాలో పాయింట్ పెడ్రో ప్రాంతంలో గాలిపటాల పోటీ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి గాలిపటంతో పాటు 40 అడుగుల ఎత్తుకు ఎగిరివెళ్లాడు.

గాలిపటాల పోటీలో ఒక గ్రూపు భారీ గాలిపటం ఎగురవేసే ప్రయత్నం చేసినప్పుడు ఈ ఘటన జరిగింది.

నలుగురైదుగురు యువకులు ఆ భారీ గాలి పటాన్ని ఎగురవేయగా అందులో ఒకరు దాని తాడును పట్టుకుని అలాగే ఉండిపోవడంతో దాంతో పాటు గాల్లోకి ఎగిరిపోయారు.

చాలాసేపటి వరకు గాలిపటం తాడుకు వేలాడుతూ ఉండిపోయారు.

కింద ఉన్న మిగతా యువకులు తాడు పట్టుకుని బలంగా కిందకు లాగగా భూమికి సుమారు 15 అడుగుల ఎత్తులోకి రాగానే అక్కడి నుంచి దూకేశాడు ఆ యువకుడు.

నేరుగా కింద పడడంతో స్వల్ప గాయాలయ్యాయి.

పోటీలను చూసేందుకు వచ్చిన వారు ఇదంతా వీడియో తీశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)