పాకిస్తాన్ అమ్మాయిలు ఎవరికీ కనిపించని భాగాల్లో టాటూలు వేయించుకుంటున్నారు ఎందుకు?
పాకిస్తాన్‌లో మహిళలు శరీరంపై టాటూలు వేయించుకోడాన్ని ఒక స్వీయ వ్యక్తీకరణగా భావిస్తారు.
ఇస్లాంకు వ్యతిరేకమని చెబుతున్నా, సమాజంలో ఆగ్రహం వెల్లువెత్తుతున్నా టాటూలు వేయించుకోవడానికే వాళ్లు ఇష్టపడుతున్నారు.
కారణాలు ఏమైనా పాకిస్తాన్‌లో పురుషులు, మహిళల్లో టాటూలపై మోజు పెరుగుతోంది. కరాచీ నుంచి షుమైలా ఖాన్ అందిస్తున్న వీడియో.
‘ఇది తేలికగా అంగీకరించే విషయం కాదు..’
‘‘టాటూలు అనేవి ఎప్పటినుంచో ఉన్నాయి. పూర్వం తమ తెగలకు గుర్తుగా ప్రజలు పచ్చబొట్లు పొడిపించుకునేవారు. కానీ ఇప్పుడు వాటిని సొంత వ్యక్తిత్వాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇది స్వీయ వ్యక్తీకరణకు ఒక రూపం. అయితే, పాకిస్తాన్‌లో ఇది తేలికగా అంగీకరించే విషయం కాదు కాబట్టి, బయటకు కనబడని శరీర భాగాల్లో వాటిని వేయించుకుంటున్నారు. ఇది పూర్తిగా వారి కోసం. మహిళలు చిన్న చిన్న టాటూలు వేయించుకోవడానికే ఇష్టపడుతున్నారు. అక్షరాలు, పువ్వులు, ఆకులు లాంటివి. చాలా కొద్ది మంది మాత్రమే పెద్ద పెద్ద డిజైన్లు కావాలని అడుగుతారు’’ అని పాకిస్తాన్ తొలి మహిళా టాటూ ఆర్టిస్ట్, ఇంక్‌గ్రేవ్ స్టూడియోస్‌కు చెందిన రిదా రెహ్మాన్ ఖాజీ అన్నారు.
‘నేను చాలా సెక్సీ అని ఫీల్ అవుతుంటా..’
‘‘నా శరీరం పట్ల మంచి అనుభూతిని పొందడమే టాటూ వేయించుకోవడానికి కారణం. ఇలా నాకు నేను నచ్చుతాను. నేను చాలా పవర్‌ఫుల్ అని, సెక్సీ అని ఫీల్ అవుతుంటాను. ఆ అనుభూతులన్నీ నాకు ఇష్టం. అందుకే వేయించుకుంటా. నా శరీరం మీద ఉన్న రెండు టాటూల్లో ముఖ్యంగా ఆజాదీ టాటూ ఎందుకు వేయించుకున్నానంటే, మహిళల ర్యాలీలో మేము ఆజాదీ ఆజాదీ అని పదే పదే నినాదాలు చేస్తుంటాం. అది నాకిష్టం. ఆ పదం ఎప్పుడు విన్నా మహిళల ర్యాలీ గుర్తొస్తుంటుంది. అందుకే దాన్ని ఎడమవైపు వేయించుకోవాలనుకున్నా. ఎడమవైపు గుండె ఉంటుంది కదా.. హృదయానికి దగ్గరగా ఆజాదీ అని వేయించుకున్నా. ఇంట్లో ఎక్కువగా ఫుల్ స్లీవ్స్ లేదా హాఫ్ స్లీవ్స్ వేసుకుంటా. కాబట్టి అవి ఎవరికీ కనిపించవు. ఎవరికీ కనిపించని భాగాల్లోనే టాటూలు వేయించుకుంటున్నా. మా అమ్మకి తెలుసు. మా నాన్నకి తెలీదు. ఎప్పటికీ ఆయనకు తెలియకూడదని కోరుకుంటున్నా.’’ అని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఒక యువతి చెప్పారు.
‘ఇది చూస్తే నీ భర్త ఏమంటారు?’
‘‘సమాజంలో దీని తప్పుగా భావిస్తారు. ఇది తప్పుడు అభిప్రాయం కలిగించదని, సంస్కారం లేని అమ్మాయిలే ఇవి వేయించుకుంటారని, ఇది చూస్తే నీ భర్త ఏమంటారు? అని వ్యాఖ్యానాలు చేస్తారు. కానీ, వీటికి ఏం జవాబులు చెప్పగలం? మతపరమైన ఇబ్బందులు ఉన్నాయి. మా పేజ్‌లో కూడా కామెంట్లు వస్తుంటాయి. నెగెటివ్‌గా కామెంట్ చేస్తుంటారు. అయితే, మేము ఎవరినీ బలవంతపెట్టట్లేదు. టాటూ వేయించుకోవాలసిందేనని ఇబ్బంది పెట్టట్లేదు. అది విధిగా చేయాల్సిన పనేమీ కాదు’’ అని రిదా రెహ్మాన్ ఖాజీ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- బుల్లీ బాయి-సుల్లీ డీల్స్ ఏంటి? యాప్‌లో భారతీయ ముస్లిం యువతుల వేలంపై పోలీసులు ఏమంటున్నారు?
- మొబైల్ ఫోన్ కొనేటప్పుడు గుర్తుంచుకోవలసిన ఏడు విషయాలు
- ఆంధ్రప్రదేశ్: ఇద్దరు గిరిజన బాలికలపై నకిలీ పోలీసు అఘాయిత్యం.. అత్యాచారం కేసు నమోదు
- అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టిన చైనా, తీవ్రంగా స్పందించిన భారత్
- దళిత యువకుడు గెడ్డం శ్రీనుది హత్యా, ఆత్మహత్యా... మూడునెలలుగా ఎందుకు తేలడం లేదు?
- వాట్సాప్ మెసేజ్‌లో లింక్ క్లిక్ చేయమన్నారు... రెండున్నర లక్షలు కొల్లగొట్టారు - ప్రెస్‌రివ్యూ
- కొత్త ఏడాదిలో కాస్త హేతుబద్ధంగా ఉందామా... ఇవిగో మూడు మార్గాలు
- RRR విడుదల వాయిదా: కోవిడ్‌తో దెబ్బతిన్న సినిమా థియేటర్ల భవిష్యత్తు ఏంటి... ఓటీటీల ప్రభావం ఎంత?
- హైదరాబాద్‌లో పెరిగిన పెళ్లిళ్లు.. అమ్మాయిల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచే బిల్లు గురించి ఎందుకు భయపడుతున్నారు?
- చరిత్రలో మొట్టమొదటి రివెంజ్ పోర్న్ కేసు.. భార్య నగ్న చిత్రాలు బయటపెట్టిన భర్త.. ఏం జరిగింది?
- మరోసారి రష్యా నమ్మకం గెలుచుకున్న భారత్... అమెరికాను దూరం పెడుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)




