ఇస్రో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10: మూడో దశలో విఫలమైన రాకెట్ ప్రయోగం

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్10

ఫొటో సోర్స్, Twitter/ISRO

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జియోసింక్రనస్ లాంచింగ్ లాంచ్ వెహికల్-ఎఫ్10(జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10) ప్రయోగం విఫలమైంది.

గురువారం ఉదయం 5.43 నిమిషాలకు శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. రాకెట్ ప్రయోగంలో మొదటి రెండు దశలు సవ్యంగానే జరిగాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

‘‘అయితే, ఆ తర్వాతి దశలో సాంకేతిక లోపం వల్ల క్రియోజెనిక్ బూస్టర్ల ప్రజ్వలన జరగలేదు. దీంతో ప్రయోగం విఫలమైందని ఇస్రో ప్రకటించింది’’అని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

బుధవారం ఉదయం 3.43 గంటలకు ఈ రాకెట్ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. దీని సాయంతో 2,268 కిలోల బరువున్న జీఐశాట్-1 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపాలని భావించారు.

ఈ ఉపగ్రహం ద్వారా దేశ రక్షణ వ్యవస్థకు, విపత్తుల నిర్వహణకు ఉపకరించే భూపరిశీలన అంశాలను పర్యవేక్షించాలని భావించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)