బంగారం: ఆర్టీసీ బస్సులో దొరికిన అర కిలో పసిడి, నిజాయితీగా పోలీసులకు అప్పగించిన వ్యక్తి

పోలరాజును అభినందిస్తున్న పోలీసులు

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, పోలరాజును అభినందిస్తున్న పోలీసులు

ఆర్టీసీ బస్సులో దొరికిన రూ.27 లక్షల విలువ చేసే బంగారాన్ని ఓ వ్యక్తి నిజాయితీగా పోలీసులకు అప్పగించారు.

శ్రీకాకుళం జిల్లా నుంచి 454 గ్రాముల బంగారాన్ని దుర్గారావు అనే వ్యాపారి విశాఖపట్నానికి తీసుకొస్తుండగా బస్సులోనే మరచిపోయారు.

విశాఖకు సమీపంలోని మారికవలసలో సంచిని మరచిపోయి దుర్గారావు బస్సు దిగిపోయారు.

బంగారం

ఫొటో సోర్స్, UGC

ఈ ఘటనపై పీఎంపాలెం పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పోలీసులు విచారణ చేపట్టారు.

అయితే, అప్పటికే బంగారం దొరికిందంటూ పోలరాజు అనే వ్యక్తి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

నిజాయితీతో రూ.27 లక్షల విలువైన బంగారాన్ని తిరిగి ఇచ్చినందుకు పోలరాజును పోలీసులు అభినందించారు.

దుర్గారావు.. శ్రీకాకుళంలోని బంగారం వర్తకుల నుంచి గోల్డ్ ముక్కలను తీసుకుని వాటిని ఆభరణాలుగా తయారు చేసి ఇస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)