కర్ణాటకలో ఆక్సిజన్ అందక 24 మంది కోవిడ్ రోగుల మృతి.. ముగ్గురే అంటున్న మంత్రి: News Reel

చామరాజ్ నగర్ ఆసుపత్రి విషాదం

ఫొటో సోర్స్, Anurag basavraj

కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా ఆసుపత్రిలో 24 మంది రోగులు ఆక్సిజన్ అందక మరణించారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపించారు.

కోవిడ్ పేషెంట్లు సహా మొత్తం 24 మంది రోగులు గత 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు.

అయితే, అధికారులు మాత్రం ఈ మరణాలకు ఆక్సిజన్ కొరత కారణం కాదంటున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

పోస్టుమార్టం రిపోర్టులు వచ్చిన తరువాత కారణాలు తెలుస్తాయని.. మృతులకు ఆరోగ్య సమస్యలున్నాయని.. ఆక్సిజన్ కొరత వల్లే చనిపోయారని చెప్పలేమని అధికారులు చెప్పారు.

మరోవైపు కర్ణాటక ఆరోగ్య మంత్రి దీనిపై స్పందిస్తూ ముగ్గురు మాత్రమే ఆక్సిజన్ కొరత వల్ల చనిపోయారని చెప్పారు.

సీఎం జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGAN

కరోనావైరస్‌ కట్టడికి ఆంధ్రప్రదేశ్‌లో మే 5 నుంచి కొత్త ఆంక్షలు, జగన్‌ ప్రభుత్వం నిర్ణయం

కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది.

కోవిడ్‌-19 నియంత్రణ చర్యలను సమీక్షించిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మే 5 (బుధవారం) నుంచి రాష్ట్రంలో కొన్ని కొత్త ఆంక్షలు, పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని షాపులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే తెరిచి ఉంచాలి.

ఆ తర్వాత అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తారు. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకూ 144 సెక్షన్ కూడా అమలులో ఉంటుంది.

ఏపీలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది.

దేశవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 23,290 పాజిటివ్ కేసులు నమోదవగా, కోవిడ్ వల్ల 83 మంది చనిపోయారు.

తెలంగాణలో కూడా గత 24 గంటల్లో 5,695 కొత్త కేసులు నమోదయ్యాయి. 49 మంది చనిపోయారు.

రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను మే 8 వరకూ పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)