ఈటల రాజేందర్‌‌కు ఉద్వాసన... మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగిస్తూ ఆదేశాలు

ఈటల రాజేందర్

ఫొటో సోర్స్, EetalaPC

ఫొటో క్యాప్షన్, ఆరోపణల అనంతరం ప్రెస్ మీట్‌లో మంత్రి ఈటల రాజేందర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన మేరకు ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు గవర్నర్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ ఆయ్యాయి.

ఈ మేరకు గవర్నర్ కార్యాలయం మీడియాకు కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది.

శనివారం నాడే ఈటల నిర్వహిస్తున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖను సీఎంకు బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. భూకబ్జా ఆరోపణల్లో చిక్కుకుని విచారణ ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ నిర్వహిస్తున్న శాఖను బదిలీ చేయాలని సీఎం చేసిన సిఫార్సుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు.

ఆ మరునాడే ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి సూచించడం, గవర్నర్ కార్యాలయం దానికి ఆమోదముద్ర వేయడం జరిగిపోయింది.

శుక్రవారం నాడు కొందరు రైతులు తమ అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేశారని ఆరోపణలు చేశారు. దానిపై, మీడియాలో వరసగా వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. ఆ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు.

ఆరోగ్య శాఖను తన నుంచి బదిలీ చేసిన తరువాత ఈటల స్పందించారు. "గత రెండు సంవత్సరాలుగా, ముఖ్యంగా గత 395 రోజులుగా ఒక్క రోజు కూడా విరామం లేకుండా పనిచేస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు" తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి, కుటుంబాలను వదిలిపెట్టి ప్రజలకు కరోనా చికిత్స అందించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, డాక్టర్స్, నర్సులు, సెక్యూరిటీ సిబ్బంది, శానిటరీ స్టాఫ్, నాలుగవ తరగతి సిబ్బంది, గ్రామాల్లో పని చేస్తున్న ANM లు, ఆశా వర్కర్లు అందరికీ శిరస్సు వంచి ధన్యవాదములు తెలుపుతున్నానని అన్నారు. ఈటల రాజేందర్.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఏప్రిల్ 30వ తేదీన ఈటల రాజేందర్ పై కొందరు రైతులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. కొన్ని మీడియా సంస్థలు ఈ వార్తను ప్రముఖంగా ప్రసారం చేశాయి. వాటిపై స్పందించిన ముఖ్యమంత్రి ఈటల భూ ఆక్రమణ ఆరోపణలపై రెవెన్యూ, విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దానిపై స్పందించిన ఈటల రాజేందర్ తానే తప్పూ చేయలేదని వివరణ ఇచ్చారు.

ఫిర్యాదు చేసిన రైతుల భూముల దగ్గర శని, ఆదివారాలు రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. రాజేందర్ నుంచి ఆరోగ్య శాఖను తప్పించి తన వద్దే ఉంచుకున్నారు ముఖ్యమంత్రి. అసైన్డ్ భూముల విషయంలో ఈటల రాజేందర్ అక్రమాలకు పాల్పడినట్టుగా మెదక్ జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చారు. దీంతో ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందిగా గవర్నర్‌ను కోరారు ముఖ్యమంత్రి.

ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు గవర్నర్ ఈటల రాజేందర్ ను తెలంగాణ మంత్రి మండలి నుంచి తొలగించింది.

(ఈ వార్త అప్డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)