కోవిడ్ వ్యాక్సీన్: మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా... కేంద్రం ప్రకటన

వ్యాక్సీన్

ఫొటో సోర్స్, EPA/BIONTECH

మే నెల 1 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృత స్థాయిలో అందరికీ వర్తించేలా ఉంటుందని కేంద్ర ఆరోగ్య - కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

మూడో దశ వ్యాక్సినేషన్ వ్యూహంలో భాగంగా దేశంలోని వ్యాక్సీన్ ఉత్పత్తిదారులు కేంద్ర ఔషధ ప్రయోగశాల విడుదల చేసిన డోసుల్లో 50 శాతాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా 50 శాతం డోసులను వారు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఓపెన్ మార్కెట్‌కు ఇవ్వొచ్చని ప్రభుత్వం ఆదేశించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కేంద్ర ప్రభుత్వం తనకు లభించిన వాటాలోని టీకాల డోసులను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయిస్తుంది. ఈ కేటాయింపులు ఆయా రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి తీవ్రతను ఆధారంగా చేసుకుని నిర్ణయిస్తారు.

వ్యాక్సీన్ డోసులను 50 శాతం కేంద్రానికి, 50 శాతం ఓపెన్ మార్కెట్‌కు ఇవ్వడమనే నిబంధన భారతదేశంలోని అన్ని వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థలకు వర్తిస్తుంది. అయితే, పూర్తిగా వినియోగానికి సిద్ధంగా దిగుమతి అయిన టీకాలను ప్రభుత్వేతర మార్గాలలో ఉపయోగిస్తారని కేంద్రం ప్రకటించింది.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, DDNews

వ్యాక్సీన్‌పై ప్రజలల్లో అవగాహన పెంచాలని కోరిన మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నాడు దేశవ్యాప్తంగా ఉన్న కొందరు ప్రముఖ డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. కోవిడ్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. కరోనావైరస్ మహమ్మారి చుట్టుముట్టిన ఈ సందర్భంలో డాక్టర్లు, ఇతర వైద్య సేవల సిబ్బంది అందిస్తున్న సేవలు అమూల్యమైనవని ప్రధాని అభినందించారు.

వ్యాక్సినేషన్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని, వీలైనంత మంది టీకాలు వేయించుకునేలా ప్రోత్సహించాలని ఆయన డాక్టర్లను కోరారు. ప్రస్తుతం కోవిడ్ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో విస్తరిస్తోందని చెప్పిన మోదీ, పెద్ద నగరాల్లోని డాక్టర్లందరూ పట్టణాల వైద్యులతో అనుసంధానమైన పని చేయాలని, కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా ఆన్ లైన్ కన్సల్టేషన్స్ కొనసాగించేలా ప్రయత్నించాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)