రకుల్ ప్రీత్ సింగ్: ‘దాని గురించి మాట్లాడటం ఆపేయాలి.. మగవాళ్లకు లేనప్పుడు మహిళలకు ఎందుకు?’
‘‘జీవితంలో చిన్నచిన్న సంఘటనలే మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఆయా సంఘటనలను మనం సంపూర్ణంగా జీవించాలి’’ అంటున్నారు సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్.
బీబీసీ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘మనకు ఇల్లు ఉంది. మంచి ఆరోగ్యం ఉంది. మనకు ఉన్నదాని పట్ల మనం సంతోషంగా, సంతృప్తిగా ఉండాలి. కృతజ్ఞతతో ఉండాలి. మనకు వీలైనంతలో లేనివాళ్లకు సాయం చేయాలి’’ అని ఆమె అన్నారు.
సరిహద్దుల్లో సైన్యం మనకోసం యుద్ధం చేస్తోందని, అలాంటిది ప్రజలంతా ఏసీలో కూర్చుని, ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా కరోనావైరస్‌తో యుద్ధం చేయడానికి ఎలాంటి సమస్యా ఉండకూడదని ఆమె అభిప్రాయపడ్డారు.
‘‘ఫిట్‌నెస్ అంటే మనం ఎలా కనిపిస్తున్నాం అని కాదు.. మనల్ని మనం ఎలా ఫీల్ అవుతున్నాం అని. నేను చెమట చిందించకపోతే మంచిగా ఉండలేను’’ అని తన ఫిట్‌నెస్ గురించి తెలిపారు.

ఫొటో సోర్స్, facebook/ActressRakulPreet
‘దాని గురించి మాట్లాడటం ఆపేయాలి’
మహిళా సాధికారత గురించి రకుల్ ప్రీత్ మాట్లాడుతూ.. ‘‘మహిళా సాధికారత అనేది మహిళల నుంచే ప్రారంభం కావాలి. మనం ఎవరితో పోల్చినా తక్కువ కాదు అని విశ్వసించాలి. ఇప్పుడు దీని గురించి అంతా మాట్లాడటం మంచి విషయం. మహిళా దినోత్సవం లాగా పురుషుల దినోత్సవం ఉందా? లేదు కదా.. అలాంటప్పుడు మహిళల దినోత్సవం ఎందుకు జరపాలి? అలా మనకు మనమే (మహిళలు) బలహీనులమని చెప్పుకుంటున్నాం. పురుష సాధిరాకత గురించి మనం మాట్లాడుకోం. మహిళా సమానత్వం సాధించడానికి చాలా సమయం పడుతుంది. ప్రతి మహిళ తనను తాను విశ్వసించినప్పుడు, తనపై తాను నమ్మకం పెంచుకున్నప్పుడు, తన హక్కుల కోసం నిలబడ్డప్పుడు, తన కలలను సాధించుకోవడం ప్రారంభించినప్పుడు, పురుషులంతా తమతమ మహిళలకు మద్దతు ఇచ్చినప్పుడు సమాజం మారుతుంది.’’
కరోనావైరస్ లాక్‌డౌన్ జీవితం గురించి రకుల్ ప్రీత్ ఏమంటున్నారు? లాక్‌డౌన్ తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నారు? ఈ పరిస్థితుల నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి? లాక్ డౌన్ సమయంలో దాదాపు 300 కుటుంబాల ప్రజలకు ఆహారం అందించాలని నిర్ణయించుకోవడానికి ముందు ఆమె ఆలోచనలు ఏంటి? ఫిట్‌నెస్‌ను ఇష్టపడే ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారు? దక్షిణాది సినిమా పరిశ్రమలకు, బాలీవుడ్ సినిమా పరిశ్రమకు పని విధానంలో ఉన్న తేడాలేంటి? సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి ఆమె ఏమన్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్‌డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలైంది?
- బ్యాగరి మహిళలు: శవాల మధ్య బతుకు పోరాటం
- Mother's Day: మాతృ దినోత్సవాన్ని మొదలుపెట్టింది ఈమే.. దీన్ని రద్దు చేయాలని మొదట్లోనే డిమాండ్ చేసిందీ ఈమే
- స్విట్జర్లాండ్: సమాన వేతనం, గౌరవం కోసం రోడ్డెక్కిన మహిళలు
- ఒక మహిళ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేది ఎప్పుడు?
- మహిళా రిజర్వేషన్ల మీద ఎందుకు ప్రశ్నించరు... :అభిప్రాయం
- శ్రీజ డెయిరీ: ‘పూర్తిగా మహిళలతో నడుస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుల సంస్థ’
- మరో వందేళ్లూ మహిళలకు సమానత్వం కలే!
- ఆ ప్రొడ్యూసర్ల భార్యలే ‘ఒప్పుకోమనేవారు’
- రైల్వే ప్రైవేటీకరణ- ఈ ఒప్పందం వల్ల ఎవరికి ఎంత ప్రయోజనం, ఎంత లాభం?
- వ్లాదిమిర్ పుతిన్: ఒకప్పటి గూఢచారి.. ప్రపంచనేతగా ఎలా ఎదిగారు?
- చైనా దాడిపై భారత్‌కు నిఘా సమాచారం అందలేదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)