భీమా కోరేగావ్ కేసు; ఆనంద్ తేల్‌తుంబ్డే, గౌతమ్ నవలఖాల బహిరంగ లేఖలు

ఆనంద్ తేల్‌తుంబ్డే

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ముంబయి ఎన్ఐఏ వద్ద లొంగిపోయిన ఆనంద్ తేల్‌తుంబ్డే

భీమాకోరేగావ్ కేసులో మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న దళిత మేధావి, రచయిత ఆనంద్ తేల్‌తుంబ్డే మంగళవారం నాడు ముంబయిలోని ఎన్‌ఐఏ ఎదుట లొంగిపోయారు. అయితే, లొంగిపోవడానికి ముందు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు.

జీవితంలో ఇటువంటి భయానక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎన్నడూ పీడకలలో సైతం ఊహించలేదని, నిరాధార ఆరోపణలతో తనను జైలులో పెడుతున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

పోలీసులు తనపై నిఘా ఉంచడం, ఇంట్లో సోదాలు జరపడం, తనపై చేసిన ఆరోపణల గురించి వివరించారు. ఇటువంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చునన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఆయన లేఖలోని కొన్ని భాగాలు:

''ఒక వ్యక్తికి ఎటువంటి రక్షణా లేకుండా చేసే యూఏపీఏ వంటి చట్టం కింద నన్ను జైలులో పెడుతున్నారు. ఈ కేసును ఇలా వివరించవచ్చు. అకస్మాత్తుగా ఓ పోలీసు దళం ఎటువంటి వారెంటూ చూపకుండానే మీ ఇంటి మీదకు వచ్చి, ఇల్లంతా గుల్ల చేస్తుంది. చివర్లో మిమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ లాకప్‌లో వేస్తారు.

కోర్టులో.. ఏదో xx అనే ప్రాంతంలో ఒక దొంగతనం కేసులో (లేదంటే మరేదో ఫిర్యాదు మీదనో) దర్యాప్తు చేస్తుంటే, ఎవరో y అనే వారి నుంచి ఒక పెన్ డ్రైవ్ లేదా ఒక కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఏదో ఒక నిషిద్ధ సంస్థ రాసినట్లు భావిస్తున్న కొన్ని లేఖలను అందులో గుర్తించామని.. ఆ లేఖలో zz అనే పేరు ప్రస్తావన ఉందని, ఆ పేరున్న వ్యక్తి మరెవరో కాదు... మీరే అని పోలీసులు భావిస్తున్నారని - చెప్తారు.

ఒక లోతైన కుట్రలో మిమ్మల్ని భాగస్వామిగా చూపుతారు. ఉన్నపళంగా మీ ప్రపంచం తల్లకిందులై కల్లోలమవుతుంది. మీ ఉద్యోగం పోతుంది, కుటుంబానికి ఇల్లు ఉండదు, మీడియా మిమ్మల్ని అపఖ్యాతి పాలు చేస్తుంది. దానికి మీరేమీ చేయలేరు. మీ మీద ప్రాథమికంగా స్పష్టమైన కేసు ఉందని, మిమ్మల్ని కస్టడీలో ఇంటరాగేట్ చేయాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తులను ఒప్పించటానికి పోలీసులు 'సీల్డ్ కవర్లు' సమర్పిస్తారు.

సాక్ష్యాధారాల గురించి విచారణలో చూద్దామని న్యాయమూర్తులు జవాబు చెప్తారు.. వాటికి సంబంధించిన వాదనలేవీ ఉండవు. కస్టడీలో ఇంటరాగేషన్ తర్వాత మిమ్మల్ని జైలుకు పంపుతారు. మీరు బెయిల్ కోసం ప్రాధేయపడతారు, కోర్టులు మీ వాటిని తిరస్కరిస్తాయి. జైలు నిర్బంధం నుంచి బెయిలు రావటానికి కానీ, విడుదలవటానికి కానీ ముందు సగటున నాలుగు సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పడుతుందని చారిత్రక గణాంకాలు చెప్తున్నాయి.

ఇది నిజంగా ఎవరికైనా జరగొచ్చు. ఇటువంటి క్రూరమైన చట్టాలకు 'జాతి' పేరుతో రాజ్యాంగబద్ధత కల్పిస్తున్నారు. అసమ్మతిని ధ్వంసం చేస్తూ, ప్రజల్లో చీలికలు తెచ్చే రాజకీయ వర్గం... జాతీయతావాదాలను ఆయుధాలుగా మార్చాయి. సామూహిక ఉన్మాదం సంపూర్ణ నిర్హేహేతుకతను సాధించింది, అర్థాలను తారుమారు చేసింది. ఇక్కడ నిస్వార్థ ప్రజాసేవకులు దేశద్రోహులుగా మారారు.

నా భారతదేశం నాశనమై పోతుండటం చూస్తూ, ఇటువంటి బాధాకరమైన సమయంలో బలహీనమైన ఆశతో మీకు లేఖ రాస్తున్నాను. నేను ఎన్‌ఐఏ కస్టడీలోకి వెళుతున్నాను. మళ్లీ మీతో ఎప్పుడు మాట్లాడగలనో నాకు తెలియదు. అయినా, మీ వంతు రావటానికి ముందే మీరు గొంతెత్తుతారని ప్రగాఢంగా ఆశిస్తున్నా''

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఈ రోజే ఎన్ఐఏ ఎదుట లొంగిపోయిన మానవ హక్కుల ఉద్యమకారుడు గౌతమ్ నవలఖా కూడా అంతకుముందు ఒక బహిరంగ లేఖ రాశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం ఒక వ్యక్తి నిర్దోషి కాదని నిరూపణ అయ్యేంతవరకు దోషే అనే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.

గౌతమ్ నవఖా లేఖలో కొంత భాగం:

దిల్లీలోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో లొంగిపోవటానికి నేను సిద్ధమవుతున్నాను. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలు నాకు మరొక వారం రోజుల స్వాతంత్ర్యం ఇస్తూ 2020 ఏప్రిల్ 8వ తేదీన ఉత్తర్వులు ఇవ్వటం నాకు సంతోషాన్నిచ్చింది. నా పరిస్థితిలో ఒక వారం రోజుల స్వాతంత్ర్యం అంటే, లాక్‌డౌన్ శకంలో కూడా చాలా విలువైనది.

నేను ముంబయిలోని ఎన్‌ఐఏ ఎదుట ఏప్రిల్ ఆరో తేదీ కల్లా లొంగిపోవాలంటూ సుప్రీంకోర్టు మార్చి 16న ఇచ్చిన ఉత్తర్వును పాటించటంలో ఎదురైన ప్రతికూల పరిస్థితిని వారి ఉత్తర్వు పరిష్కరించింది.

అనంతరం విధించిన లాక్‌డౌన్ వల్ల నేను ప్రయాణం చేయటం సాధ్యం కాలేదు. అటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలనే దాని గురించి ఎన్ఐఏ నుంచి ఎటువంటి మార్గదర్శకమూ అందలేదు. ఇప్పుడు నేను స్వయంగా దిల్లీలోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో లొంగిపోవాల్సి ఉంటుందని నాకు తెలుసు.

కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎదురైన సవాలు ''జాతీయ అత్యవసర పరిస్థితి'' వంటిదని భారత ప్రధానమంత్రి అభివర్ణించారు. ఇదిలావుంటే, జైలు పరిస్థితుల మీద సుప్రీంకోర్టు ఇటీవల స్వయంగా జోక్యం చేసుకుని, జైలు ఖైదీల సమ్మర్థానికి సంబంధించి, ఖైదీలు, నిర్బంధంలో ఉన్నవారికి, జైలు సిబ్బందికి, జైలు విధుల్లో ఉన్న ఇతర సిబ్బందికి పొంచివున్న ముప్పు గురించి అధికారులకు మార్గదర్శకాలు జారిచేసింది.

వరవరరావు, గౌతమ్ నవలఖా, సుధా భరద్వాజ్

ఫొటో సోర్స్, GETTY / GETTY / FACEBOOK

ఫొటో క్యాప్షన్, వరవరరావు, గౌతమ్ నవలఖా, సుధా భరద్వాజ్

ఇప్పటివరకూ ఏ జైలు నుంచీ కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ కేసు రాకపోయినప్పటికీ ఈ ఆందోళన అలాగే ఉన్నప్పటికీ, నాకు కొంత భరోసానిస్తోంది. అయితే, కోవిడ్-19 మధ్య నేను నిర్బంధంలో ఉండటం నా ఆత్మీయుల్లో ఉన్న ఆందోళన గురించిన భయం నామీద ప్రభావం చూపుతోంది.

సుప్రీంకోర్టు ఏప్రిల్ 8వ తేదీన ఇచ్చిన ముక్తసరి ఉత్తర్వులో, భారతదేశంలోని మనందరితో పాటు ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్న కోవిడ్-19 మహమ్మారి గురించి ప్రస్తావన లేకపోవటం పట్ల నేను నిరాశ చెందకుండా ఉండలేకపోయా.

అయినప్పటికీ, ఇప్పుడు నేను వాస్తవమైన న్యాయ ప్రక్రియను ప్రారంభించవచ్చు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని నిబంధనలను విధించిన కేసులు ఇందులో ఉన్నాయి. అటువంటి చట్టాలు సాధారణ న్యాయశాస్త్ర సూత్రాలను తలకిందులు చేస్తాయి. ''ఒక వ్యక్తి దోషిగా నిరూపితమయ్యే వరకూ నిర్దోషే' అనే సూత్రం ఇక్కడ వర్తించదు. నిజానికి ఇటువంటి చట్టాల కింద.. 'ఒక వ్యక్తి దోషి కాదని నిరూపితమయ్యే వరకూ దోషే'.

యూఏపీఏ కింద నిర్దేశించిన కఠినమైన శిక్షలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ చట్టంలోని క్రూరమైన నిబంధనలతో పాటు సాక్ష్యాధారాలకు సంబంధించి, ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ సాక్ష్యాలకు సంబంధించి కఠినమైన విధివిధానాలు లేవు. మామూలుగా అయితే, సాక్ష్యాధారాలకు సంబంధించి కఠినమైన నిబంధనలు గల ప్రక్రియలను ఇక్కడ స్థితిస్థాపకంగా మార్చారు.

ఈ ద్వంద్వ శాపాల కింద జైలు సాధారణ విషయంగానూ, బెయిలు అసాధారణంగానూ మారతాయి. కాఫ్కా కథల్లో కనిపించే పీడకలల వాతావరణం వంటి ఈ అధికార పరిధిలో ప్రక్రియ శిక్షగా మారుతుంది.

నాకు, నా సహ నిందితులకు సత్వరమైన, న్యాయమైన విచారణ జరుగుతుందని ఆశిస్తున్నాను. నేను నిర్దోషిగా బయటపడటానికి, నేను చేసుకున్న అలవాట్లను వదిలించుకోవటానికి జైలులో గడిపే సమయాన్ని ఉపయోగించుకున్న తర్వాత స్వేచ్ఛగా బయటకు రావటానికి ఇదొక్కటి మాత్రమే దోహదపడుతుంది.

అప్పటి వరకూ...

'స్వేచ్ఛా గీతికల ఆలాపనలో

నాతో గళం కలుపవా

మరి నా పాటలన్నీ

విముక్తి గేయాలే

విముక్తి గేయాలే...

ఈ స్వేచ్ఛా గీతికలు' - బాబ్ మార్లే'

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)