ఒడిశా: హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి బస్సులో మంటలు... తొమ్మిది మంది మృతి

ఒడిశా గంజాం జిల్లాలో నిశ్చితార్థానికి వెళ్ళి వస్తున్న బంధువులతో ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు.
బ్రహ్మాపూర్ మండలంలోని గోలంతర గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. 11 కేవీ విద్యుత్ తీగలు బస్సుకు తగలడంతో ఈ దారుణం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారని స్థానిక పోలీసు అధికారి బీబీసీకి చెప్పారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సులోని ప్రయాణికులంతా తమ బంధువుల ఇంట్లో నిశ్చితార్థం వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారు.
గంజాం జిల్లా కలెక్టర్ విజయ అమృత్ కులాంగే, "గోలంతర వద్ద బస్సు 11 కేవీ విద్యుత్ వైర్లకు తగలడంతో వెంటనే మంటలు వ్యాపించాయి. ఆ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. మరో 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు" అని ఏఎన్ఐ వార్తా సంస్థకు చెప్పారు.

గాయపడిన వారిని ఎంకేసీజీ మెజికల్ కాలేజికి చికిత్స కోసం పంపించినట్లు కూడా ఆయన తెలిపారు. అయితే, మరి కొందరి పరిస్థితి కూడా విషమంగా ఉందని, మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని కులాంగే చెప్పారు.
ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు ఒడిశా రవాణ శాఖ మంత్రి పద్మనాభ బెహెరా చెప్పారని ఏఎన్ఐ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- బాగ్దాద్ గోడలపై ప్రతిబింబిస్తున్న మహిళల చైతన్యం
- కరోనావైరస్: అందర్నీ వణికిస్తున్న వైరస్ ఎన్నో ప్రాణులను కాపాడుతోంది
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
- ఐఫోన్ పాత మోడళ్ళ వేగం తగ్గిస్తున్నందుకు యాపిల్‌కు 193 కోట్ల జరిమానా
- కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'
- హోంశాఖ సమాధానంపై వైసీపీ, టీడీపీ ఏమంటున్నాయి? గజెట్ ప్రాధాన్యం ఎంత
- దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




