గుజరాత్: అహ్మదాబాద్, రాజ్‌కోట్‌లో ఒకే నెలలో 200 మంది నవజాత శిశువుల మృతి

నవజాత శిశువుల మృతి

ఫొటో సోర్స్, Getty Images

గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్‌ ఆస్పత్రుల్లో డిసెంబర్‌లో 200 మంది నవజాత శిశువులు మృతిచెందిన విషయం వెలుగులోకి వచ్చింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

డిసెంబరులో రాజ్‌కోట్ సివిల్ హాస్పిటల్లో 111 మంది చిన్నారులు మృతి చెందారని రాజ్‌కోట్ సివిల్ ఆస్పత్రి డీన్ మనీష్ మెహతా చెప్పినట్లు వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ చెప్పింది.

"డిసెంబర్‌లో 455 మంది నవజాత శిశువులను ఎన్ఐసీయూలో చేర్చారు. వారిలో 85 మంది మృతి చెందారు" అని అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ జీఎస్ రాథోడ్ ఏఎన్ఐతో చెప్పారు.

అయితే, 'ది హిందూ'లో ప్రచురించిన ఒక కథనంలో రాజ్‌కోట్ సివిల్ హాస్పిటల్లో 134 మంది నవజాత శిశువులు మృతిచెందినట్లు చెప్పారు.

ఇటీవల రిపోర్టులు, గుజరాత్ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల ప్రకారం 2019 డిసెంబర్‌లో రాజ్‌కోట్ సివిల్ ఆస్పత్రిలో ఎప్పుడూ లేనంత అత్యధికంగా 131 మంది నవజాత శిశువులు చనిపోయారు. ఇదే నెలలో అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో 83 మంది చిన్నారులు మృతి చెందినట్లు నమోదైంది.

రాజస్థాన్‌లోని కోటా ఆస్పత్రిలో చిన్నారుల మృతి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గెహ్లాట్ ప్రభుత్వం దీనిపై తీసుకున్న చర్యల గురించి ప్రశ్నిస్తున్నారు.

ఈలోపు గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్‌లో కూడా నవజాత శిశువులు మృతి చెందిన కేసులు వెలుగులోకి వచ్చాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

వడోదరలో ఒక కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీని దీనిపై ప్రశ్నించినపుడు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోవడం విశేషం.

మృతిచెందిన చిన్నారుల్లో ఎక్కువ మంది నవజాత శిశువులే ఉన్నట్లు స్థానిక మీడియా చెబుతోంది.

శిశువుల మృతిపై రాష్ట్ర కాంగ్రెస్ గుజరాత్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది.

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావ్డా మీడియా సమావేశంలో గుజరాత్ ప్రభుత్వ వైఫల్యాలు వెలుగుచూస్తున్నాయని అన్నారు.

"గుజరాత్‌లోని రెండు నగరాల్లో మొత్తం 219 మంది శిశువులు చనిపోయారు. మొత్తం రాష్ట్రంలో చూస్తే ఈ గణాంకాలు బహుశా వేలల్లో బయటపడవచ్చు" అన్నారు.

ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ కూడా దీనిపై ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

"ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది కొరతతో రాష్ట్రంలో ప్రాథమిక వైద్య సేవలు కుప్పకూలడం ఈ విషాదానికి దారితీసింది. నాణ్యమైన వైద్య సేవలు పొందలేకపోతున్న పేదలను గుజరాత్ మోడల్ చంపేస్తోంది" అని రాశారు.

గుజరాత్ శిశుమరణాలు

ఫొటో సోర్స్, TWITTER/VIJAYRUPANIBJP

ఫొటో క్యాప్షన్, విజయ్ రూపానీ

గుజరాత్ ప్రభుత్వం ఏం చెబుతోంది

మొదట మీడియాకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తర్వాత "ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. మేం దీని గురించి మరిన్ని వివరాలు ఇస్తాం" అని చెప్పారు.

బీబీసీ ప్రతినిధి భార్గవ్ పారేఖ్‌తో మాట్లాడిన గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్.. గుజరాత్‌లో శిశువుల మృతికి కారణం తెలుసుకోడానికి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

"శీతాకాలంలో నవజాత శిశుమరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. కానీ అది ఏడాదంతా ఎక్కువగా ఉంటే ఆందోళనకర విషయమే. మేం పరిస్థితిని అంచనా వేస్తున్నాం. తర్వాత చర్యలు తీసుకుంటాం" అన్నారు.

దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీతూ వాఘానీ.. "దీనిపై దర్యాప్తు చేస్తాం. ఏదైనా లోపం ఉంటే, సరిచేసి, భవిష్యత్తులో మళ్లీ ఎవరికీ ఇలా జరగకుండా చూస్తాం. ఇందులో ఎవరిదైనా తప్పు ఉన్నట్లు తేలితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దీన్నుంచి నేర్చుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

రాజ్‌కోట్, అహ్మదాబాద్ ఆస్పత్రుల్లో శిశువుల మృతిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం కావడంతో గుజరాత్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి నితిన్ పటేల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

"దేశంలోనే అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 47 శాతం శిశు మరణాలు సంభవిస్తున్నాయి. గుజరాత్‌లో అది 30 శాతమే" అని సమావేశంలో ఆయనన్నారు.

గుజరాత్‌లో 1997లో ప్రతి వెయ్యి మందికి 62 మంది శిశువులు ప్రసవం సమయంలో చనిపోయారు. ఇక 2007లో కేంద్ర ప్రభుత్వ గణాంకాలను బట్టి 30 మంది శిశువులు మృతిచెందారు అని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సాఫ్ట్‌వేర్ సాయంతో పిల్లల జననమరణాలు నమోదు చేస్తోందని, ఇప్పుడు శిశుమరణాల రేటు 25 శాతం కంటే తక్కువకు చేరిందని ఆయన చెప్పారు.

శీతాకాలంలో రకరకాల కారణాల వల్ల శిశుమరణాల సంఖ్య పెరుగుతుందని చెప్పిన నితిన్ పటేల్... రాజ్‌కోట్, అహ్మదాబాద్ ఆస్పత్రుల గణాంకాలు కూడా వెల్లడించారు.

గుజరాత్ శిశుమరణాలు

ఫొటో సోర్స్, NITIN PATEL SOCIAL

ఫొటో క్యాప్షన్, నితిన్ పటేల్

"డిసెంబర్‌లో రాజ్‌కోట్‌లోని ఆస్పత్రిలో మొత్తం 804 మంది మహిళలు ప్రసవించారు. వారిలో 228 మంది శిశువులను సీరియస్ పరిస్థితుల్లో షిఫ్ట్ చేశారు. మరో 160 మంది పిల్లలను మిగతా ఆస్పత్రుల నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు. మొత్తం 388 మంది చిన్నారుల్లో 111 మంది మృతి చెందారు, అంటే 28 శాతం" అన్నారు.

నితిన్ పటేల్ గత రెండు నెలల గణాంకాలను కూడా మీడియాకు ఇచ్చారు.

"ప్రసవం తర్వాత సీరియస్‌గా ఉన్న 452 మంది శిశువులను అక్టోబర్‌లో ఆస్పత్రికి తీసుకువచ్చారు. వారిలో 87 మంది చనిపోయారు. ఇక నవంబర్‌లో మొత్తం 456 మంది చిన్నారులను ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా, 71 మంది మృతిచెందారు" అన్నారు.

"అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి కూడా డిసెంబర్లో 849 మంది మహిళలు డెలివరీ కోసం వచ్చారు. వారిలో 172 మంది నవజాత శిశువులకు సీరియస్ అయ్యింది. మరో 243 మంది చిన్నారులను వేరే ఆస్పత్రుల నుంచి తీసుకొచ్చారు. మొత్తం 415 మంది శిశువుల్లో 88 మంది మృతిచెందారు" చెప్పారు.

రాజ్‌కోట్ సివిల్ ఆస్పత్రి దగ్గర ప్రస్తుతం కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)