‘మహిళల ప్రమేయంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయి.. ఫోన్లు వచ్చాక వాళ్లు హద్దులు దాటుతున్నారు’ - భాగ్యరాజా

భాగ్యరాజ

ఫొటో సోర్స్, Facebook/Bhagyaraj

''మొబైల్ ఫోన్లు రాకముందు మహిళలు తమ హద్దుల్లో ఉండేవారు. కానీ, వాటి రాకతో మొత్తం మారిపోయింది. నాకు ఈ విషయం చెప్పడానికి బాధగానే ఉంది. కానీ, రోడ్ల మీద ఎక్కడపడితే అక్కడ ఫోన్లలో గుసగుసలాడే అమ్మాయిలను చూస్తే.. అసలు వాళ్లు ఏం మాట్లాడతారా అని ఆశ్చర్యమేస్తుంది''.. భాగ్యరాజా చేసిన ఇలాంటి అనేక వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి.

నటుడిగా, దర్శకుడిగా, రచయితగా దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భాగ్యరాజా.. ఇప్పుడు మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా విమర్శలకు గురవుతున్నారు.

మహిళల ప్రమేయంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయి అని అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

త్వరలో విడుదల కానున్న 'కరుతుగలై పదివుసై' అనే సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో మహిళలపై నేరాలు, వివాహేతర సంబంధాల గురించి భాగ్యరాజా వివిధ రకాల వ్యాఖ్యలు చేశారు.

''తప్పులు జరగడానికి అనువైన వాతావరణాన్ని మహిళలే సృష్టిస్తారు. వాళ్లు సరిగ్గా నడుచుకుంటే అన్నీ సక్రమంగా ఉంటాయి. అన్నిసార్లూ అబ్బాయిలనే నిందించడం సరికాదు. సూది అనుమతి లేకుండా అందులోకి దారాన్ని ఎక్కించలేం'' అన్నారు.

అక్కడితో ఆగకుండా ఇటీవల తమిళనాడులో సంచలనంగా మారిన పొల్లాచీ రేప్ కేసులో కూడా మహిళలదే తప్పు అన్న అర్థంలో ఆయన మాట్లాడారు.

'పొల్లాచీ కేసులో అబ్బాయిలది మాత్రమే తప్పు కాదు. మీ (ఆడవాళ్ల) బలహీనతలనే వాళ్లు సొమ్ము చేసుకున్నారు. మీరే వారికి ఆ అవకాశం ఇచ్చారు. కాబట్టి, తప్పు మీదే' అని ఆయన వ్యాఖ్యానించారు.

భాగ్యరాజ

ఫొటో సోర్స్, Facebook/Bhagyaraj

''ఒకరికంటే ఎక్కువమంది మహిళలతో సంబంధాలను నెరిపే మానసిక శక్తి మగవాళ్లకు ఉంటుంది. మగవాళ్లు తప్పు చేస్తే వాళ్లు దాన్ని సరిదిద్దుకుంటారు. అదే మహిళలు అలాంటి తప్పు చేస్తే, అది మరో పెద్ద తప్పుకు దారి తీస్తుంది. ఒక మగవాడికి 'చిన్న ఇల్లు' ఉంటే, ఆ చిన్నింటి కోసం అతడు ఏమైనా చేస్తాడు. డబ్బు సాయం చేస్తూ బాగా చూసుకుంటాడు. అలాగని పెద్ద ఇంటికి (భార్యకు) ఇబ్బందులు రానివ్వడు. అదే మరో ప్రియుడు ఉన్న మహిళలకు సంబంధించిన వార్తలను మీరు పత్రికల్లో చూస్తే, ఆ ప్రియుడి కోసం వాళ్లు తమ భర్తనో, పిల్లల్నో చంపేశారన్న విషయం కూడా కనిపిస్తుంది. అందుకే మహిళలు హద్దుల్లో ఉండాలి'' అని ఆయన అన్నారు.

మహిళ ఎలా ఉండాలో చెబుతూ ఆయన మరో కథ కూడా వినిపించారు. అది ఓ సినిమా కోసం ఆయన గతంలో రాసిన కథే.

'ఓ అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు. కానీ, వాళ్ల తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోరు. దాంతో వారు ఆత్మహత్య చేసుకుందామనుకుంటారు. చనిపోవడానికి ముందు సంతోషంగా ఉందామని (సెక్స్‌లో పాల్గొందామని) అబ్బాయి అడుగుతాడు. కానీ, ఆ అమ్మాయి తన తండ్రికి కూతురిగా (కన్యగా)నే చనిపోతానని సూసైడ్ నోట్ రాస్తుంది తప్ప ఆ పని చేయనంటుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతీయువకుల తల్లిదండ్రులు వారికి క్షమాపణ చెప్పి వాళ్ల పెళ్లి చేయడానికి అంగీకరిస్తారు. అలాంటి 'మెచ్యూరిటీ ఉన్న మహిళ'లు కూడా ఉంటారు'' అని భాగ్యారాజా వ్యాఖ్యానించారు.

దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఆయన ప్రసంగంలో మహిళలపైన ఆయన అనేక వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిల రక్షణ కోసమే తండ్రులు వారికి సెల్ ఫోన్ కొనిస్తారని, కానీ అమ్మాయిలు వాటిని దుర్వినియోగం చేస్తారని చెప్పారు.

భాగ్యరాజా చేసిన ఈ వ్యాఖ్యలను ట్విటర్‌లో చాలామంది మహిళలు విమర్శిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

''ఈ వ్యాఖ్యాలకు జనాలు చప్పట్లు కొడుతున్నారా? ఇలాంటి ఆలోచనలను ప్రోత్సహిస్తున్నారా? అబ్బాయిలను బాధితులుగా చూపాలంటే వాళ్లపైన జరిగిన లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించాలి. అంతేకానీ ఇలాంటి వ్యవహార శైలి తగదు' అంటూ అపీ షా అనే యూజర్ పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

''ఇది 2019. చాలా రంగాల్లో 'గ్లాస్ సీలింగ్'కు బీటలు వారుతున్నాయి. మహిళా ప్రాధాన్యమున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తమ తమ రంగాల్లో దూసుకెళ్తున్న సూపర్ స్టార్ మహిళలు ఉన్నారు. మరోపక్క అందరికీ బాగా తెలిసిన భాగ్యరాజా, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు'' అని స్మితా అనే మహిళ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

''భాగ్యరాజా.. ఎంత బాగా చెప్పారు. అమ్మాయిలు చేసే అవకాశం ఇస్తారు. అబ్బాయిలు కాబట్టి వాళ్లు చేయాల్సింది చేస్తారు. అంతే కదా. ఓకే ఓకే ఐన్‌స్టీన్'' అని స్నేహ అనే మరో యూజర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

''మహిళలు బయటకు వచ్చి ధైర్యంగా తమకు జరిగింది చెప్పకపోవడానికి భాగ్యరాజా లాంటి వ్యక్తులు కూడా కారణం. లైంగిక వేధింపులకు గురయ్యే మహిళలు ఎదుర్కొనే వేదనను అర్థం చేసుకునే శక్తి స్త్రీలను కించ పరిచే ఇలాంటి వ్యక్తులకు ఎప్పటికీ ఉండదు'' అని రుద్రాణీ చట్టోరాజ్ అభిప్రాయపడ్డారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో సైతం భాగ్యరాజా వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా దీనిపై స్పందించారు.

భాగ్యరాజా వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని ఆమె అన్నారు. ఆయన వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని, తమిళనాడు ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)