అయోధ్య దీపోత్సవం: 5.5 లక్షల దీపాలతో వెలిగిపోయిన రామ్ కీ పౌడీ.. గిన్నిస్ బుక్‌లో చోటు

ఫొటో సోర్స్, Getty Images
సరయూ నది ఒడ్డుపై కట్టిన 'రామ్ కీ పౌడీ' దీపాలతో వెలిగిపోయింది. అయోధ్య పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది.
రెండేళ్ల క్రితం 'దీపోత్సవం' పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దీపాలను వెలిగించే కార్యక్రమం మొదలుపెట్టింది. ఏటేటా దీపాల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. ఈసారి ఐదున్నర లక్షల దీపాలను వెలిగించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

మెడలో వాలంటీర్ కార్డులు వేసుకున్న చాలా మంది దీపాల ఏర్పాటులో సాయం చేశారు. కొందరు నేలపై కూర్చొని దీపాలను పూల ఆకృతుల్లో పేర్చారు. ఇంకొందరు స్టీల్ ఫ్రేముల్లో అమర్చారు.
వాడి వికలాంగ్ సేవా సంస్థాన్ అనే స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చిన ఇలా శుక్లా అనే కార్యకర్త ఈ ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్నందుకు సంతోషంగా కనిపించారు. తమ సంస్థ నుంచి దాదాపు 30 మంది ఇక్కడికి వచ్చినట్లు ఆమె చెప్పారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
మెట్లపై అట్టముక్కలతో రంగు రంగుల ఏనుగులు, గుర్రాలు, ఒంటెల బొమ్మలు ఏర్పాటు చేశారు.

మోతిహారి ఆలయం సమీపంలో బిహార్ నుంచి వచ్చిన అజయ్ కుమార్ ఝా బీబీసీ బృందానికి కలిశారు. కార్తీక మాసం అంతా తాను అయోధ్యలోనే ఉంటానని ఆయన చెప్పారు.
దీపోత్సవం ఘనంగా జరుగుతుందని విన్నామని, దాన్ని చూడాలని అయోధ్యకు వచ్చామని ఆయన వివరించారు.
రామాయణంలోని అనేక ఘట్టాలను ప్రదర్శించేందుకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
రామ్ కీ పౌడీకి ఒక ఒడ్డున రామాయణ ఘట్టాలను ప్రదర్శించారు. ఇక్కడి నుంచి 500-700 మీటర్ల దూరంలో అయోధ్య నగరం ఉంది.

అక్కడ పాతబడిన దేవాలయాలు.. గడ్డి, చెట్లు మొలవడంతో అందం కోల్పోయిన ఇళ్లు కనిపించాయి.
''అంతా సాధువుల ఆట. వాళ్ల గల్లా పెట్టెలు నడుస్తున్నాయి. మఠాల్లోకి డబ్బులు వస్తున్నాయి. వారితో అయోధ్యకు ఎలాంటి సంబంధమూ లేదు'' అని స్థానిక పాత్రికేయుడు స్కందదాస్ చెబుతున్నారు.
మంత్రులు, అధికారులు, పాత్రికేయులు వెళ్లిపోయిన తర్వాతే తమకు దీపోత్సవం జరిగే చోటుకు వెళ్లే అవకాశం ఉంటుందని స్థానికులు అంటున్నారు.

మూడేళ్ల క్రితం అయోధ్య పేరు ప్రస్తావించాలంటే జనాలు ఆలోచించేవారని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పరిస్థితిని పూర్తిగా మార్చివేసిందని స్వచ్ఛంద కార్యకర్త ఇలా శుక్లా అభిప్రాయపడ్డారు.
అయితే రామ్ కీ పౌడీ అభివృద్ధి జరిగిందని, స్థానికుల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పూ లేదని అంజూ రఘువంశీ అనే యువతి అన్నారు.
ఇవి కూడా చదవండి
- కెనెడాలో ఒక సిక్కు 'కింగ్ మేకర్' ఎలా అయ్యారు?
- అయోధ్య: ఈ సుదీర్ఘ కోర్టు కేసులో తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉంది? పిటిషనర్లు ఏమంటున్నారు?
- అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది...
- కశ్మీర్, గో రక్షణ, మూకదాడులు, మతాంతర వివాహాలపై గాంధీ అభిప్రాయాలేంటి?
- నీళ్లు, టాయిలెట్ పేపర్, మొక్కజొన్న పొత్తు.. బాత్రూమ్లో ఒక్కో దేశానిది ఒక్కో అలవాటు
- పాకిస్తాన్‌లోని వేలాది హిందూ ఆలయాలకు మోక్షం ఎప్పుడు?’
- వోడ్కా, విస్కీ, వైన్, బీర్, పచ్చి గుడ్డు సొన.. ఇవన్నీ కలిపేసి నీళ్లలా తాగేస్తాడు.. చైనాలో పెరుగుతున్న మద్యం దాహానికి ఇది సంకేతమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








