హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: గెలిచేదెవరు

హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. 84.15 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
పోలింగ్ పూర్తయిన గ్రామాల్లోని ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 24న చేపడతారు, అదేరోజు ఫలితాలు వెల్లడవుతాయి.
కాగా ఈ ఎన్నికల్లో మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి పద్మావతి, టీడీపీ నుంచి చావా కిరణ్మయి, బీజేపీ నుంచి కోట రామారావు పోటీ చేశారు.
ఈ ఎన్నికలో మొత్తం ముగ్గురు మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఇక్కడ 2014 లో సార్వత్రిక ఎన్నికలలో 81.18 శాతం ఓట్లు, 2018లో 86. 38 శాతం పోలింగ్ నమోదైంది.

ఫొటో సోర్స్, facebook/uttamkumarreddy
2018 డిసెంబరులో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా హుజూర్‌నగర్ నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి గెలిచారు.
అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవడంతో హుజూర్‌నగర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది.
మహారాష్ట్ర, హరియాణాల్లో అసెంబ్లీ గడువు పూర్తయి ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో వాటితో పాటుగానే హుజూర్‌నగర్‌లోనూ ఉప ఎన్నికల నిర్వహించారు.
ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేశారు. టీఆర్ఎస్ గత ఎన్నికలో ఇక్కడ ఓడిపోయిన శాసనపురి సైదిరెడ్డినే మరోసారి బరిలో దించింది.
2018 ఎన్నికల్లో
గత ఎన్నికలో మొత్తం 1,94,493 ఓట్లు పోలవగా అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి 92,996 ఓట్లు సాధించారు.
శానంపూడి సైదిరెడ్డి 85,530 ఓట్లు పొందారు. దీంతో సుమారు 7 వేల ఓట్ల ఆధిక్యంతో ఉత్తమ్ గెలుపొందారు.
ఆ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లు కూటమిగా ఏర్పడడంతో అక్కడ టీడీపీ నుంచి అభ్యర్థిని నిలపలేదు.
ఈసారి కాంగ్రెస్, టీడీపీలు వేర్వేరుగా పోటీ చేశాయి. టీడీపీ నుంచి చావా కిరణ్మయి తొలిసారి ఎన్నికల బరిలో దిగారు.

ఫొటో సోర్స్, facebook/UtamPadmavathi
కోదాడలో ఓటమి.. హుజూర్‌నగర్‌లో పోటీ
ప్రస్తుతం హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీపడిన పద్మావతి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీచేశారు.
ఆ ఎన్నికల్లో ఆమె టీఆరెస్ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2014లో కోదాడ నుంచి పద్మావతి గెలుపొందారు.
2018 ఎన్నికల్లో ఓటమి తరువాత ఇప్పుడు తన భర్త ప్రాతినిధ్యం వహించిన హుజూర్‌నగర్ ఖాళీ కావడంతో అక్కడ అభ్యర్థిగా బరిలో దిగారు.
ఇవి కూడా చదవండి:
- నారోహితో: జపాన్ కొత్త చక్రవర్తి ఎవరు? ఈ రాజవంశం ఎందుకంత ప్రత్యేకం?
- ఉద్యోగులను ఆఫీసులో ఎక్కువ సేపు పనిచెయ్యనివ్వని డ్రోన్
- బోన్సాయ్: 400 ఏళ్ల వయసున్న చెట్టు దొంగతనం
- టోక్యో ఒలింపిక్స్: పాత సామానుతో.. పతకాల తయారీ
- గుండెల్ని పిండేసే వ్యథ: జైలుకు వెళ్లేందుకు పదేపదే నేరాలు చేస్తున్న జపాన్ వృద్ధులు.. ఎందుకంటే...
- అక్కడ 18 ఏళ్లుదాటినా పెద్దవారు కాదు
- చైనా, జపాన్ల మధ్య ఆకస్మిక స్నేహబంధం
- కారును అడ్డగించి, తుపాకి గురిపెట్టి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు
- నోబెల్ శాంతి పురస్కారం: అబియ్ అహ్మద్ తూర్పు ఆఫ్రికాలో శాంతిని నెలకొల్పారా?
- ఊబకాయంపై ఏడు అపోహలు... తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- సిరియాలో కుర్దులపై టర్కీ 'సైనిక చర్య' ఎందుకు? దీనివల్ల జరగబోయేది ఏమిటి?
- అంతరిక్షంలో నడిచిన మొదటి మానవుడు అలెక్సీ లియోనోవ్ కన్నుమూత.. ఆ నడకలో జరిగిన ప్రమాదం ఏంటంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








