బోన్సాయ్: 400 ఏళ్ల వయసున్న చెట్టు దొంగతనం

ఫొటో సోర్స్, Getty Images
దొంగిలించిన తమ బోన్సాయ్ చెట్లను తిరిగి తెచ్చివ్వాలని సదరు బోన్సాయ్ ప్రేమికులు సోషల్ మీడియాలో వేడుకుంటున్నారు. అంతేకాదు.. ఆ చెట్లను ఎలా సంరక్షించాలో సూచనలు కూడా చేస్తున్నారు.
జపాన్‌లోని టోక్యోలో గల తమ తోట నుంచి ఏడు బోన్సాయ్ వృక్షాలను ఎవరో దొంగలించారని సీజి ఇమురా, ఆయన భార్య వాపోతున్నారు.
‘‘మా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాం. ఆ చెట్లు ఎంతో అపురూపమైనవి’’ అని ఇమురా ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాశారు.
ఈ వామనవృక్షాల విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని సీఎన్ఎన్ ఒక కథనంలో అంచనా వేసింది.
చెట్లను ప్రత్యేక సాగు నైపుణ్యాలతో కురచగా పెంచే బోన్సాయ్ అనేది ఒక సున్నితమైన కళారూపం. ఇది తూర్పు ఆసియాలో పుట్టిన కళ. జపాన్‌లో ఎంతో ప్రాచుర్యం పొందింది.
పూర్తిస్థాయి వృక్షాలను పోలిన ఈ వామనవృక్షాలను కుండీలలోనే పెంచుతారు. వీటికి నైపుణ్యమైన సంరక్షణ అవసరం.
జపాన్ దంపతుల తోట నుంచి దొంగిలించిన బోన్సాయ్ చెట్లలో షింపాకు జూనిపర్ (చవుకు చెట్టువంటిదానికి) చాలా డిమాండ్ ఉంది. ఈ ఒక్క చెట్టు విలువే దాదాపు రూ. 65 లక్షలుగా ఉంటుందని భావిస్తున్నారు.
‘‘మా జూనిపర్ 400 సంవత్సరాలుగా మా దగ్గరే ఉంది. దానికి చాలా సంరక్షణ అవసరం. నీళ్లు లేకపోతే వారం రోజులకు మించి బతకదు’’ అని మిసెస్ ఇమురా జనవరి 24వ తేదీన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
‘‘అది శాశ్వతంగా జీవించగలదు. మేం వెళ్లిపోయిన తర్వాత కూడా. ఆ చెట్టును ఎవరు తీసుకెళ్లినాగానీ దానికి సరిగా నీళ్లు పోయాలని కోరుతున్నా’’ అని ఆమె రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
అపురూపమైన తమ చెట్లను తమకు తిరిగి ఇస్తారని తాము ఆశాభావంతో ఉన్నామని ఈ దంపతులు చెప్తున్నారు.
బోన్సాయ్ ప్రేమికులు, సహ గార్డెనర్లు ఈ దంపతులకు ఫేస్‌బుక్‌లో సానుభూతి, సంఘీభావం తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలోనే అత్యంత తెలివైన కాకి ఇదేనేమో
- ఇంట్లో వాయు కాలుష్యం: గాలి నాణ్యతను పెంచుకునే ఐదు మార్గాలు
- ఆస్ట్రేలియా: స్ట్రాబెర్రీ పండ్లలో సూదులు ఎందుకు దాస్తున్నారు?
- అరుణాచల్ ప్రదేశ్: భారత్-చైనా మధ్య గొడవ ఎందుకు, దీని చరిత్రేంటి?
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- మనకు సూర్యరశ్మి ఎంత అవసరం? డీ విటమిన్ కోసం ఎండలో ఎంత సేపు ఉండాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








