అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ పెచ్చు ఊడిపడి మహిళ మృతి

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ స్తంభానికి చెందిన ఓ పెచ్చు ఊడిపడి మౌనిక అనే మహిళ మృతి చెందారు.
దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించారు.
మౌనిక కూకట్‌పల్లికి చెందిన మహిళ అని, ఆమె భర్త టీసీఎస్‌లో ఉద్యోగి అని ఎల్ అండ్ టీ వెల్లడించింది.

"మెట్రో స్టేషన్‌కు చెందిన ఓ స్తంభం నుంచి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ముక్క ఒకటి ఊడి మౌనిక అనే మహిళపై పడింది. 9 మీటర్ల ఎత్తునుంచి పదునుగా ఉన్న ఆ పెచ్చు పడడంతో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న ఎల్ అండ్ టీ సిబ్బంది ఆమెను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు" అని మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు.

వర్షం కురుస్తున్న కారణంగా మౌనిక మెట్రో స్టేషన్ కింద నిలబడ్డారు. అదే సమయంలో మెట్రో స్తంభం నుంచి పెచ్చు ఊడి పడింది.
మౌనిక కుటుంబానికి తగిన పరిహారం చెల్లించాలని ఎల్ అండ్ టీని ఆదేశించినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి.
- మోదీ విమానానికి పాకిస్తాన్ అనుమతివ్వకపోవడం సరైన చర్యేనా? నిషేధించే హక్కు పాక్‌కు ఉందా?
- పాకిస్తాన్ నుంచి పారిపోయిన గులాలాయీ ఎవరు, ఆమె ఎందుకు అమెరికా చేరారు
- అమెరికా చేరుకున్న మోదీ.. 'Howdy Modi'లో ఏం జరగనుంది?
- సౌదీలో డ్రోన్ దాడులు: అమెరికా చమురును భూగర్భంలో ఎందుకు దాచిపెడుతోంది?
- మహాత్మా గాంధీ మతం ఏమిటి? గాంధీ దృష్టిలో దేవుడు ఎవరు?
- గర్ల్‌ఫ్రెండ్‌కు నీటి లోపల ప్రపోజ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అమెరికన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








