రవిశాస్త్రి: టీమ్ ఇండియా కోచ్‌గా కొనసాగింపు

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
రవిశాస్త్రి భారత క్రికెట్ జట్టు కోచ్‌గా కొనసాగనున్నారు. కపిల్ దేవ్ నేతృత్వంలోని కమిటీ రవిశాస్త్రిని కోచ్‌గా ఎంపిక చేసింది.
మైక్ హెసన్, టామ్ మూడీని వెనక్కు నెట్టి రవిశాస్త్రి మళ్లీ టీమ్ ఇండియా కోచ్ పదవిని అందుకున్నట్లు కమిటీ చెప్పింది.
కోచ్ పదవికి మొత్తం ఆరుగురు రేసులో నిలిచారు. మైక్ హెసెన్, టామ్ మూడీ, రవిశాస్త్రితోపాటు ఫిల్ సిమన్స్, రాబిన్ సింగ్‌కు మాత్రమే తుది లిస్టులో చోటు లభించింది.
కానీ కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన కమిటీ టీమిండియా ప్రధాన కోచ్ పదవికి రవిశాస్త్రే అర్హుడని భావించింది.
వార్తా సంస్థ ఏఎన్ఐ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రవిశాస్త్రి భారత క్రికెట్ జట్టు (సీనియర్ పురుషులు) హెడ్ కోచ్‌గా కొనసాగుతారని క్రికెట్ అడ్వైజరీ కమిటీ తరఫున కపిల్ దేవ్ ప్రకటించినట్లు ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

ఫొటో సోర్స్, Reuters
కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా జట్టు కోచ్‌గా రవిశాస్త్రినే కోరుకున్నాడు.
రవిశాస్త్రి 2017లో చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ అయ్యారు. శాస్త్రి కోచ్‌గా ఉన్నప్పుడు భారత జట్టు టెస్ట్, వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానానికి చేరింది.
అంతే కాదు, టీమిండియా ఆస్ట్రేలియాను మొదటిసారి ఆస్ట్రేలియాలో ఓడించిన ఘనత సాధించింది.
అయితే, రవిశాస్త్రి నేతృత్వంలో టీమిండియా 2019 ప్రపంచకప్ గెలవలేకపోయింది. సెమీ ఫైనల్లో న్యూజీలాండ్ చేతిలో కోహ్లీ సేన పరాజయం మూటగట్టుకుంది.
శాస్త్రి కోచ్ ఎలా అయ్యారు
రవిశాస్త్రి కోచ్ అయిన తర్వాత ఇప్పటివరకూ భారత జట్టు 60 వన్డేలు, 21 టెస్టులు, 36 టీ-20 మ్యాచులు ఆడింది. వీటిలో 43 వన్డేలు, 13 టెస్టులు, 25 టీ-20 మ్యాచుల్లో విజయం సాధించింది.
శాస్త్రిని ఏ కారణాలతో మళ్లీ కోచ్‌గా ఎంపిక చేశారు. సమాధానం ఇచ్చిన కమిటీలోని అన్షుమన్ గైక్వాడ్ "శాస్త్రికి సిస్టం గురించి జట్టులోని ఆటగాళ్ల గురించి బాగా తెలుసు. అతడికి జట్టులోని ఆటగాళ్లతో మంచి సంబంధాలు ఉన్నాయి. అతడి కమ్యూనికేషన్ స్కిల్ కూడా చాలా బాగుంది" అన్నారు.
అటు కపిల్ దేవ్ కూడా "మొదటి ముగ్గురిలో పెద్దగా తేడా లేదు. మేం 100లో ఈ కోచ్‌లకు మా మార్కులు వేశాం. ఒకరికొకరు ఏం మాట్లాడుకోలేదు. శాస్త్రికి సాధారణ ఆధిక్యం లభించింది. హేసన్, మూడీ కూడా మంచి కోచ్‌లే" అన్నారు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
కపిల్ నేతృత్వంలోని కమిటీ కోచ్ పదవికి పోటీపడిన ఐదుగురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది.
వెస్టిండీస్ క్రికెట్ కోచ్ ఫిల్ సిమన్స్ చివరి నిమిషంలో కోచ్ పదవికి తన అభ్యర్థిత్వాన్ని వెనక్కు తీసుకున్నారు.
కొత్త కోచ్ పదవీకాలం 2021లో జరిగే ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ వరకూ ఉంటుంది. అంటే మరో రెండేళ్లు భారత జట్టును పదునుపెట్టే బాధ్యత రవిశాస్త్రిపై ఉంటుంది.
మొత్తంగా చూస్తే రవిశాస్త్రికి నాలుగోసారి భారతజట్టుతో ఉండే అవకాశం వచ్చింది. 2007లో బంగ్లాదేశ్ పర్యటన సమయంలో శాస్త్రి టీమిండియా క్రికెట్ మేనేజర్‌గా ఉన్నారు.
2014 నుంచి 2016 వరకూ రవిశాస్త్రి భారత క్రికెట్ టీమ్‌తో డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ తర్వాత 2017 నుంచి 2019 వరకు టీమిండియా కోచ్‌గా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- రబ్బర్ పరిశ్రమ... భయంకర రక్తచరిత్ర
- ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్లకే అంతరించింది
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
- దుబాయ్ యువరాణి.. భర్తను వదిలి లండన్ ఎందుకు పారిపోయారు?
- చైనా ముస్లింలు: పిల్లలను కుటుంబాలకు దూరం చేస్తున్నారు
- 'నా పాపను బయోవేస్ట్ అన్నారు. ఆ మాటకు నా గుండె పగిలింది‘
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








