ముంబయి వరదలు: మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లో చిక్కుకుపోయిన 1050 మంది సురక్షితం

ఫొటో సోర్స్, SpokespersonNavy/Twitter
దేశ ఆర్థిక రాజధాని ముంబయిని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
24 గంటల్లో 150 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో ముంబయి నగరంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగాయి.
కొల్హాపూర్ నుంచి వస్తున్న మహాలక్ష్మీ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి ముంబయికి సమీపంలో వంగణి పట్టణం వద్ద ఇక ముందుకు సాగలేక పట్టాలుపైనే నిలిచిపోయింది.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 1
ఆ రైలులో ఉన్న సుమారు వందలాది మంది ప్రయాణికులు 15 గంటల పాటు అందులో చిక్కుకుపోయారు.
రైలు లోపల కూడా నీరు చేరడంతో ఎటూ కదలలేకపోయారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రయాణికులందరినీ రైలులోనే ఉండాలని అధికారులు సూచించడంతో అందులోనే గడిపారు. తాగడానికి నీరు, తినడానికి భోజనం లేక ఇక్కట్లు పడ్డారు.
రైలులో చిక్కుకుపోయినవారిని రక్షించడానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు హెలికాప్టర్లు, బోట్లను కూడా పంపించారు.
దీంతో రైలులో చిక్కుకున్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
మొత్తం 1050 మంది ప్రయాణికులను రక్షించినట్లు సెంట్రల్ రైల్వే పీఆర్వో సునీల్ ఉదాసీ ప్రకటించారు.

ఫొటో సోర్స్, AFP
మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ నుంచి కాపాడిన 700 మంది ప్రయాణికుల కోసం సమీపంలోనే ఒక శిబిరం ఏర్పాటుచేసి భోజనం, మందులు సరఫరా చేశారు.

ఫొటో సోర్స్, Ndrf
ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సురక్షితంగా కాపాడినవారిలో తొమ్మిది మంది గర్భిణులు కూడా ఉన్నారు.
వారికి అవసరమైన మందులు సమకూర్చడంతో పాటు వైద్యసహాయం కూడా అధికారులు అందించారు.
బాధిత ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

మహారాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగడంతో ముంబయి నగరంతో పాటు బద్లాపూర్, వంగణి, ఉల్లాస్‌నగర్ పట్టణాలూ నీట మునిగాయి.
11 విమానాలు, అనేక రైళ్లు రద్దయ్యాయి. పలు ఇతర రైళ్లను దారి మళ్లించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ముంబయి, చుట్టుపక్కల లోకల్ ట్రైన్లు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికులు చిక్కుకుపోయారు.
స్థానిక పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది శుక్రవారం రాత్రి వారికి సహాయ సహకారాలు అందించారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 2
ఇవి కూడా చదవండి:
- 'మీరిలా చేస్తే గుండెపోటు వచ్చిన వ్యక్తి ప్రాణాలు కాపాడొచ్చు'
- ఏడాదిలో నెల రోజులు మాత్రమే కనిపించే గ్రామం ఇది
- యుగాండా నుంచి భారత్‌కు భారీ వలసల్లో నిజమెంత
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
- పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే.. ఆచరణ సాధ్యమేనా? నిపుణులు ఏమంటున్నారు?
- కార్గిల్ యుద్ధాన్ని బీబీసీ ప్రపంచానికి ఎలా అందించింది?
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








