రిమోట్ కంట్రోల్ సాయంతో కుక్కను నియంత్రించగలిగితే...

ఫొటో సోర్స్, JONATHAN ATARI
ఈ కుక్కను పిలవాలంటే మనం మాట్లాడాల్సిన పనిలేదు. రిమోట్‌తో కమాండ్స్ ఇస్తే చాలు. మీరడిగిన పని చేసిపెడుతుంది.
తాయ్ అని పిలిచే ఈ కుక్క దానికి తొడిగిన ప్రత్యేకమైన కోటు సహాయంతో ఆదేశాలు తీసుకునేలా శిక్షణ పొందుతోంది.
ఓ అంధుడికి సహాయంగా ఉండటానికి తాయ్‌ను సిద్ధం చేయాలని భావించారు. అందుకనుగుణంగా దానికి శిక్షణనిచ్చేందుకు ప్రయత్నించినా అది సఫలం కాలేదు. తమ కమాండ్స్ పాటించకుండా తరచుగా పక్కదారి పడుతోందని, అన్నింటినీ వాసన చూస్తూ సమయం మొత్తం గడుపుతోందని శిక్షకులు చెప్పారు.
దీనితో తాయ్‌కు శిక్షణ కోసం ఓ కొత్త మార్గాన్ని అన్వేషించారు. అదే రిమోట్ ఆధారంగా పనిచేసే ఓ కోటు. రిమోట్ కంట్రోల్‌లో బటన్ నొక్కగానే ఈ కోటులో కొన్ని రకాల కదలికలు (వైబ్రేషన్స్) వస్తాయి. దాని ఆధారంగా తాయ్ స్పందించడం మొదలైంది.
"నోటితో ఇచ్చే కమాండ్స్ కన్నా రిమోట్‌తో ఇచ్చే కమాండ్లకు తాయ్ మెరుగ్గా స్పందిస్తోంది" అని ఈ కోటుపై పరిశోధనలు చేసిన బృందం అంటోంది.
యజమానికి కనిపించనంత దూరంలో కుక్క ఉన్నప్పుడు దాన్ని పిలిచేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఇది ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది.

ఫొటో సోర్స్, JONATHAN ATARI
ఈ కోటు తొడిగిన జంతువులతో వికలాంగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
కోటులో వచ్చే ఒక్కో రకమైన కదలికకు, తాయ్‌కు ఒక్కో రకంగా స్పందించేలా శిక్షణనిచ్చారు.
ఆరేళ్ల వయసున్న తాయ్ ప్రస్తుతం, తిరగడం, కూర్చోవడం, దగ్గరకు రావడం, వెనక్కి వెళ్లడం వంటి ఎన్నో పనులను రిమోట్ ద్వారా ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా చేస్తోంది.
మౌఖిక ఆదేశాల కన్నా కూడా వైబ్రేషన్ల ఆధారంగా ఇచ్చే ఆదేశాలతో మరింత ప్రయోజనం ఉంటుందని దీంతో నిరూపణ అవుతోందని ఇజ్రాయెల్‌లోని బీజీ యూనివర్శిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో రోబోటిక్స్ లాబొరేటరీ డైరెక్టర్‌గా ఉన్న ప్రొఫెసర్ ఆమిర్ షాపిరో తెలిపారు.
అన్ని రకాల, వయసుల శునకాలపైనా ఈ కోటుతో పరిశోధనలు చేసి, దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
- నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- చంద్రయాన్-2 భూకక్ష్యలోకి చేరింది.. దీనివల్ల భారత్‌కు ఏం లభిస్తుంది?
- తొడ కొడుతున్న కబడ్డీ - నేటి నుంచే సీజన్ 7
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








