సోనియా గాంధీ: ఆమె రాజకీయ నాయకురాలే కాదు... కళల పరిరక్షకురాలు కూడా

ఫొటో సోర్స్, Getty Images
మీకు తెలుసా.. సోనియా గాంధీ ఓ 'కళా పరిరక్షకురాలు.' రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నపుడు, ఇండియన్ ల్యాండ్‌స్కేప్ పెయింటింగ్స్ పరిరక్షణ కోసం ఆమె పని చేశారు.
1998లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గాడితప్పినపుడు, సోనియా రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం సోనియా వయసు 72 సంవత్సరాలు. ఫారిన్ ల్యాంగ్వేజెస్‌లో మూడేళ్ల కోర్సు చేశారు సోనియా.
సోనియా ప్రధాన రాజకీయ ప్రత్యర్థి మోదీ గురించి, ఓ సంధర్భంలో మీడియా ఆమెను ప్రశ్నించింది. మోదీ తిరుగులేని నేత అని మీరు అభిప్రాయపడుతున్నారా? అన్న ప్రశ్నకు జవాబునిస్తూ..
‘‘ఎప్పటికీ నేను అలా అనుకోను.. 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలను మీరు మరిచిపోకండి’’ అని సున్నితంగా సమాధానం చెప్పారు సోనియా.
కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాక
సోనియా కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యాక జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. శరత్ పవార్, పి.ఎ.సంగ్మా, తారిక్ అన్వర్ కాంగ్రెస్‌ను వీడి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.
1999-2004 సంవత్సరాల మధ్య లోక్‌సభలో సోనియా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2004 ఎన్నికల్లో విజయం సాధించి, కాంగ్రెస్ అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది.
కానీ, సోనియా ప్రధాని కాకుండా, మన్మోహన్ సింగ్‌ను ప్రధానిని చేశారు. అయినా, వివాదాలు మాత్రం కొనసాగాయి.
సోనియా నాయకత్వంలోని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సమాంతర ప్రభుత్వంగా వ్యవహరిస్తోందని విమర్శలు వచ్చాయి. 2006 ఏప్రిల్ నెలలో, ఇలాంటి వివాదాల నేపథ్యంలో సోనియా ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఆ వెంటనే జరిగిన ఉపఎన్నికలో గెలిచారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రత్యర్థి పార్టీలు.. సోనియాను తరచూ లక్ష్యంగా చేసుకుంటున్నాయి.
2017లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యారు. ఆ సమయంలో సోనియా గాంధీ ఆరోగ్యంపై పలు వదంతులు వచ్చాయి.
2019లో ఐదవసారి ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టాలని సోనియా భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. విపక్షాల నేతగా రాహుల్ ఎదగాల్సివుంది.
విపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తేగలిగిన సత్తా సోనియాకు ఉందని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









