ప్రధానమంత్రి హెలికాప్టర్‌ను ఎన్నికల అధికారి తనిఖీ చేయొచ్చా...

ఫొటో సోర్స్, MOHAMMAD MOHSIN
ప్రధానమంత్రి హెలికాప్టర్‌ను కూడా ఎన్నికల అధికారి దర్యాప్తు చేయగలరా...
భారత ఎన్నికల సంఘం ఒడిశాలో కర్నాటక క్యాడర్ ఐఏఎస్ అధికారి మహమ్మద్ మోహిసిన్‌ను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సస్పెండ్ చేసింది.
ఎస్‌పీజీ భద్రత కలిగిన వ్యక్తుల పట్ల అనుసరించాల్సిన ప్రోటోకాల్‌ను మోహిసిన్ ఉల్లంఘించారని, ఆయన తన కర్తవ్యాన్ని విస్మరించారని ఎన్నికల సంఘం తన ఆదేశాలలో పేర్కొంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన తరువాత మోహిసిన్ మీద ఈసీ ఈ చర్య తీసుకుంది. అయితే, ఈసీ తన ఆదేశాలలో ఏప్రిల్ 16న జరిగిన సంఘటన గురించి లిఖిత పూర్వకంగా ప్రస్తావించలేదు.
ఎస్‌పీజీ భద్రత కలిగిన వ్యక్తుల వాహనాలను తనిఖీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉందా? అని ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి శెఫాలీ శరణ్‌ను బీబీసీ అడిగినప్పుడు ఎలాంటి స్పష్టమైన సమాధానం లభించలేదు.

ఫొటో సోర్స్, Eci
"దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఇంతకన్నా ఏమీ చెప్పలేం" అని శెఫాలీ బీబీసీతో అన్నారు.
"ఒడిశాలో ఉన్న డిప్యూటీ ఎన్నికల అధికారి దీనిపై పూర్తి నివేదిక ఇంకా ఇవ్వలేదు. పూర్తి నివేదిక అందిన తరువాతే ఏమైనా చెప్పగలం" అని కూడా శెఫాలీ అన్నారు.
మోహిసిన్‌ను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఆదేశాలలో ఆయన 2019 సంవత్సరానికి చెందిన మార్గ నిర్దేశకాలలో 76వ అంశాన్ని, 2014 నాటి మార్గ నిర్దేశకాలలో 464వ అంశాన్ని ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
ఈ మార్గదర్శకాలు ఎన్నికల సమయంలో అభ్యర్థుల వాహనాల తనిఖీకి సంబంధించినవి. ఈ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏ అభ్యర్థి కూడా ప్రభుత్వ వాహనాలను ఉపయోగించకూడదు.
అయితే, ప్రధానమంత్రికి, ఎస్‌పీజీ భద్రత కలిగిన నేతలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. వాళ్ళు ఎన్నికల ప్రచారంలో కూడా ప్రభుత్వ వాహనాలను ఉపయోగించవచ్చు.

ఫొటో సోర్స్, Eci
కానీ, ఏ ఎన్నికల అధికారి అయినా ప్రధానమంత్రి లేదా ఇతర ఎస్‌పీజీ భద్రత కలిగిన నాయకుడి వాహనాన్ని తనిఖీ చేయవచ్చా లేదా అనే విషయంలో మాత్రం స్పష్టమైన మార్గదర్శకాలేమీ లేవు. ఎన్నికల అధికారులు కూడా దీనిపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు.
ఎన్నికల సంఘం తమ ఆదేశాలలో పేర్కొన్న మార్గ నిర్దేశకాలలో కూడా దీని గురించి వివరణ లేదు.
2010 ఏప్రిల్ 10న జారీ అయిన ఆదేశం ఎన్నికల ప్రచారం కోసం ఎవరూ ప్రభుత్వ వాహనాలు వినియోగించకూడదని పేర్కొంది.
ప్రధానికి, ప్రాణహాని ఉన్న కారణంగా అత్యున్నత స్థాయి భద్రత అవసరమైన నేతలకు, పార్లమెంటు లేదా రాష్ట్రాల విధానసభల నియమాల అనుసారం భద్రత కలిగినవారికి మాత్రమే మినహయింపు ఉంటుందని స్పష్టం చేసింది.
అవకాశం చేజార్చుకున్న ఈసీ
ప్రధాని హెలికాప్టర్ తనిఖీ వ్యవహారంలో ఈసీ తన ప్రతిష్ఠను కాపాడుకునే అవకాశాన్ని చేజార్చుకుందని భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
''ప్రధానికి, ఈసీకి ఇదొక మంచి అవకాశం. ప్రధాని పదేపదే ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడాన్ని, దీన్ని చూసీచూడనట్లుగా ఈసీ వ్యవహరిస్తుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారు. హెలికాప్టర్ తనిఖీ వ్యవహారాన్ని చట్టం ముందు అందరూ సమానమే అని చాటేందుకు ఉపయోగించుకుని ఉండాల్సింది. ఒక్క చర్యతో ప్రధానిపై, ఈసీపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చినట్లయ్యేది. కానీ, వారలా చేయలేదు. ఇప్పుడు విమర్శలు మరిన్ని రెట్లు పెరుగుతాయి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు నా సెల్యూట్. ఆయన హెలికాప్టర్‌పైన కూడా ఇలాంటి తనిఖీ జరిగింది. సహకరించి తన స్థాయిని పెంచుకున్నారు'' అని ఖురేషి ట్వీట్ చేశారు.
విపక్షాల విమర్శలు
విధులను సక్రమంగా నిర్వర్తించినందుకు అధికారిని ఈసీ సస్పెండ్ చేసిందంటూ కాంగ్రెస్ విమర్శించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
''ఈసీ చెబుతున్న ఆదేశాల్లో అధికారిక వాహనాల వినియోగం గురించి మాత్రమే ఉంది. ప్రధాని వాహనానికీ తనిఖీల నుంచి మినహాయింపు ఉంటుందని లేదు. హెలికాప్టర్‌లో మోదీ దేశ ప్రజలకు చూపించకుండా ఏం తీసుకువెళ్లాలని అనుకుంటున్నారు?'' అంటూ కాంగ్రెస్ ట్వీట్ ద్వారా ప్రశ్నించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
తనిఖీ చేపట్టిన అధికారిపై చర్యలు తీసుకోవడాన్ని ఖండిస్తున్నట్లు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. దాయడానికి ఏమీ లేనప్పుడు 'చౌకీదార్'కు భయమెందుకంటూ ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
''ఎవరి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారన్న దానిపై ఈసీ స్పష్టత ఇవ్వాలి. మోహిసిన్ సస్పెన్షన్‌కు దారితీసేలా ఏప్రిల్ 16 సాయంత్రం ఏం జరిగింది?'' అని సుప్రీం కోర్టు న్యాయవాది రిషికేశ్ యాదవ్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ సినీ నటుల ప్రచారంపై వివాదం
- మాయావతి: అడుగడుగునా సవాళ్ళను ఎదుర్కొని ఎదిగిన ఈ దళిత నేత కల నెరవేరేనా...
- స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలకు భద్రత ఎంత...
- పొరపాటున వేరే పార్టీకి ఓటేసి వేలు కోసుకున్న యువకుడు
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఈవీఎంలో ఉన్న మీ ఓటు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే వరకు ఏం జరుగుతుంది?
- BBC FACT CHECK: రైతులకు చంద్రమండలం మీద భూమి ఇస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారా?
- గ్యాస్ కనెక్షన్ ఉన్నా వీళ్లు కట్టెల పొయ్యే వాడుతున్నారెందుకు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








