శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్: 12 లక్షల తులిప్ పుష్పాలను ఒక్కచోట చూస్తే..

ట్యులిప్ గార్డెన్

ఫొటో సోర్స్, Kamraan

శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ అందాలు ఇక్కడి దాల్ సరస్సు అందాలను మరుగుపరుస్తున్నాయి. ఈ తులిప్ గార్డెన్ ఆసియాలోనే అతిపెద్దది.

ట్యులిప్ గార్డెన్

ఫొటో సోర్స్, Kamraan

కశ్మీర్ లోయలో పర్యటక సీజన్ ప్రారంభానికి గుర్తుగా ఈ గార్డెన్‌లోకి పర్యటకులను అనుమతిస్తున్నారు.

ట్యులిప్ గార్డెన్

ఫొటో సోర్స్, Kamraan

దీంతో ఒక్కసారిగా స్థానికులు, పర్యటకులతో గార్డెన్ కిటకిటలాడింది. దీంతో ఇక్కడ పర్యటకరంగంపై ఆధారపడి జీవించేవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్యులిప్ గార్డెన్

ఫొటో సోర్స్, Kamraan

తులిప్‌లలో వివిధ రకాలకు చెందిన 12 లక్షల తులిప్‌ మొక్కలను ఈ సంవత్సరం గార్డెన్‌లో నాటారు.

ట్యులిప్ గార్డెన్

ఫొటో సోర్స్, Kamraan

ఒక్కో తులిప్‌ పుష్పం గరిష్టంగా మూడు, నాలుగు వారాలుంటుంది.

ట్యులిప్ గార్డెన్

ఫొటో సోర్స్, Kamraan

ఈ తోట జాబర్వాన్ పర్వతప్రాంతంలోని 30 హెక్టార్ల విస్తీర్ణంలో ఆవరించి ఉంది.

ట్యులిప్ గార్డెన్

ఫొటో సోర్స్, Kamraan

ఈ గార్డెన్ కారణంగా కశ్మీర్ లోయలోని పర్యటకరంగానికి రెండు నెలల ముందే కళ వచ్చింది. ఒక్క వారం రోజుల్లోనే 70 వేలమంది ఈ తులిప్‌ గార్డెన్‌ను దర్శించారు.

బాదం చెట్లు

ఫొటో సోర్స్, Aamir

బాదం చెట్లు

ఫొటో సోర్స్, Aamir

బాదామ్‌వారి ప్రాంతంలోని బాదం చెట్లు ప్రపంచవ్యాప్త పర్యటకులకు ఓ అందమైన అనుభూతినిస్తాయి.

బాదం చెట్లు

ఫొటో సోర్స్, Aamir

బాదం చెట్లు

ఫొటో సోర్స్, Aamir

కోహెమరన్ పర్వత సానువుల్లో ఉన్న ఈ గార్డెన్ సంవత్సరం పొడవునా తెరిచే ఉన్నప్పటికీ మార్చిలో మాత్రం ఇక్కడి బాదం చెట్ల అందాలను చూడటానికి పెద్దసంఖ్యలో పర్యటకులు వస్తారు.

ఆవాల చెట్ల పూలు

ఫొటో సోర్స్, Aamir

ఆవాల చెట్ల పూలు

ఫొటో సోర్స్, Aamir

ఆవాల చెట్లకు పూసిన పువ్వులు లోయ మొత్తాన్ని పసుపురంగులోకి మార్చేసి కశ్మీర్‌ అందాలను మరింత పెంచేశాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)