కశ్మీర్: పుల్వామా దాడి పర్యటకరంగంపై ప్రభావం చూపిందా

కశ్మీర్ అందాలను మాటల్లో వర్ణించలేం. ఈ సుందరలోయ దశాబ్దాలుగా దేశీయ పర్యటకులకే కాదు, ఎందరో విదేశీ పర్యటకులకు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పుల్వామా దాడి అనంతరం ఇక్కడి పరిస్థితిపై బీబీసీ ప్రతినిధి రియాజ్ మస్రూర్ అందిస్తున్న కథనం.
పుల్వామాలో ఆత్మాహుతి దాడి తర్వాత, కశ్మీర్‌కు వచ్చే పర్యటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
స్థానికంగా ఉండే చిరు వ్యాపారస్తులు తమ రోజువారీ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన చెందుతున్నారు.
వేలాదిమంది ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందిపడుతున్నారు.
"మేం పొద్దున్నే వచ్చి సాయంత్రం వెళ్తాం. ఒక్క పర్యటకుడూ రాలేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అమ్మకాలు లేక ఆర్థికంగా చాలా సమస్యగా ఉంది. మాకు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే పిల్లలున్నారు. నిత్యావసరాలను సమకూర్చుకోవడమే చాలా కష్టంగా ఉంది. ఇక స్కూలు ఫీజులెలా చెల్లించగలం?" అని హ్యాండీక్రాఫ్ట్స్ షాపు యజమాని షకీల్ అహ్మద్ ప్రశ్నిస్తున్నారు.
పర్యటకులను ఆకర్షించడానికి ప్రభుత్వం సాయం చేయాలని హోటల్ యజమానులు కోరుతున్నారు.
"మా వ్యాపారం అంతా దెబ్బతింది. బుకింగులు జరిగాయి. కానీ వాటిని రద్దు చేసుకుని, డబ్బు వెనక్కి తీసుకున్నారు.
భారతీయులంతా కశ్మీర్‌కు రావాలనే కోరుకుంటారు. వాళ్లు మళ్లీ తిరిగి వస్తారనే ఆశిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి నమ్మకం కలిగించే చర్యలు చేపట్టాలి" అని కశ్మీర్ హోటల్ యజమానుల క్లబ్ ఛైర్మన్ ముస్తాక్ చాయ కోరుతున్నారు.
గుల్మార్గ్‌లోని ప్రపంచ ప్రసిద్ధ స్కీ రిసార్ట్ సైతం జనాలు లేక ఖాళీగా మిగిలింది.
భూతల స్వర్గంగా పిలుచుకునే కశ్మీర్‌లో పెరుగుతున్న హింస, మరణాలు అక్కడి ఆహ్లాదకర వాతావరణానికి ఇబ్బందిగా మారుతున్నాయి. దీంతో పర్యటకరంగంపై కూడా ప్రభావం పడుతోంది.
ఇవి కూడా చదవండి.
- పుల్వామా దాడి: కశ్మీర్ యువత మిలిటెన్సీలో ఎందుకు చేరుతోంది
- పుల్వామా దాడి: రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
- ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ డైరీ: నారా లోకేశ్ నామినేషన్‌పై అధికారుల అభ్యంతరాలు
- పార్టీలు పెట్టారు.. కాపాడుకోలేకపోయారు
- హోలీ రోజున గురుగ్రామ్‌లో ఏం జరిగింది.. ఆ కుటుంబంపై మూకుమ్మడిగా ఎందుకు దాడి చేశారు
- క్రిస్ గేల్: బ్యాట్ పట్టిన పెను తుపాను.. పంజాబ్ జట్టు చరిత్రను తిరగరాస్తాడా?
- బంగ్లాదేశ్ విమానం 'హైజాకర్'ను కాల్చి చంపిన సాయుధ బలగాలు
- క్యాన్సర్ చికిత్స వల్ల వంధ్యత్వం.. అందుకు ఈ కోతి పిల్ల సమాధానం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









