Balakot : అన్నింటికీ సిద్ధంగా ఉండండి: పాక్ ప్రజలకు, సైన్యానికి ఇమ్రాన్ ఖాన్ పిలుపు

ఫొటో సోర్స్, www.radio.gov.in
జైషే మహమ్మద్ స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. "అన్ని రకాల పరిస్థితులకూ సిద్ధంగా ఉండాలి " అని దేశ సైన్యానికి, పౌరులకు ఇమ్రాన్ పిలుపు ఇచ్చారు.
ఈ మేరకు పీటీవీ తెలిపింది. ప్రధాని ఇమ్రాన్ అధ్యక్షతన పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు.
సమావేశం తర్వాత మాట్లాడిన ఎన్ఎస్‌సీ "భారత్ అనవసరంగా దురాక్రమణకు పాల్పడింది. దానికి పాకిస్తాన్ తగిన సమయంలో, సరైన చోట సమాధానం ఇస్తుందని చెప్పారని ఎఎన్ఐ చెప్పింది.
మొదట భారత యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటాయన్న పాకిస్తాన్ తర్వాత భారత్ వైమానిక దళం విమానాలను తిప్పి పంపామని చెబుతోంది.
పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ "భారత యుద్ధ విమానాలు ముజఫరాబాద్ సెక్టార్‌కు మూడు నాలుగు కిలోమీటర్లు లోపలికి చొచుకొచ్చాయి. కానీ పాకిస్తాన్ వెంటనే జవాబివ్వడంతో అవి తిరిగి వెనక్కు వెళ్లాల్సి వచ్చింది" అన్నారు.
పాకిస్తాన్ ఆర్మీ ఈ ట్వీట్ తర్వాత భారత్‌లో కలకలం మొదలైంది. చూస్తూచూస్తూనే భారత మీడియా భారత్ పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుందని తెలిపింది.
అయితే భారత్ వైపు నుంచి అధికారిక ధ్రువీకరణకు సమయం పట్టింది. భారత ప్రభుత్వం వైపు నుంచి మొట్టమొదట ప్రకాశ్ జావదేకర్ వైమానిక దళాన్ని ప్రశంసించారు. ఆయన ప్రధాన మంత్రి మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని, వైమానిక దళం సాహసంతో అది చేసి చూపించిందని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక రాజస్థాన్‌లోని చురులో ర్యాలీలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'ఇది దేశం సంబరాలు చేసుకునే సందర్భం' అన్నారు.
మనది ఈ మట్టి సువాసనలు గుండెల్లో నింపుకున్న జాతి అని మోదీ తెలిపారు.
ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోదీ "ఈ దేశానికి నేను భరోసా ఇస్తున్నా. జాతి గొప్పతనం విరాజిల్లేలా, మన జెండా సగర్వంగా ఎగిరేలా మనం నిలబడతాం" అన్నారు.
భారతదేశం మట్టిలోనే పౌరుషం ఉందన్న మోదీ.. మన ప్రతాపాన్ని చాటుతామని యావత్ జాతికి మాట ఇస్తున్నానని తెలిపారు.

ఫొటో సోర్స్, TWITTER/MAJ GEN ASIF GHAFOOR
మరోవైపు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ భారత్ దాడి చేశామని చెబుతున్న బాలాకోట్ ప్రాంతానికి అంతర్జాతీయ మీడియాను తీసుకెళ్తున్నామని చెప్పారు.
హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. వాతావరణం అనుకూలిస్తే మీడియాను ఆ ప్రాంతానికి తీసుకెళ్తాం. అక్కడి పరిస్థితులను వారే చూస్తారు. భారత్ చేస్తున్న అవాస్తవాలను బయటపెడతారు. అన్నారు.
పుల్వామా దాడి తర్వాత భారత్‌లో కశ్మీరీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
భారత్‌లోని వివిధ యూనివర్సిటీల్లో చదివే కశ్మీరీ విద్యార్థులపై దాడులు జరిగాయని, కొట్టారని తెలిపారు.
న్యూఢిల్లీలో, పుణెలో కశ్మీరీ యువకులు, ఉద్యోగులపై దాడులు జరిగాయని చెప్పారు.
పుల్వామా దాడులతో ఎలాంటి సంబంధం లేకపోయినా కశ్మీరీలపై దాడులు చేస్తున్నారని, భారత్‌లో ముస్లింలకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
- EXCLUSIVE: అంబేడ్కర్ వీడియో ఇంటర్వ్యూ
- పాకిస్తాన్‌పై 'నీటి సర్జికల్ స్ట్రైక్స్' వెనుక అసలు నిజం
- ‘పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేతిలో మరణించిన మిలిటెంట్ల ఫొటో నిజమేనా’
- రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉండాలని అంబేడ్కర్ నిజంగానే అన్నారా?
- భారత్-రష్యా: ఆయుధాలు, మసాలాలు కాకుండా ఇంకేం ఇచ్చిపుచ్చుకుంటున్నాయి?
- డోక్లాం: భారత్, చైనా మధ్యలో భూటాన్! ఇంతకీ భూటాన్ ప్రజలేమనుకుంటున్నారు?
- ఇస్లామిక్ దేశాల ముఖ్య అతిథిగా భారత్ ఏం సాధిస్తుంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








