పుల్వామాలో ఎన్‌కౌంటర్: ఇద్దరు మిలిటెంట్లు హతం.. నలుగురు సైనికులు మృతి

ఫొటో సోర్స్, Getty Images
పుల్వామాలో సైనికులు, జైష్-ఎ-మొహమ్మద్ మిలిటెంట్లకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.
సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు సైనికులు, ఒక పౌరుడు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఇద్దరు మిలిటెంట్లను కాల్చి చంపినట్లు సైన్యం వెల్లడించింది.
పింగ్లాన్ ప్రాంతంలో జైష్-ఎ-మొహమ్మద్ మిలిటెంట్లు తలదాచుకున్నారన్న సమాచారం అందటంతో సైన్యం, పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది సోదాలు జరిపారు.
సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైష్-ఎ-మొహమ్మద్ మిలిటెంట్ల దాడి నేపథ్యంలో.. ఈ ప్రాంతంలో గాలింపు చర్యలను సైన్యం, సీఆర్పీఎఫ్ ముమ్మరం చేశాయి.
ఈ ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన సైనికుడు గుల్జార్ మొహమ్మద్‌ను ఆర్మీ బేస్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
మిలిటెంట్లను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చనిపోయిన సైనికులు వీరే..
ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సైనికులు 55 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన మేజర్ వీఎస్ ధౌండియల్, హవల్దార్ షియో రామ్, సిపాయ్ అజయ్ కుమార్, సిపాయ్ హరి సింగ్ అని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- జైష్-ఎ-మొహమ్మద్ అంటే ఏమిటి? ఈ మిలిటెంట్ సంస్థ విస్తరించడానికి కారణం ఎవరు?
- పుల్వామా దాడి: ‘అదే జరిగితే యుద్ధం రావొచ్చు’ - అభిప్రాయం
- మీ ఇంట్లో అత్యంత మురికైనది ఏమిటో మీకు తెలుసా...
- పెయిన్ కిల్లర్స్: తేడా వస్తే నొప్పినే కాదు మనిషినే చంపేయొచ్చు
- ఉద్యోగులను ఆఫీసులో ఎక్కువ సేపు పనిచెయ్యనివ్వని డ్రోన్
- ఐఎస్‌లో చేరేందుకు బ్రిటన్ నుంచి సిరియాకు వెళ్ళిన ఓ టీనేజర్ కన్నీటి కథ
- పుల్వామా దాడి: కశ్మీర్ యువత మిలిటెన్సీలో ఎందుకు చేరుతోంది
- ప్రేమికులు ప్రేమలో పడటానికి, వారిలో రొమాన్స్‌కు కారణం ఇదే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








