'కేటీఆర్ గారూ నా కొత్త జాబ్ ఎలా ఉంది?' - ఉపాసన కొణిదెల ట్వీట్

ఫొటో సోర్స్, ఉపాసన
ప్రపంచ ఆర్థిక వేదిక.. (వరల్డ్ ఎనకమిక్ ఫోరం) సదస్సుకు వెళ్లిన ఉపాసన కొణిదెల... ‘కేటీఆర్ గారూ నా కొత్త జాబ్ ఎలా ఉంది’ అంటూ కేటీఆర్‌కి ట్వీట్ చేశారు.
ఆమె దావోస్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్‌కు సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న కంపెనీలకు ఆమె సమాచారం అందించారు.

ఫొటో సోర్స్, ఉపాసన
తెలంగాణలో పెట్టబడులు పెట్టడానికి ఉండే అనుకూల పరిస్థితులను ఆమె వివరించారు.
ఆమె ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేత కేటీఆర్‌కి ట్విటర్ ద్వారా వెల్లడించారు.
కేటీఆర్‌గారూ నా కొత్త ఉద్యోగం మీకు నచ్చిందా.. అంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణ పెవిలియన్‌లో డెస్క్‌లో తాను కూర్చొని ఉన్నానని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
హైదరాబాద్ ప్రపంచంలో జీవనానికి అనుకూలమైన మూడో ఉత్తమ ప్రాంతమని.. భారత స్టార్టప్ రాజధాని అని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
ప్రపంచంలో ప్రతి మూడు వేకెన్సీల్లో ఒకటి హైదరాబాద్‌లో సృష్టిస్తున్నారని చెప్పారు.
అంతకుముందు మహిళల లోదుస్తుల ఉత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రపంచంలోనే అగ్రగామి అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇక్కడ ఏటా 19 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అవుతోందని చెప్పారు.
అంతకు ముందు తెలుగు గర్ల్ పవర్ అంటూ.. దావోస్‌లో బ్రహ్మణి, అపోలో ఆస్పత్రికి చెందిన సంగీత, శోభా కామినేని తదితరులతో దిగిన ఫొటోను ట్వీట్ చేశారు.
"మా బృందం స్థయిర్యాన్ని పెంచినందుకు చాలా కృతజ్ఞతలు" అని కేటీఆర్ ఉపాసన ట్వీట్‌కి రిప్లై ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- పెళ్లయ్యాక సంతోషం ఎన్నాళ్లు?
- ఆయుష్షు పెరగాలంటే.. పెళ్లి చేసుకోండి
- ఈ దీవిలో 12 ఏళ్ల తర్వాత పాప పుట్టింది
- బీబీసీ సర్వే: 16-24 ఏళ్ళ యువతలో పెరుగుతున్న ఒంటరితనం
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
- అఘోరాలు ఎవరు... ఎందుకలా శవాల మధ్య గడుపుతారు...
- ప్రియాంకా గాంధీని 'భయ్యా జీ' అని ఎందుకంటారు
- పక్షులను కాపాడే అమ్మాయి ప్రాణం మాంజాకు బలి
- ఈ బాలుడు పడుకుంటే.. అతని ప్రాణానికే ముప్పు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








