ప్రపంచంలోనే అతిపెద్దషార్క్‌తో ఈత కొట్టిన మహిళ

ఫొటో సోర్స్, Reuters
ఈ ఫొటోలను చూడగానే కళ్లు తిప్పుకోలేం. ఆ ఫొటోలో ఒక మహిళ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రేట్ వైట్ షార్కుతో ఈదుతుంటుంది.
ఆ షార్కును చూస్తుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది దాంతో కలిసి పక్కపక్కనే ఈత కొట్టడం అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
సముద్రంలోని గ్రేట్ వైట్ షార్కుల్లో ప్రపంచంలోనే అతిపెద్దవని చెబుతున్న డీప్ బ్లూ షార్క్‌కు దగ్గరగా వెళ్లి అలాంటి అనుభవం పొందారు ఫొటోగ్రాఫర్ కింబర్లీ జెఫ్రీస్.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 1
"అప్పుడు నా గుండె పేలిపోతుందేమో అనిపించింది" అని ఆమె చెప్పారు.
హవాయిలోని ఓహూ తీరంలో కింబర్లీ పడవ దిగారు. చనిపోయిన తిమింగలం కళేబరాన్ని తినడానికి వచ్చే షార్కులను ఫొటోలు తీయాలనుకున్నారు.
"ఇంజిన్ వెనక నుంచి టైగర్ షార్కులు రావడాన్ని మేం చూశాం. అది చాలా చక్కగా ఉంది. ఎందుకంటే మేం అలాంటి దృశ్యాలు చూడ్డానికే వచ్చాం".
కానీ నీళ్లలోకి దిగిన తర్వాత కింబర్లీకి షార్కులు కనిపించలేదు. అక్కడ షార్కులు లేకపోవడం చూసి ఆ టీమ్ ఆశ్చర్యపోయింది.

ఫొటో సోర్స్, Reuters
"బహుశా 30 సెకన్ల తర్వాత మేం ఈ భారీ షార్కును చూశాం. అది మెల్లగా బయటికొచ్చింది. నేరుగా తిమిగలం కళేబరం దగ్గరకు చేరుకుంది".
ఈ షార్కును డీప్ బ్లూ అనే వాటిలో ఒకటని భావిస్తున్నారు. దీని వయసు 50 ఏళ్లు ఉంటుంది. ఈ గ్రేట్ వైట్ బరువు దాదాపు రెండున్నర టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ షార్కు సుమారు ఆరు మీటర్ల పొడవుంది. అంటే అది ఒక పెద్ద జిరాఫీ అంత పొడ ఉంటుంది.
"నా స్నేహితుడు ఆండ్రూ అక్కడున్నాడు. వెనక్కు తిరిగి నా వైపు చూశాడు. అది గ్రేట్ వైట్ షార్క్ అన్నాడు. నేను వెనక్కు తిరిగి నాకు తెలుసు ఆండ్రూ అన్నాను".

ఫొటో సోర్స్, REUTERS AND MARK MOHLER
గ్రేట్ వైట్‌ను చూసి తమ టీమ్ అంతా షాక్ అయ్యిందని కింబర్లీ చెప్పారు. అంత పెద్ద షార్కును చూడడం నిజంగా అద్భుతం అన్నారు.
"అది గ్రేట్ వైట్ అని మాకు తెలీగానే.. మొదట కొన్ని క్షణాలపాటు నా గుండె పేలిపోతుందేమో అనిపించింది. కానీ తర్వాత నేను మెల్లగా కుదుటపడ్డా".
మనం అంత పెద్ద గ్రేట్ వైట్ షార్కుకు అంత దగ్గర్లో ఉన్నప్పుడు ఏదైనా చేయడం చాలా కష్టంగా ఉంటుంది.
ఆమె ఎన్నోసార్లు సముద్రంలో షార్కులతో ఉన్నారు. కానీ డీప్ బ్లూ షార్కును చూసిన ఈ అనుభవం మాత్రం ఆమెకు పూర్తిగా భిన్నంగా అనిపించింది.
"అది నిజంగా ఒక మాయలా అనిపించింది. ఇది నా జీవితంలో చాలా చాలా ప్రత్యేకమైన క్షణం"
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 2
"అది(డీప్ బ్లూ) అక్కడ చాలా సేపు అక్కడే ఉంది. దాని పొడవు మాత్రమే కాదు, దాని భారీ ఆకారం చాలా అద్భుతంగా అనిపించింది".
తాకేంత దగ్గరగా ఉన్నా కింబర్లీ దానిని తాకలేదు. తాకితే ప్రమాదం అని భావించారు.

ఫొటో సోర్స్, Reuters
"అక్కడ అది తినడానికి ఆహారం సిద్ధంగా ఉండడంతో, దాని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నా".
"మనం తిరిగి తీరానికి సులభంగా వచ్చేయవచ్చు. కానీ వన్యప్రాణులను అవి సహజంగా తిరిగే చోట చిత్రీకరించడం ప్రతి ఫొటోగ్రాఫర్‌కు ఒక కల" అంటారు కింబర్లీ.
"ఇది ఒక సఫారీలోకి వెళ్లి సింహం పక్కనే నడుస్తూ ఫొటో తీసుకున్నట్టు అనిపించింది" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మీ సిమ్ కార్డ్ మిమ్మల్ని ఒక్క రాత్రికే బికారిగా మార్చొచ్చు
- జన్యు బ్యాంక్‌లో భద్రంగా లక్షల రకాల వరి వంగడాలు
- దేవుడి చేతుల్లో నడవాలనుకుంటే.. ఈ వంతెన మీదకు వెళ్లాల్సిందే
- టీం ఇండియా దశ, దిశ మార్చా.. నన్నే టీంలోంచి తీసేశారు
- వీవీఎస్ లక్ష్మణ్: నంబర్ త్రీగా ఆడడం వెనుక అసలు చరిత్ర
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








