రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు: సీఎం ఎవరు?

రాజస్థాన్ సచిన్ పైలట్

ఫొటో సోర్స్, Getty Images

ఊహించినట్టే రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం దిశగా ముందుకు సాగుతోంది.

రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 200 స్థానాలుండగా 199 స్థానాలకు ఓటింగ్ జరిగింది.

ఇప్పటి వరకు వెలువడ్డ ట్రెండ్స్ ప్రకారం 4 స్థానాల్లో విజయం సాధించగా స్కాంగ్రెస్ 96 స్థానాల్లో ముందంజలో ఉంది.

అధికార పార్టీ బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించగా 73 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

బీఎస్‌పీ 4 స్థానాల్లో, ఇండిపెండెంట్లు 11 స్థానాల్లో, ఇతరులు 7 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

వసుంధర రాజే

ఫొటో సోర్స్, Getty Images

గడచిన నాలుగు ఎన్నికల్ని గమనిస్తే, ప్రతి ఐదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే అలవాటున్న రాజస్థాన్ ఓటర్లు ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నట్టు కనిపిస్తున్నారు.

నిజానికి ఈసారి జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందని భావించిన రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి.

ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపు కాంగ్రెస్ పార్టీకే పట్టంగట్టాయి. ప్రస్తుత ట్రెండ్స్ కూడా అందుకు భిన్నంగా ఏమీ లేవు.

ఝాల్రాపాటన్ నుంచి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి వసుంధర రాజే అధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి రేసులో ఉన్న అశోక్ గెహ్లోట్ సర్దార్‌పురా నియోజకవర్గంలోనూ, సచిన్ పైలట్ టోంక్ నియోజకవర్గంలోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

రాజస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు వంద సీట్లు సాధిస్తే సరిపోతుంది.

రాజస్థాన్‌లో సీఎం పదవి కోసం అశోక్‌గెహ్లాట్, సచిన్‌పైలెట్ కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. వీరిలో ఎవరు సీఎం కానున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)