కేటీఆర్ - హరీశ్ రావు: "బావా కంగ్రాట్స్... మీకు లక్ష మెజారిటీ’’ .. ముందే ఊహించిన కేటీఆర్

వీడియో క్యాప్షన్, "బావా కంగ్రాట్స్... మీకు లక్ష మెజారిటీ’’

సిద్ధిపేట జిల్లా గుర్రాల గొంది గ్రామం వద్ద టీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య కాసేపు సరదా సంభాషణ జరిగింది.

అప్పడే కేటీఆర్.. హరీశ్ రావు మెజారిటీ లక్షదాటుతుందని ఊహించారు.

కేటీఆర్ హైదరాబాద్‌ నుంచి సిరిసిల్ల వెళ్తున్నారు. అదే సమయంలో హరీశ్ రావు సిద్ధిపేట నియోజకవర్గంలో తిరుగుతూ పోలింగ్ సరళిని తెలుసుకుంటున్నారు. మార్గం మధ్యలో గుర్రాల గొంది గ్రామం వద్ద ఎదురెదురుగా కారు దిగి సరదాగా మాట్లాడుకున్నారు.

కేటీఆర్.. హరీశ్ రావును పలకరిస్తూ "బావా కంగ్రాట్స్... మీకు లక్ష మెజార్టీ ఖాయం. మీ దాంట్లో సగం అయినా తెచ్చుకుందామని సిరిసిల్ల పోతున్నాను’’ అని అన్నారు.

అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)