వైరల్ వీడియో: కొండముచ్చును స్టీరింగ్‌పై ఉంచి బస్సు నడిపిన డ్రైవర్

కోతిని స్టీరింగ్‌పై ఉంచి బస్సు నడిపిన డ్రైవర్

ఫొటో సోర్స్, YOUTUBE

ఫొటో క్యాప్షన్, కొండముచ్చును స్టీరింగ్‌పై ఉంచి బస్సు నడిపిన డ్రైవర్

కర్ణాటకలో ఓ డ్రైవర్ కొండముచ్చును స్టీరింగ్‌పై ఉంచుకుని బస్సు నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అధికారులు డ్రైవర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.

ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా డ్రైవర్ల నిర్లక్ష్యపూరిత ప్రవర్తనలుపై కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఎన్నో ఫిర్యాదులు అందాయి.

కానీ, పెద్ద సైజులో ఉన్న ఓ కొండముచ్చు దాదాపు 30 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్న బస్సు స్టీరింగ్‌పై కూర్చుని ఉండగా డ్రైవర్ బస్సు నడపడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

"కోతిని స్టీరింగ్‌పై ఉంచి, ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టడాన్ని ఎంతమాత్రం సహించం" అని రవాణా సంస్థ అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే డ్రైవర్‌ను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"దురదృష్టం కొద్దీ ఆ డ్రైవర్ సస్పెండయ్యాడు. కోతి కేవలం స్టీరింగ్‌పై కూర్చుని ఉంది. డ్రైవర్ కుడిచేత్తో స్టీరింగ్‌ను కంట్రోల్ చేస్తూనే ఉండటం వీడియోలో స్పష్టంగా ఉంది. గమ్యం రాగానే కోతి దిగిపోయింది. కానీ డ్రైవర్ ఉద్యోగం పోయింది." అని కాట్రిన్‌మోజీ అభిప్రాయపడ్డారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"కోతిని బయటకు పంపాలని ప్రయత్నిస్తే అది దాడి చేసే ప్రమాదముంది. ఆ సమయంలో డ్రైవర్ చేసిన పనే కరెక్ట్." అని మిసిడెంట్ అనే యూజర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

"మీ తల్లిదండ్రులో, బంధువులో బస్సులో ఉంటే, ఆ బస్సును ఇలా ఓ కోతి నడుపుతుంటే, దాన్ని మీరు ఒప్పుకుంటారా?" అంటూ ఆమిర్ సయీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

"సొంత వాహనంలో ఇలాంటివి చేసుకోమనండి. ప్రజలు ప్రయాణించేవాటిలో కాదు. దీన్ని తీవ్రంగా పరిగణించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి" అని వాసిమ్ అభిప్రాయపడ్డారు.

"ఈ ఘటన సోమవారం జరిగింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో మా దృష్టికి వచ్చింది" అని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు తెలిపారు.

"ఓ ప్రయాణికుడు తన కొండముచ్చుతో కలిసి బస్సు ఎక్కాడు. కానీ ఆ తర్వాత అది అతని మాట వినకుండా వెళ్లి స్టీరింగ్‌పై కూర్చొంది. కాసేపటి తర్వాత తన యజమానితో పాటు బస్సు దిగి వెళ్లిపోయింది" అని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.

అది ఎలాంటి ఇబ్బందీ కలిగించకపోవడంతో డ్రైవర్ బస్సును అలాగే నడుపుతూ వెళ్లారు.

అయితే, కొండముచ్చు స్టీరింగ్‌పై కూర్చున్నప్పటికీ డ్రైవర్ స్టీరింగ్‌ను ఎప్పుడూ వదలకపోవడం ఆ వీడియోలో స్పష్టంగా ఉంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)