ఆసియా క్రీడలు: బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు

ఫొటో సోర్స్, Getty Images
తెలుగు అమ్మాయి పీవీ సింధు ఆసియా క్రీడల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్లో ప్రవేశించింది.
జపాన్‌కు చెందిన అకానె యమగూచిపై విజయం సాధించడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా సింధు రికార్డు సృష్టించింది.
హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో 21-17, 15-21, 21-10 తేడాతో రెండో సీడ్ యమగూచిపై సింధు విజయం సాధించింది. తొలి సెట్లో సింధు నెగ్గగా, రెండో సెట్‌ను యమగూచి గెల్చుకుంది. దీంతో మూడో సెట్ నిర్ణయాత్మకంగా మారింది. కానీ సింధు ఈ సెట్‌ను చాలా సులభంగా గెల్చుకుని ఫైనల్‌కు చేరింది.
ఫైనల్లో వరల్డ్ నంబర్ 1 తాయ్ జూ యింగ్‌తో సింధు తలపడనుంది.
ఇంతకు ముందు జరిగిన మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై నెగ్గడం ద్వారా తాయ్ జూ యింగ్ ఫైనల్‌కు చేరింది. దీంతో సైనా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి
- మీ గర్ల్ ఫ్రెండ్‌కు సారీ ఎలా చెబుతారు?
- తదుపరి ‘యాపిల్’ ఏది? భవిష్యత్తు నంబర్ వన్ కంపెనీ ఇప్పుడు ఎక్కడుంది?
- డైమండ్ నగరంలో 'గోల్డెన్ స్వీట్' - మరి రుచి చూస్తారా?
- ఆస్ట్రేలియా: పెట్రోలు అయిపోతోందా? అయిపోతే బండి నడిచేదెలా?
- ప్లాస్టిక్‌పై నిషేధం: ఆస్ట్రేలియాలో ఆగ్రహం
- పీవీ సింధు: ఆదాయంలో క్రికెట్ స్టార్లను వెనక్కు నెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి
- ఆసియా క్రీడలు: దీక్షా డాగర్.. అద్భుతమైన షాట్స్ కొట్టినా అభిమానుల చప్పట్లేమీ ఆమెకు వినపడవు




