గోవిందాచార్య వ్యాసం: ప్రణబ్ రాకకు, ఆరెస్సెస్ ఆహ్వానానికి అర్థమిదే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కేఎన్ గోవిందాచార్య
- హోదా, మాజీ ప్రచారక్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బీబీసీ కోసం
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాగపూర్‌లో ఆరెస్సెస్ నిర్వహించే శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా సంఘ్ వేదికపై కనిపించబోతున్నారు.
ఈ వార్త మీడియాలో చాలా కలకలం సృష్టించింది. దీంతో పార్టీ రాజకీయాల్లో సైతం అలజడి నెలకొనడంతో సంఘ్ పనితీరు ఎలా ఉంటుంది అనేదానిపై చాలా కోణాలు బయటపడడం లేదు.
గతంలో ప్రముఖ రాజకీయ నేతలు వివిధ సందర్భాల్లో సంఘ్ శిబిరాలకు, సంఘ్ వేదికపైకి వెళ్లారు. అనధికారిక చర్చల కోసం సంఘ్ నేతలను కలుస్తూనే ఉన్నారు. కానీ ప్రణబ్ ముఖర్జీ సంఘ్ సభకు వెళ్లనున్నారనే వార్తపై మాత్రం ఎక్కువ చర్చే జరుగుతోంది.
సంఘ్ నేతలు అవసరమైతే ప్రణబ్ ముఖర్జీ పేరును అత్యున్నత పదవికి సిఫారసు చేయవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఆ వార్త పూర్తిగా నిరాధారం అని మీడియాకు చెందిన ఓ వ్యక్తి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అందరూ స్వయం సేవకులే..’
మొత్తం సమాజంలో ప్రజలందరూ స్వయం సేవకులే అని సంఘ్ భావిస్తుంది. వీరిలో కొందరు ఇప్పటివారైతే, మరికొందరు రేపటి వారని చెబుతుంది.
కొత్తవారిని కలవడం, వారి స్వభావం తెలుసుకోవడం, సంఘ్ గురించి వారికేం తెలుసో వివరాలు సేకరించడం, సంఘ్ కార్యక్రమాల గురించి వారికి చెప్పడం, వారితో కమ్యూనికేషన్ ఏర్పరుచుకోవడం వంటివన్నీ సంఘ్ కార్యకలాపాల్లో భాగం.
సంఘ్ స్వయం సేవకులు కొత్త వారిని గౌరవంగా, మర్యాద పూర్వకంగా సంఘ్‌కు పరిచయం చేస్తారు. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. సమాధానం ఇవ్వలేమని అనిపించినప్పుడు, తమ పైవారితో మాట్లాడిస్తామని హామీ ఇస్తారు. తర్వాత వారితో సంప్రదింపులు కొనసాగిస్తారు.
కొత్తవారితో ప్రారంభించి.. మద్దతుదారులను, అప్పుడప్పుడూ కార్యక్రమాలకు వచ్చేవారిని, రోజూ శాఖలో కొన్ని బాధ్యతలు చూసేవారిని, అందరినీ శాఖలోకి తీసుకొచ్చి స్వయం సేవకులుగా మారుస్తారు.
సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఒక అభివృద్ధి క్రమం ఉంటుంది. సంఘ్ శాఖ దానికి మూలం.
ఇందులో ఒక గంట పాటు మైదానంలో శారీరక, మానసిక, మేధో శిక్షణ ఉంటుంది. స్వయం సేవకులు మిగతా 23 గంటలూ వ్యక్తిగత, కుటుంబ, సామాజిక కోణాలను సంతులనం చేస్తూ జీవితాన్ని గడుపుతారు.
సమాజంలోని విద్య, సేవ, జ్ఞానోదయం, రాజకీయం లాంటి వివిధ రంగాల్లో మార్పులు తీసుకురావడం ఇందులో భాగంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, SUNITA ZADE
అందరికీ చేరువ కావాలని..
ప్రతి స్వయం సేవకుడూ ఏడాదిలో కనీసం 5 నుంచి 7గురు కొత్తవారిని సంఘ్‌లో చేర్పించడానికి ప్రయత్నిస్తారు. బాగా ఆలోచించి, అత్యంత ప్రభావితం చేసే వ్యక్తులను తమ తమ మార్గాల్లో సంప్రదించడానికి ప్రయత్నిస్తారు.
సంఘ్ తమ లక్ష్యాన్ని అన్ని కులాలు, ప్రాంతాలు, భాషలు, శాఖల వారితోపాటూ, చదువుకున్నవారు, నిరక్షరాస్యులు, డాక్టర్లు, లాయర్లు, రైతులు, కార్మికులు అందరి దగ్గరకూ చేర్చాలని అనుకుంటోంది.
దీన్ని కొనసాగించడం, మద్దతు కొనసాగేలా చూడడం, కలిసి పనిచేసే ప్రచారంలో అందరి అండ కూడగట్టడం స్వయం సేవకుల లక్ష్యం.

ఫొటో సోర్స్, EPA
శత్రువులతో కూడా ఆత్మీయంగా ఉండాలి
ఎవరైనా శత్రువు ఉంటే తమ ఆత్మీయతతో వారిలో శత్రుత్వం తగ్గేలా చేయాలి. సంఘ్ కార్యక్రమాలను దగ్గర నుంచి గమనించేలా చేయాలి, వారి భ్రమలు దూరం చేయాలి
తటస్థులు ఉంటే సంప్రదింపులతో వారిని సానుకూలంగా మార్చుకోవడం, అలా మారిన వారిని శాఖలో చేర్పించడం, సమాజ కోసం ఒక అప్రమత్తమైన పౌరుడి పాత్ర పోషించడం.
ప్రణబ్ ముఖర్జీ విషయంలో దేశమంతా ఇప్పుడు ఇంత చర్చ జరగడానికి, ప్రతిదాన్నీ రాజకీయంగా చూసే మీడియా దృష్టి కూడా ఒక కారణమే.
ప్రజాక్షేత్రంలో చాలా మంది వ్యక్తులను సంఘ్ శాఖకు తీసుకొస్తూ ఉంటారు. ఉదాహరణకు 1967లో బిహార్‌లో కరవు సహాయక చర్యల్లో ఉన్న స్వయం సేవకుల ద్వారా లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మొదటిసారి సంఘ్‌ను కలిశారు.
ఆ సమయంలో బిహార్, నర్మదా జిల్లాలోని పక్రీ బరావా ప్రాంతంలో కరవు బాధితులకు స్వయం సేవకులు చేస్తున్న సహాయకార్యక్రమాలు చూసేందుకు జయప్రకాశ్ అక్కడికి వచ్చారు.
అక్కడ పనిచేసేవారంతా స్వచ్ఛంద సేవకులే, ఎవరికీ ఎలాంటి వేతనాలూ లేవు. అందరూ చదువుకున్నవారు కూడా, వారు మనస్ఫూర్తిగా 15 రోజుల సమయం వెచ్చిస్తున్నారు. అది జయప్రకాశ్ నారాయణ్‌ను ప్రభావితం చేసింది.

ఫొటో సోర్స్, SANJAY RAMAKANT TIWARI
'జన్‌సంఘ్ ఫాసిస్టు అయితే నేనూ ఫాసిస్టునే'
స్వయం సేవకుల దేశభక్తి, ఒక ప్రధాన మంత్రి కంటే తక్కువేం లేదని జయప్రకాశ్ మీడియాతో కూడా అన్నారు.
ఆ తర్వాత, ఆయన సంఘ్ మద్దతుతో జరిగిన విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ ఉద్యమానికి నేతృత్వం కూడా వహించారు. ఉద్యమ సమయంలో జరిగిన సంఘ్ సమావేశంలో పాల్గొన్న ఆయన "జన్‌సంఘ్ ఫాసిస్టు అయితే నేను కూడా ఫాసిస్టునే" అన్నారు.
1978లో జనతా పార్టీ పాలన సమయంలో జయప్రకాశ్.. సంఘ్ పట్నాలో నిర్వహించిన ప్రాథమిక శిక్షణ తరగతిలో ప్రసంగించారు.
అదే విధంగా, కన్యాకుమారిలో వివేకానంద సేవా స్మారక నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన ఏక్ నాథ్ రనడే సంఘ్ స్వయం సేవకుడిగానే ఉన్నారు. ఆయనకు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లాంటి అన్ని పార్టీల ప్రభుత్వాల నుంచీ సహకారం లభించింది.
అందరూ ఏక్ నాథ్‌ను తమ వాడిగా భావించారు.
సంఘ్ స్వయం సేవక్ రాజూ భయ్యా (తర్వాత సంఘ్ ప్రముఖ్ కూడా అయ్యారు) అంటే ఉత్తర ప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రభాన్ గుప్తకు ఎంత ఆత్మీయుడో అందరికీ తెలుసు.

ఫొటో సోర్స్, PTI
గంగకు జాతీయ నది హోదా తెచ్చిన ప్రణబ్
నానాజీ దేశ్‌ముఖ్ కాంగ్రెస్‌తోపాటూ ఎన్నో పార్టీల ప్రముఖుల ఇళ్లకు కూడా వెళ్లేవారు. వారంతా నానాజీని తమ ఇంట్లోవాడిలాగే భావించేవారు.
రోజూ ఉదయం నడకకు వెళ్లే కేరళ కమ్యూనిస్టు నేత అచ్యుత్ మీనన్ అయినా, దిల్లీ నార్త్ ఎవెన్యూలో ఉదయం వాకింగ్ చేసే ప్రణబ్ ముఖర్జీ అయినా, అశోక్ రోడ్ లో వ్యాహ్యాళికి వెళ్లే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేఎన్ సింగ్ అయినా, అప్పట్లో ఉదయం చెడ్డీలు వేసుకుని శాఖకు వెళ్లేవారు. వీరికి తలవంచి నమస్కరించేందుకు వెనకాడేవారు కాదు.
ప్రణబ్‌తో ఉన్న బలమైన బంధం వల్ల, ఆడ్వాణీ, ఖండూరీ, హరీష్ రావత్, అజిత్ జోగి, డాక్టర్ మన్మోహన్ సింగ్, జైరామ్ రమేష్, ఉమా భారతి లాంటి వారి సహకారంతో గంగానదికి జాతీయ నది హోదాను తీసుకురాగలిగాం.
పార్టీలకు అతీతంగా, సమాజం కోసం పరస్పర సహకారం అనేది భారత సంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉంది. ఎన్నికల రాజకీయాలతో భారత దేశంపై నిర్లక్ష్యం నీడలు కమ్ముకుంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఒకసారి స్వయం సేవక్ అయితే శాశ్వతంగా ఉంటారు
సంఘ్ పనితీరు గురించి ఒక ప్రముఖ స్వయం సేవక్ ప్రొఫెసర్ యశ్వంత్ రావ్ కేల్కర్ కొన్నిసూచనలు చేశారు. ప్రతి లోహం కరుగుతుంది. కరగని లోహం అంటూ లేనే లేదు. కానీ దానిని ఎంత అవసరమో అంత వేడి చేయాల్సి ఉంటుంది అంతే..
ఏదైనా లోహం కరగలేదంటే, ఆ తప్పు దానికి కాదు. దానిని కరిగేలా వేడి చేయలేదని అర్థం.
లోహం కరిగించే వేడిని, ఉష్ణోగ్రతను పెంచినట్టే, స్వయం సేవకులు తమ దృష్టిని కేంద్రీకరించాలి.
ఇక్కడ లోహానికి అర్థం కొత్త వ్యక్తి. వారు ఎక్కడ పని చేసినా మొత్తం సమాజం అంతా ఒకటే. అందరూ స్వయం సేవకులే. కొందరు ఈరోజు శాఖకు వెళ్తే, మరికొందరు రేపు వెళ్తారు. అందుకే అందరిపై నిస్వార్థ స్నేహం ఉండాలి.
తర్వాత ఒకసారి శాఖకు వస్తే, స్వయం సేవక్ అయితే, వాళ్లు జీవితాంతం స్వయం సేవకులు అవుతారని చెప్పారు. వారి నుంచి ఆచార, వ్యవహారాలు కోరుకుంటారు.
దీని ప్రకారం, సంఘ్ కార్యాలలోకి ప్రవేశించడం అనేది ఎప్పుడూ ఉంటుంది. బయటికి వెళ్లడంలో నిషేధంపై సహజ స్థితి కొనసాగుతుంది.
ప్రణబ్ ముఖర్జీ, జయప్రకాశ్ నారాయణ్ లాగే కాలక్రమేణా దేశంలో ప్రతి ఏటా కొన్ని వేల మంది గురుపూర్ణిమ కార్యక్రమం లేదా సంఘ్ నిర్వహించే 6 ఉత్సవాల్లో, వార్షికోత్సవాలలో పాల్గొంటూనే ఉంటారు.
సంఘ్ స్వయం సేవకులు తమ సమర్థత, సంప్రదించే పరిధిని బట్టి కొత్త వారిని కలుస్తారు, వారి ఇళ్లకు వెళ్లి విశ్వాసాన్ని గెలుచుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
అందుకే ఇంత చర్చ
ప్రస్తుతం దేశంలో సుమారు 50 వేలకు పైగా సంఘ్ శాఖలు ఉన్నాయి. రోజూ వీటికి లక్షల మంది వెళ్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది సంఘ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రజల్లో ఎక్కువ పాపులారిటీ ఉండడం, లేదా ప్రముఖ పదవిని నిర్వహించడం వల్ల ప్రణబ్ ముఖర్జీ నాగపూర్ వెళ్లడంపై ఎక్కువ చర్చ జరుగుతుండొచ్చు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








