జేఈఈ మెయిన్స్ ఫలితాలు: తెలుగువాళ్లే టాపర్లు

ఫొటో సోర్స్, Getty Images
సోమవారం విడుదలైన జేఈఈ మెయిన్స్ 2018 పేపర్ 1 ఫలితాల్లో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయిలో తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన భోగి సూరజ్ కృష్ణ 350 మార్కులతో దేశంలోనే తొలి స్థానంలో నిలిచారు. చోడిపిల్లి హేమంత్ కుమార్ 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన పార్థ్ లతూరియా 3వ ర్యాంకు సాధించారు.
తెలంగాణకు చెందిన గట్టు మైత్రేయ 5వ స్థానంలో నిలిచారు. బాకారపు భరత్ (8), గోసుల వినాయక శ్రీవర్ధన్(10) కూడా టాప్-10లో చోటు దక్కించుకున్నారు. మొత్తం టాప్-10లో ఐదుగురు తెలుగు విద్యార్థులుండటం విశేషం.
ఈ ఏడాది దాదాపు 10.43లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాశారు. వాళ్లలో దాదాపు 2.3లక్షల మంది అర్హత సాధించారు.
గత వారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లోనూ తెలంగాణకు చెందిన అనుదీప్ దూరిశెట్టి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. అతడి ఇంటర్వ్యూను చదవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




