సన్ రైజర్స్ కెప్టెన్‌గా కేన్ విలియమ్స్

ఫొటో సోర్స్, Getty Images
ఐపీఎల్ 2018కి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా కేన్ విలియమ్స్‌ని నియమించారు.
ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కె.షణ్ముగం గురువారం తెలిపారు.
‘‘కేన్ విలియమ్స్‌ని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది.’’ అని వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ సందర్భంగా కేన్ విలియమ్స్ మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో సన్ రైజర్స్ కెప్టెన్‌గా ఉంటాను. ప్రతిభావంతులైన కుర్రాళ్లున్న జట్టుకు కెప్టెన్‌గా ఉండటం చాలా మంచి అవకాశం.’’ అని అన్నారు.
ఈ మాటలను సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది.
కేన్ విలియమ్స్ న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కూడా.

ఫొటో సోర్స్, Getty Images
అంతకు ముందు..
'సన్‌రైజర్స్ హైదరాబాద్' కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తప్పుకున్నారు.
కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది.
ఇదే వివాదం కారణంగా, ఐపీఎల్‌లో మరో ఫ్రాంచైజీ అయిన 'రాజస్థాన్ రాయల్స్' సారథ్య బాధ్యతల నుంచి ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ కూడా వైదొలగారు.
''ఇటీవలి పరిణామాల నేపథ్యంలో 'సన్‌రైజర్స్ హైదరాబాద్' కెప్టెన్ బాధ్యతల నుంచి డేవిడ్ వార్నర్ వైదొలిగారు'' అని ఫ్రాంచైజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) కె.షణ్ముగం బుధవారం 'ట్విటర్'లో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏడాది నిషేధం
బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడిన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లపై క్రికెట్ ఆస్ర్టేలియా ఏడాది పాటు నిషేధం విధించింది.
బాల్ ట్యాపంరింగ్‌కి పాల్పడిన బ్యాన్ క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలలు వేటు వేశారు.
ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఈ ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కలిసి బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ అంశంపై ఆస్ర్టేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ మాట్లాడుతూ.. ఈ వ్యవహారం దేశాన్నే దిగ్ర్భాంతికి గురి చేసిందని వ్యాఖ్యానించారు.
వార్నర్‌ను ఇకపై ఏ జట్టు కెప్టెన్‌గానూ పరిశీలించబోమని క్రికెట్ ఆస్ర్టేలియా వెల్లడించింది.
ఐపీఎల్లో కూడా వీరిద్దరినీ ఈ సీజన్‌కు నిషేధిస్తున్నట్లు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. వీరిద్దరి స్థానంలో ఆయా జట్లు కొత్త ఆటగాళ్లను తీసుకుంటాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








