#IPL2018: బెన్ స్టోక్స్‌కు 12.5 కోట్లు.. ఎవరెవరికి ఎంతెంత?

బెన్ స్టోక్స్

ఐపీఎల్-11 సిరీస్ కోసం బెంగళూరులో జరుగుతున్న క్రికెటర్ల వేలంలో ఇప్పటి వరకు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అగ్ర స్థానాన నిలబడ్డాడు.

రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 12.50 కోట్లకు ఆయనను తన జట్టులోకి తీసుకోవడానికి సిద్ధపడింది. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఇది 2 కోట్లు తక్కువే.

మొత్తం 578 మంది ఆటగాళ్లను వేలం ద్వారా వివిధ జట్లు సొంతం చేసుకోనున్నాయి.

బెన్ స్టోక్స్ తర్వాత భారత్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, మనిశ్ పాండే అత్యధిక ధరకు వేలంలో అమ్ముడు పోయారు. రాహుల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్, పాండేను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.11 కోట్లకు తీసుకున్నాయి.

మిషెల్ స్టార్క్ (9.40 కోట్లు), మ్యాక్స్‌వెల్‌ (9 కోట్లు) ఎక్కువ ధర పలకగా, క్రిస్ గేల్, రూట్‌లు ఇంకా అమ్ముడుపోలేదు.

ఇంకా ఇప్పటి వరకు వివిధ ఆటగాళ్లకు పలికిన ధరల వివరాలివీ:

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)