పడవ ప్రమాదం: 19కి చేరిన మృతుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద పర్యాటకులతో ప్రయాణిస్తున్న ప్రైవేటు బోటు బోల్తా పడిన ఘటనలో 19 మంది మృతి చెందారని విజయవాడ ఆర్‌డీవో డా.ఎస్.హరీష్ వెల్లడించారు.
మృతుల్లో 17 మంది ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వారిగా గుర్తించినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్‌కు పంపిన నివేదికలో పేర్కొన్నారు. చనిపోయిన వారిలో ఎనిమిది మంది మహిళలున్నారు.
ఈ ప్రమాదం నుంచి 21 మంది గాయాలతో బయటపడినట్లు ఆ నివేదికలో ఉంది. మరో నలుగురు యాత్రికులు, ముగ్గురు బోట్ సిబ్బంది ఆచూకీ గల్లంతైనట్లు పేర్కొన్నారు.
గల్లంతైన వారికోసం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ గాలింపు చర్యలు చేపడుతోంది.
ఈ దుర్ఘటనకు సంబంధించి ఐదుగురిపై ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఆర్‌డీవో తెలిపారు.
ప్రమాదంపై విచారణ కొనసాగుతుందని, తదుపరి నివేదికలో పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.
మృతుల కుటుంబాలకు రూ. 8 లక్షల పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప తెలిపారు.
ఇవి కూడా చూడండి
రక్షణ, సహాయ పనుల కోసం అధికారులు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్: 1800450101
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









