జితేంద్ర, హేమమాలిని... మధ్యలో ధర్మేంద్ర

ఫొటో సోర్స్, STRDEL/Getty Images
ఈరోజు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని పుట్టినరోజు. అక్టోబరు 16, 1948న జన్మించిన హేమమాలిని తన నటనతో, అందంతో, నృత్యంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
2000వ సంవత్సరంలో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. 2003-09 మధ్య కాలంలో బీజేపీ తరపున రాజ్యసభ సభ్యురాలిగా కూడా ఉన్నారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
ధర్మేంద్ర-హేమమాలినిల పెళ్లి ఎలా జరిగింది?
ధర్మేంద్ర, హేమమాలినిల వివాహం జరిగిన తీరు చాలా ఆసక్తి రేపుతుంది. నిజానికి ఆ రోజుల్లో హేమమాలిని జితేంద్రను ప్రేమించారట. అయితే సంజీవ్ కుమార్, ధర్మేంద్రలు కూడా ఈ డ్రీమ్ గర్ల్‌ని పెళ్లి చేసుకోవాలని తహతహలాడేవారట.
జితేంద్ర, హేమమాలినిలు వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారని, దీనికోసం వారు మద్రాస్ వెళ్లారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది.

ఫొటో సోర్స్, STRDEL/Getty Images
అప్పటికే జితేంద్ర.. శోభ (జితేంద్ర భార్య)తో ప్రేమలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ధర్మేంద్ర శోభని తీసుకుని మద్రాస్ వచ్చారు. శోభ ఒత్తిడితో జితేంద్ర, హేమల పెళ్లి ఆగిపోయింది.
ఆ తర్వాత కొంతకాలానికి ధర్మేంద్ర, హేమమాలినిలు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే ధర్మేంద్రకి అప్పటికే వివాహం కావడం, హిందూ మత ఆచారాల ప్రకారం రెండో పెళ్లి చేసుకోవడం కుదరకపోవడంతో ధర్మేంద్ర ఇస్లాంని స్వీకరించారు. ఆ తర్వాతే హేమను పెళ్లిచేసుకున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




