‘‘దేవుడు దేవాలయాల్లో ఉన్నాడో, లేదో తెలియదు కానీ మహాత్మా గాంధీ మాత్రం ఇక్కడున్నాడు’’

- రచయిత, ప్రశాంత్ దయాళ్,
- హోదా, బీబీసీ గుజరాతీ.
అహ్మదాబాద్ లో సబర్మతి ఆశ్రమం నుండి 2కిలోమీటర్ల దూరంలో, సబర్మతి జైలులో ఓ దేవాలయం ఉంది. అది ఒక రకంగా సెల్. సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్న ఈ సెల్ ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది.
మహాత్మ గాంధీ సబర్మతి సెంట్రల్ జైలులో 10రోజులు గడిపారు. మహాత్మా గాంధీని మార్చి 22, 1922 నాడు అరెస్టు చేశారు. ఈ పది అడుగుల జైలులో పదిరోజులపాటు మహాత్మ గాంధీని ఇక్కడే ఉంచారు.
మహాత్మా గాంధీ జైలులో గడిపిన ఈ చోటును అక్కడున్న ఖైదీలు పవిత్రంగా భావిస్తారు.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మహాత్మా గాంధీ గడిపిన ఈ చోటులో జ్యోతి వెలిగించి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఈ చోటును గాంధీ ఖోలి అంటారు.
" గాంధీ గడిపిన ఈ చోటులోనే నాకు ఏంతో మనశాంతి కలుగుతుంది" అని ఇక్కడ జీవిత ఖైదు అనుభవించిన నరేంద్ర సింగ్ అన్నారు.
శిక్ష ముగిసిన తర్వాత నరేంద్ర సింగ్ ఇక్కడే ఉంటున్నారు. "గాంధీ భౌతికంగా మన మధ్యలో లేరు.. కానీ ఇక్కడున్న వారందరూ మహాత్మా గాంధీ ఆత్మ మాత్రం ఇక్కడే ఉందని విశ్వసిస్తారు" అని నరేంద్ర సింగ్ తెలిపారు.

" ఈ చోటుకి ఓ ప్రత్యేకత ఉంది అందుకే ఇక్కడున్న వారందరూ ఎక్కువ సమయం ఇక్కడే గడపాలని అనుకుంటారు" అని సబర్మతి జైలు సూపరింటెండెంట్, ఐపిఎస్ పరమవీర్ సింగ్ తెలిపారు.
ఇక్కడ జీవిత ఖైదు అనుభవిస్తున్న జైరాం దేశాయ్ మహాత్మా గాంధీని దేవుడితో పోల్చుతూ "దేవుడు దేవాలయాల్లో ఉన్నాడో, లేదో తెలియదు కానీ మహాత్మా గాంధీ మాత్రం ఇక్కడున్నారని " ఆయన తెలిపారు.
"ఇప్పటికీ గాంధీ ఇక్కడే ఉన్నారు, అందుకే ఆయనకు శ్రద్ధాంజలి ఘటించేందుకు నేను జ్యోతిని వెలిగిస్తాను, ఇలా చేస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది" అని ఆయన అన్నారు.
విభాకర్ భట్ ఇక్కడ మ్యూజిక్ టీచర్‌గా గత 33 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అయితే ఎప్పటి నుంచి జ్యోతిని ఇలా వెలిగిస్తున్నారనే ప్రశ్నకు " ఈ ఆచారం ఎప్పటి నుంచి ఉందొ నాకు తెలియదు. నేనిక్కడ వచ్చినప్పటి నుండి ఈ ఆచారం ఉందని" ఆయన అన్నారు.
మహాత్మా గాంధీతోపాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా భారతదేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో భాగంగా అరెస్టయి ఈ జైలుకు వచ్చారు. ఈ జైలులో మహాత్మా గాంధీతో పాటు సర్దార్ పటేల్ జైలులో గడిపిన చోటు కూడా సర్దార్ యార్డ్ అయ్యింది. అది గాంధీ ఖోలికి పక్కనే ఉంది.
ఇవి కూడా చదవండి:
- ఎంఎస్ ధోని: ‘నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి’
- గాంధీ ఆశ్రమం.. గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపం
- ‘గాంధీ హరిజనులకు శత్రువు’
- తిరుమలలో తన మతం గురించి సోనియా ఏం చెప్పారు?
- ఇందిరాగాంధీతో పోటీపడుతున్న నరేంద్ర మోదీ
- 'మూగ' ఇందిర 'ఉక్కు మహిళ'గా ఎలా మారారు?
- ఇందిర, ఫిరోజ్‌ల దాంపత్యం: అపోహలు, వదంతులు
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
- మీ మైండ్‌ని రీఛార్జి చేయడానికి ఐదు మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








