టీ20 ప్రపంచకప్: భారత్‌తో మ్యాచ్‌లను బహిష్కరించాలన్న పాకిస్తాన్ నిర్ణయంపై ఆ జట్టు కెప్టెన్, మాజీ క్రికెటర్లు ఏమన్నారు?

ఫొటో సోర్స్, Reuters
టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్నామని, అయితే ఇండియాతో మ్యాచ్‌లు ఆడబోమని పాకిస్తాన్ తెలిపింది.
పాకిస్తాన్ నిర్ణయం గురించి ఆ దేశంలో, అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో మిశ్రమ స్పందన కనిపించింది.
అయితే మొత్తం టోర్నీని బహిష్కరించడం పరిష్కారం కాదు అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తెలిపారు.
ఇండియాతో ఆడకూడదనే నిర్ణయం తమది కాదని పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుత కెప్టెన్ సల్మాన్ ఆగా స్పష్టం చేశారు.
ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ తర్వాత సల్మాన్ ఆగా విలేకరులతో మాట్లాడుతూ.. 'ప్రపంచకప్ ఆడబోతున్నాం. ఇండియాతో ఆడకూడదనేది మా నిర్ణయం కాదు. మేం ఏం చేయలేం. ప్రభుత్వం లేదా పీసీబీ చీఫ్ ఏం చేయమంటే అది చేస్తాం' అని ఆయన అన్నారు.

గత నెల చివరిలో, ఈ టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించినప్పుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీ ముందు నిరసన వ్యక్తం చేసింది.
పీసీబీ చైర్మన్ మొహిసిన్ నఖ్వీ చేసిన ప్రకటనలు మొత్తం టోర్నీ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించవచ్చని సూచించాయి.
అయితే ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఇండియాతో మాత్రమే పాకిస్తాన్ మ్యాచ్‌లు ఆడదని ప్రకటించారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
'చాలు'
భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలనే నిర్ణయాన్ని పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ కమ్రాన్ అక్మల్ సమర్థించారు.
"చాలు. మేం ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది, భారతదేశం క్రీడలతో రాజకీయాలను కలిపి క్రికెట్ స్ఫూర్తిని పదేపదే దెబ్బతీసింది" అని ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమ్రాన్ అక్మల్ అన్నారు.
అందువల్ల తమ ప్రభుత్వ వైఖరికి మద్దతు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.
మరోవైపు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ 'ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్‌ను ఓడించిన రోజునే భారత్‌తో ఆడబోమని పాకిస్తాన్ ప్రకటించింది. దీన్ని కపటత్వం అని పిలవవచ్చా?" అని అన్నారు.
అండర్-19 ప్రపంచకప్‌లో ఆదివారం భారత్, పాకిస్తాన్ ముఖాముఖి తలపడిన మ్యాచ్ గురించి ఆకాశ్ చోప్రా ప్రస్తావించారు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించి భారత్ సెమీఫైనల్స్‌కు చేరుకుంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
బహిష్కరించాలని ఒత్తిడి
పాకిస్తాన్ నిర్ణయంపై ఆ దేశ క్రికెట్ బోర్డు మాజీ అధికారులు కూడా భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన సూత్రప్రాయమైన వైఖరికి కట్టుబడి ఉండాలని పీసీబీ మాజీ చైర్మన్ ఖలీద్ మహమూద్ బీబీసీతో అన్నారు.
'ఐసీసీ అత్యవసర సమావేశాన్ని పాకిస్తాన్ మరోసారి డిమాండ్ చేయాలి. భారతదేశం ప్రతిసారీ ఆటలోకి రాజకీయాలను తీసుకువస్తుందని, ఈ ధోరణిని ఆపాలని పాకిస్తాన్ ఇతర ఐసీసీ సభ్యులకు వివరించాలి' అని ఆయన అన్నారు.
కొన్నిసార్లు భారత క్రికెటర్లు కరచాలనం చేయరు, కొన్నిసార్లు ట్రోఫీలను స్వీకరించడానికి నిరాకరిస్తారు, కొన్నిసార్లు వారు వేరే దేశంలో ఆడటానికి వెళ్లడానికి నిరాకరిస్తారు" అని పీసీబీ మాజీ చైర్మన్ అన్నారు.
ఐసీసీలోని ఇతర సభ్య దేశాలు కూడా భారత్‌తో ప్రతి దేశానికి ఎందుకు వివాదం ఉందో అర్థం చేసుకోవాలి. గతంలో భద్రతా కారణాల రీత్యా పలు జట్లు పాకిస్తాన్‌కు రావడానికి నిరాకరించాయి. ఐసీసీ ఏ జట్టునూ పాకిస్తాన్ వెళ్లి ఆడమని బలవంతం చేయలేదని, ఇప్పుడు బంగ్లాదేశ్‌ను భారత్‌కు వెళ్లమని ఎందుకు బలవంతం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
"సిద్ధాంతాల కోసం మేం మిలియన్ల డాలర్ల నష్టాన్ని చూడాల్సి వచ్చినా, వెనక్కి తగ్గకూడదు. ఎందుకంటే ప్రపంచం సిద్ధాంతాలను చూస్తుంది, డబ్బును కాదు" అని ఆయన అన్నారు.
అయితే టీ20 ప్రపంచకప్‌ను పాకిస్తాన్ బహిష్కరించకూడదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) తౌకీర్ జియా అభిప్రాయపడ్డారు.
'బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై మరే బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఐసీసీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది" అని ఆయన బీబీసీతో అన్నారు.
"పాకిస్తాన్ సూత్రప్రాయమైన ప్రకటన చేసిందనడంలో సందేహం లేదు, కానీ అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ ఒక ముఖ్యమైన దేశం, భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రసార హక్కుల సమస్య కూడా ఉంది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
'పాకిస్తాన్‌ను నిషేధించడం అంత సులభం కాదు'
పాకిస్తాన్ ప్రపంచకప్ ఆడకపోతే అది ఐసీసీ ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు.
"పాకిస్తాన్ ప్రపంచకప్ ఆడకపోతే, బ్రాడ్‌కాస్టర్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ టోర్నీ నుంచి తప్పుకుంటే భారత్‌కి వ్యతిరేకంగా ఆడే టీమ్‌కి అదే స్థాయి ప్రేక్షకులు ఉంటారా?" అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్‌లో అన్నారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రకారం, భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు గత 20 ఏళ్లలో ఒక బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించాయి.
"పాకిస్తాన్ పాల్గొనకపోవడం మొత్తం ప్రపంచ కప్‌ను కదిలిస్తుంది" అని పాకిస్తాన్ క్రీడా విశ్లేషకుడు డాక్టర్ నౌమాన్ నియాజ్ సోషల్ మీడియా వేదికగా చెప్పారు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన జట్టును ప్రపంచకప్‌కు పంపకూడదని నిర్ణయించుకుంటే నిషేధం విధించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు.."పాకిస్తాన్ ప్రభుత్వం అలా చేయాలని నిర్ణయించుకుంటే, ఐసీసీకి ఆంక్షలు విధించడం అంత సులభం కాదు" అని డాక్టర్ నౌమాన్ నియాజ్ సమాధానమిచ్చారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
'చివరి 24 గంటల్లో ఏమైనా జరగవచ్చు'
ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్నాయని, షెడ్యూల్ ప్రకారం భారత జట్టు స్టేడియానికి చేరుకుంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాలు ఏఎన్ఐకి తెలిపాయి.
మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ చివరి క్షణం వరకు ఏదైనా జరగవచ్చని అభిప్రాయపడ్డారు.
టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రషీద్ లతీఫ్ మాట్లాడుతూ 'ఇప్పటి వరకు అంతా సవ్యంగా సాగుతోంది. వచ్చే మూడేళ్ల పాటు హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్‌లు ఆడాలని పాకిస్తాన్, భారత్ రెండూ అంగీకరించాయి. ఆసియా కప్ దుబయిలో జరిగింది. మహిళల వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ మహిళల జట్టు శ్రీలంకలో ఆడింది. అంతా బాగానే ఉంది, కానీ బంగ్లాదేశ్ విషయం తర్వాత పరిస్థితి మారిపోయింది" అని ఆయన అన్నారు.
"ప్రపంచకప్ ప్రేక్షకుల సంఖ్యకు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కీలకం. అది భారతదేశం లేదా పాకిస్తాన్ అయినా, ప్రపంచకప్ చూసే వారిలో 60 నుంచి 70 శాతం మంది భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కారణంగా దీనిని చూస్తారు" అని ఆయన అన్నారు.
"ఆస్ట్రేలియాకు సంబంధించిన మ్యాచ్‌లలో కూడా, స్టేడియాలు నిండిపోయాయి, కానీ భారత్, పాకిస్తాన్ తలపడినప్పుడు, ఆ స్థాయి పూర్తి భిన్నంగా ఉంటుంది. వీక్షకుల సంఖ్య భారీగా ఉంటుంది. స్పాన్సర్ షిప్ ధరలు పెరుగుతాయి. ప్రసారకులు ఈ మ్యాచ్‌ల చుట్టూ వారి మొత్తం వ్యాపార వ్యూహాన్ని నిర్మిస్తారు" అని ఆయన చెప్పారు.
ఈ నిర్ణయం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపదు, కానీ నేరుగా ఐసీసీపై ప్రభావం చూపుతుందని లతీఫ్ అన్నారు. సాధారణంగా పాకిస్తాన్ అలాంటి నిర్ణయాలు తీసుకోదు. పీసీబీ కూడా ఆంక్షలకు భయపడదని ఆయన చెప్పారు.
దీని ప్రభావం పెద్దఎత్తున ఉంటుంది. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ జరగనుంది. 2028లో భారత్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అంటే, విషయం ఇక్కడితో ముగియదు. పాకిస్తాన్ ఈ చర్యను చాలా జాగ్రత్తగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆంక్షల గురించి లతీఫ్ మాట్లాడుతూ, "బంగ్లాదేశ్ ఒంటరిగా చేసి ఉంటే, అది కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పాకిస్థాన్ ప్రమేయం పరిస్థితిని మారుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ రాకతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌పై కూడా ఆర్థిక ప్రభావం పడతుంది" అని అన్నారు.
ఈ నిర్ణయం తీసుకోవడానికి పాకిస్తాన్‌కు వారం సమయం పట్టిందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆస్ట్రేలియా సిరీస్ ముగిసింది, రెండు జట్లు కొలంబోకు వెళుతున్నాయి. మొత్తం దృష్టి ఐసీసీపైనే ఉంది. సమయాన్ని జాగ్రత్తగా ఎంచుకున్నామని లతీఫ్ చెప్పారు.
"చివరి 24 గంటల్లో ఏమైనా జరగవచ్చు" అని ఆయన అన్నారు.
ఫిబ్రవరి 15న భారత్‌తో పాకిస్తాన్ మ్యాచ్‌లోకి రాకపోతే ఆ జట్టు రెండు పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














