కేంద్ర బడ్జెట్‌ను అర్థం చేసుకోవడానికి తెలుసుకోవాల్సిన 10 అంశాలు

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ప్రభుత్వ ఆదాయ వ్యయాల ముఖచిత్రమైన బడ్జెట్‌ను సులభంగా అర్థం చేసుకోవాలంటే ఆ పరిభాష కొంత తెలుసుకోవాలి.
బడ్జెట్ ప్రసంగాన్ని, బడ్జెట్‌తో ముడిపడిన వ్యవహారాలను అర్థం చేసుకోవడంలో దోహదపడే పది ప్రాథమిక అంశాలు ఇవి..

1. ఆర్థిక సంవత్సరం
భారత్‌లో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చ్ 31న ముగుస్తుంది.
2. వ్యక్తిగ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి
వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపును 2025 బడ్జెట్‌లో సవరించారు.
పాత ఇన్‌కమ్‌టాక్స్ శ్లాబుల్లో 2.5 లక్షల రూపాయల వరకు మినహాయింపు ఉండగా ఇప్పుడు దానిని 4 లక్షల రూపాయలకు పెంచారు.
3. ప్రత్యక్ష, పరోక్ష పన్నులు
పౌరులు నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులను ప్రత్యక్ష పన్నులు అంటారు. ప్రత్యక్ష పన్నుల భారం నేరుగా ప్రజలపై పడుతుంది.
ఆదాయపు పన్ను, సంపద పన్ను, కార్పోరేట్ పన్ను- ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణలు.
పరోక్ష పన్నుల భారం పౌరులపై నేరుగా పడదు., విలువ ఆధారిత పన్ను(వ్యాట్), అమ్మకం పన్ను, సేవా పన్ను, విలాస పన్ను, వినోద పన్ను, తదితర పన్నుల స్థానంలో ప్రవేశ పెట్టిన జీఎస్టీ - పరోక్ష పన్నులకు ఉదాహరణ.
4. మూలధన లాభాలు
షేర్లు కొన్నతరువాత ఏడాదిలోపు వ్యవధిలో వాటిపై ఆర్జించే లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలు అంటారు. ఏడాదికన్నా ఎక్కువ వ్యవధిలో వాటిపై ఆర్జించే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలు అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
5. జీడీపీ-స్థూల దేశీయోత్పత్తి
ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల మొత్తం విలువను స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంటారు.
దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిని పట్టిచూపే కీలకాంశాల్లో ఇదొకటి.
6. ద్రవ్య లోటు
ప్రభుత్వం చేసే మొత్తం వ్యయం, మొత్తం రాబడిని మించడాన్నే ద్రవ్యలోటు (ఫిస్కల్ డెఫిసిట్) దేశ అంటారు. ద్రవ్యలోటును లెక్కించేటప్పుడు రుణాలను పరిగణనలోకి తీసుకోరు.

ఫొటో సోర్స్, Getty Images
7. కరెంటు ఖాతా లోటు
వస్తు,సేవల దిగుమతుల విలువ, ఎగుమతుల విలువ మధ్య వ్యత్యాసాన్ని కరెంట్ ఖాతా లోటు అంటారు.
8. పెట్టుబడుల ఉపసంహరణ
ప్రభుత్వ రంగ సంస్థల్లోని తన వాటాలను ప్రభుత్వం పాక్షికంగా లేదా పూర్తిగా విక్రయించడాన్ని పెట్టుబడుల ఉపసంహరణ అంటారు.
9. ఆర్థిక బిల్లు
కొత్త పన్నులను, ప్రస్తుత పన్ను విధానంలో మార్పులను ప్రభుత్వం ఆర్థిక బిల్లులో ప్రతిపాదిస్తుంది. బడ్జెట్ సమర్పించిన వెంటనే దీనిని ప్రవేశ పెడతారు.
10. రెపోరేటు
ఆర్‌బీఐ తమకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటును రెపో రేటు అంటారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














