విమానంలో మహిళపై మూత్రం పోసిన కేసు.. ఎవరేమంటున్నారు
న్యూయార్క్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తాగిన మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఒక మహిళపై మూత్ర విసర్జన చేశారు.
ఇది జరిగి నెల పైనే అయింది కానీ, విషయం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది.
ఇది "సిగ్గుమాలిన పని" అని, "షాకింగ్" అని చాలామంది విమర్శిస్తున్నారు.
బిజినెస్ క్లాసులో ఒక వృద్ధ మహిళ ప్రయాణిస్తున్నారు. అదే క్లాసులో ప్రయాణిస్తున్న కొందరు పురుషులు మద్యం మత్తులో ఉన్నారు. ఒక వ్యక్తి ఆమెపై మూత్రవిసర్జన చేశారు.
ఈ ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాను కోరింది.
విమానయాన సంస్థ నుంచి నివేదిక కోరామని, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని డీజీసీఏ బుధవారం తెలిపింది.
2022 నవంబర్ 26న ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాసులో మద్యం మత్తులో ఉన్న ఒక పురుషుడు ఒక మహిళపై మూత్ర విసర్జన చేశారని, ఎయిర్ ఇండియా పోలీసు కంప్లైంట్ చేసిందని అదే సంస్థకు చెందిన అధికారి ఒకరు చెప్పినట్టుగా ఏఎన్ఐ పేర్కొంది.
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- 2023లో మానవ జీవితాల్ని మార్చబోయే 5 శాస్త్రీయ పరిశోధనలు
- ప్రేమ-సెక్స్: 2022లో వచ్చిన కొత్త మార్పులు ఏంటి?
- ఆనాటి కారు యాక్సిడెంట్లో ఓ క్రికెటర్ చనిపోయాడు, ప్రాణాలతో బయటపడ్డవారు ప్రపంచ ప్రఖ్యాత ఆల్‌రౌండర్స్ అయ్యారు
- న్యూయార్క్ మహా నగరం ‘ఖాళీ’ అయిపోతోంది... ఎందుకు?
- క్యాథలిక్: చర్చిలో మతాధికారి హోదా కోసం మహిళల పోరాటం... ససేమిరా అంటున్న వాటికన్ వర్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)







