జిమ్‌ బీమ్ విస్కీ తయారీ ప్రధాన డిస్టిలరీలో ఏడాదిపాటు నిలిపివేత

విస్కీ, స్పిరిట్, తయారీ, బోర్బన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఓస్మాండ్ చిలా
    • హోదా, బిజినెస్ రిపోర్టర్

కెంటకీలోని తన ప్రధాన ఫ్యాక్టరీలో వచ్చే ఏడాది అంతా ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు జిమ్ బీమ్ విస్కీ తయారు చేసే కంపెనీ పేర్కొంది.

కంపెనీ ప్రాంగణాన్ని మెరుగుపరిచే పనులు చేపడుతున్నందున డిస్టిలరీని మూసి ఉంచుతామని ఆ సంస్థ ఆదివారం బీబీసీకి ఒక ప్రకటనలో తెలిపింది.

"వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు ఉత్పత్తి స్థాయిలను మేం నిరంతరం సమీక్షిస్తున్నాం. తాజాగా 2026లో ఎంత ఉత్పత్తి చేయాలనే విషయంపై మా బృందంతో సమావేశమయ్యాం" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

బోర్బన్‌కు ప్రసిద్ధి చెందిన అమెరికాలోని కెంటకీలో ఉన్న డిస్టిలరీలు, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాల కారణంగా కొంత అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి.

జిమ్ బీమ్ బ్రాండ్ జపాన్‌కు చెందిన సంస్థ సంటోరి గ్లోబల్ స్పిరిట్స్‌కు చెందింది. కెంటకీలోని ఈ సంస్థ కేంద్రాల్లో 1,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కెంటకీ రాష్ట్రంలోని ఇతర కార్యకలాపాలు, ప్రత్యేక డిస్టిలరీలతోపాటు బాట్లింగ్, గోదాం కేంద్రాలు వచ్చే ఏడాది కూడా కొనసాగుతాయని, అలాగే కెంటకీలోని విజిటర్ సెంటర్ కూడా తెరిచి ఉంటుందని ఆ సంస్థ చెప్పింది.

ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోవడంతో తమ ఉద్యోగులను ఎలా వినిపయోగించుకోవాలనే విషయాన్ని పరిశీలిస్తున్నామని జిమ్ బీమ్ తెలిపింది. ఈ విషయంలో కార్మికుల యూనియన్‌తో చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్పింది.

అక్టోబర్‌లో కెంటకీ డిస్టిలర్స్ అసోసియేషన్ (కేడీఏ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోదాములలో బోర్బన్ రికార్డు స్థాయిలో 1.6 కోట్ల బ్యారెళ్లకు పైగా ఉందని తెలిపింది .

రాష్ట్రం పన్ను విధించే బోర్బన్ బారెల్స్ వల్ల ఈ ఏడాది డిస్టిలర్లకు "క్రషింగ్" ఖర్చు 75 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 6,225 కోట్లు రూపాయలు) అయిందని అసోసియేషన్ తెలిపింది.

ఏప్రిల్‌లో ట్రంప్ "లిబరేషన్ డే" ప్రకటన సమయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలపై అమెరికా సుంకాలను విధించిన తర్వాత, అమెరికన్ డిస్టిలర్లు తమ వస్తువులపై ప్రతీకార దిగుమతి సుంకాలను ఎదుర్కొంటున్నాయి.

"గత దశాబ్దంలో విస్తరణలో ఎక్కువ భాగం ప్రపంచ మార్కెట్ వైపు దృష్టి సారించింది" అని అక్టోబర్‌లో కేడీఏ పిలుపునిచ్చింది.

అమెరికా, కెనడా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మద్యం అమ్మకాలను కూడా ప్రభావితం చేశాయి. చాలా కెనడియన్ ప్రావిన్సులు ఈ ఏడాది ప్రారంభంలో అమెరికన్ స్పిరిట్‌లను బహిష్కరించాయి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)