సెలబ్రిటీలంతా అక్కడ ప్రేక్షకులయ్యారు.. ట్రంప్, టేలర్‌ స్విఫ్ట్, లియోనల్ మెస్సీ, జేజీ, సెరీనా విలియమ్స్ అంతా గ్యాలరీల్లోనే

టేలర్ స్విఫ్ట్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, తన బాయ్‌ఫ్రెండ్ ట్రావిస్ కెల్సె ఆడుతున్న చీఫ్స్ ఆటను, హైమ్ సిస్టర్స్ మధ్య నుంచి చూస్తున్న టేలర్ స్విఫ్ట్
    • రచయిత, థామస్ మెకింతోష్
    • హోదా, బీబీసీ న్యూస్

ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్ ఈవెంట్లలో ఒకటైన సూపర్ బౌల్ చాంపియన్ షిప్ అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లో జరిగింది. ఈ ఏడాది ఈ చాంపియన్‌షిప్‌ను ఫిలడెల్ఫియా ఈగిల్స్ గెలుచుకుంది. డిఫెండింగ్ చాంపియన్ కాన్సాస్ సిటీ చీఫ్స్‌ను 40 -22 తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది.

ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సహా హాలీవుడ్ తారలు, సంగీత కళాకారులు హాజరయ్యారు.

మ్యాచ్ ప్రారంభానికి ముందు చీఫ్స్‌ ఆటగాళ్లను నటుడు జాన్ హామ్, ఈగిల్స్‌ ఆటగాళ్లను బ్రాడ్లీ కూపర్ పరిచయం చేశారు.

మరి ఈ ఏడాది సూపర్ బౌల్ హంగామాకు సంబంధించిన చిత్రాలను చూసేయండి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బ్రాడ్లీ కూపర్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నటుడు బ్రాడ్లీ కూపర్ యువ అభిమాని డెక్లాన్ లెబ్రాన్‌తో కలిసి తమ అభిమాన జట్టు ఫిలడెల్ఫియా ఈగిల్స్‌ను ప్రకటించారు
బియాన్స్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గాయని బియాన్స్ ఈ ఏడాది సూపర్ ‌బౌల్ పోటీలో కనిపించకపోయినా ఆమె కుమార్తెలు బ్లూ ఐవీ, రూమీ తమ తండ్రి జేజీతో కలిసి వచ్చారు.
జేజడ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఫుట్‌బాల్ కోర్టులో తన కుమార్తె బ్లూ ఐవీని ఫోటోలు తీస్తున్న జేజీ
డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సూపర్ బౌల్ పోటీలకు పదవిలో ఉండగా హాజరైన తొలి అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ నిలిచారు. ఆయనతోపాటు కుమార్తె ఇవాంక కూడా హాజరయ్యారు.
ఇవాంక ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మ్యాచ్ ముగియకముందే వెళ్లిపోయిన ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌లో సూపర్‌బౌల్‌పై విమర్శలు గుప్పించారు. మరోపక్క ఈ మ్యాచ్‌ను ఇవాంక ఆస్వాదించారు.
నిక్కీగ్లేసర్‌తో ఎన్ఎఫ్‌ఎల్ మాజీ కోచ్ బిల్ బెలీచిక్ గర్ల్‌ఫ్రెండ్ జోర్డాన్ హడ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గోల్డెన్ గ్లోబ్ హోస్ట్ నిక్కీగ్లేసర్‌తో ఎన్ఎఫ్‌ఎల్ మాజీ కోచ్ బిల్ బెలీచిక్ గర్ల్‌ఫ్రెండ్ జోర్డాన్ హడ్స్ (ఎడమ)
లియోనల్ మెస్సీ తదితరులు

ఫొటో సోర్స్, Instagram/jordialbaoficial

ఫొటో క్యాప్షన్, లియోనల్ మెస్సీ, లూయిస్ సువారెజ్, జోర్డి ఆల్బా, సెర్గియో బుస్క్వెట్స్
టేలర్ స్విఫ్ట్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గాయని, నటి అల్నా హైమ్‌తో మ్యాచ్ మధ్యలో టేలర్ స్విఫ్ట్ గుసగుసలు
ఎస్‌జడ్‌ఏ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హాఫ్ టైమ్ షోలో, కెండ్రిక్ లామర్ స్మాష్ హిట్ అయిన లూథర్‌ను ఆర్‌అండ్‌బీ గాయకుడు ఎస్‌జెడ్‌ఏతో కలిసి ప్రదర్శించారు.
సెరీనా విలియమ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టెన్నిస్ దిగ్గజం సెరీనా విలియమ్స్ ప్రత్యేక అతిథిగా మెరిశారు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)