కుంభమేళాలో సాధువులు, తెలుగు అమ్మాయిలు, రుద్రాక్షలు.. బీబీసీ కెమెరా కంటితో మీరూ చూసేయండి

సెల్ఫీ తీసుకుంటున్న సాధువు
ఫొటో క్యాప్షన్, వసంత పంచమి రోజు నిర్వహించిన భారీ ర్యాలీలో వాహనంపై కూర్చుని సెల్ఫీ తీసుకుంటున్న సాధువు
    • రచయిత, నవీన్ కందేరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు వస్తున్నారు.

వసంతి పంచమి నాడు త్రివేణి సంగమం వద్ద ఆచరించిన స్నాన వేడుకలు సహా ఇప్పటివరకు మూడు తేదీలలో భక్తులు ‘పుణ్య స్నానాలు’ చేశారు.

ఈ నెల 12న మాఘ పౌర్ణమి సందర్భంగా మరోమారు ‘పుణ్య స్నానాలు’ చేయనున్నారు.

అనంతరం ఫిబ్రవరి 26న మహా శివరాత్రి రోజున జరిగే స్నానాలతో మహా కుంభమేళా ముగుస్తుంది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... వసంతి పంచమి రోజు మొత్తం 2.33 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు.

వసంతి పంచమి నాడు సాధువులు భారీ ర్యాలీతో త్రివేణి సంగమానికి చేరుకుని, పవిత్ర స్నానాలు చేశారు. సంగమ ప్రదేశ వీధులన్నీ కూడా భక్తులతో కిటకిటలాడాయి.

మహా కుంభమేళా వద్ద సందడిని బీబీసీ తన కెమెరాల్లో బంధించింది. సంగమ ప్రదేశంలో సందడి ఎలా ఉందో ఈ చిత్రాల్లో చూసేయండి..

తెలుగు అమ్మాయిలు
ఫొటో క్యాప్షన్, కుంభమేళాలో తెలుగు అమ్మాయిలు
సాధువులు
ఫొటో క్యాప్షన్, వసంత పంచమి రోజు నిర్వహించిన భారీ ర్యాలీలో వాహనంపై కూర్చుని వెళుతున్న కొందరు సాధువులు
సంగమ ప్రదేశ వీధుల్లో చిన్నారులు
ఫొటో క్యాప్షన్, సంగమ ప్రదేశ వీధుల్లో వేషధారణలలో చిన్నారులు
 పోలీసులు
ఫొటో క్యాప్షన్, గుర్రాలపై తిరుగుతూ కుంభమేళా ప్రాంతంలో పోలీసుల నిఘా
చిన్న వ్యాపారులు
ఫొటో క్యాప్షన్, రోజంతా నిలబడి వ్యాపారం చేసుకుని బతికే జీవితాల చిరునవ్వు
కుంభమేళాలోని ఒక ప్రవేశద్వారం
ఫొటో క్యాప్షన్, కుంభమేళా ప్రదేశంలోని ఒక ప్రవేశద్వారం వద్ద జనాల సందడి
నాగసాధువు
ఫొటో క్యాప్షన్, కుంభమేళా వీధుల్లో తన గుడారం వద్ద కూర్చుని ఉన్న మధ్యవయసు గల నాగసాధువు
కుటుంబంతో పారిశుద్ధ్య కార్మికుడు
ఫొటో క్యాప్షన్, కుటుంబంతో కలసి కుంభమేళా వీధుల్లో విహరిస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు
ప్రత్యేక వేషధారణలో కనిపించిన కొందరు సాధువులు
ఫొటో క్యాప్షన్, ప్రత్యేక వేషధారణలో కనిపించిన కొందరు సాధువులు
భిక్షాటన చేస్తున్న ఒక యువతి
ఫొటో క్యాప్షన్, భక్తులు అధికంగా సంచరించే అఖాడాలు ఉన్న వీధుల్లో భిక్షాటన చేస్తున్న యువతి
నాగసాధువు
ఫొటో క్యాప్షన్, శరీరమంతా రుద్రాక్షలతో నిండిన నాగసాధువు
చిన్నారి
ఫొటో క్యాప్షన్, తల్లిదండ్రుల వ్యాపారంలో తన వంతు సాయం చేస్తున్న చిన్నారి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)