మహాకుంభమేళా: 12 ఏళ్ల పండుగ 12 చిత్రాలలో..

ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా
ఫొటో క్యాప్షన్, మరికొన్నిరోజుల్లో మొదలుకానున్న మహాకుంభమేళా
    • రచయిత, నవీన్ కందేరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ భక్తి పారవశ్యంలో అలరారుతోంది. మరికొన్ని రోజుల్లో మహాకుంభమేళా అక్కడ ప్రారంభం కాబోతుంది.

ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు విచ్చేస్తారని అంచనా. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమం వద్దకు వస్తున్నారు.

కుంభమేళా అనేది 12 ఏళ్లకోసారి జరుగుతుంది. 2013లో కుంభమేళా తర్వాత 2019లో అర్ధ కుంభమేళా జరిగింది. ఇది ఆరేళ్లకోసారి జరిగే మేళా. ఈసారి జనవరి 13న పుష్య మాస పౌర్ణమి రోజు నుంచి కుంభమేళా ప్రారంభమై 45 రోజుల పాటు జరుగుతుంది.

ప్రయాగ్‌రాజ్
ఫొటో క్యాప్షన్, తన చిన్నారితో త్రివేణి సంగమం వద్ద ఓ తల్లి ఆనందం
ప్రయాగ్‌రాజ్
ఫొటో క్యాప్షన్, ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన భక్తుల సందడి
సాధువు
ఫొటో క్యాప్షన్, త్రివేణి సంగమం వద్ద ఓ సాధువు

సాధారణ భక్తులతోపాటు వీఐపీలు, నాగ సాధువులు, ఇతర సాధువులు, కల్పవాసీలు(నెల రోజుల దీక్ష పాటించేవారు), పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ మహాకుంభమేళాకు హాజరవుతారు.

ప్రయాగ్‌రాజ్
ఫొటో క్యాప్షన్, మంచుదుప్పటి పరిచినట్టున్న త్రివేణి సంగమం

మహా కుంభమేళా మొదలుకానున్న ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రోజంతా పొగమంచు కురుస్తోంది.

భక్తులు
ఫొటో క్యాప్షన్, కుంభమేళా: భక్తులకు స్నానం, నామం ప్రధానం
త్రివేణి సంగమం ఘాట్
ఫొటో క్యాప్షన్, లక్షలాదిమంది భక్తులు వచ్చే ప్రదేశంలో పారిశుధ్య చర్యలే కీలకం

కుంభమేళా ప్రారంభానికి ముందుగానే యమున, గంగా నదిలో చెత్త, వ్యర్థాలు కనిపిస్తున్నాయి.

భక్తులు పారవేసిన పూలు, ఇతర పూజా వ్యర్థాలు త్రివేణి సంగమం ఘాట్ వద్ద నదిలో కనిపిస్తున్నాయి.

పారిశుద్ధ్య కార్మికులు నది వద్ద శుభ్ర పరుస్తూ కనిపించారు.

పారిశుద్ధ్య మెరుగుదలకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పష్టం చేశారు.

భక్తులు
ఫొటో క్యాప్షన్, నదీస్నానంతోపాటు భక్తులు కొన్ని జ్ఞాపకాలనూ భద్రపరుచుకుంటారు

ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో ఈ కుంభమేళా ముగుస్తుంది. ఈ 45 రోజులలో ఆరు రోజులు ఎంతో విశిష్టమైనవిగా భక్తులు భావిస్తుంటారు.

ఈ రోజుల్లో త్రివేణి సంగమంలో పవిత్ర (షాహి) స్నానాలు చేసేందుకు లక్షలాది భక్తులు వస్తారని అంచనా.

ప్రయాగరాజ్
ఫొటో క్యాప్షన్, వణికించే చలిలో వెచ్చని టీ రెడీ..
త్రివేణి సంగమం ఘాట్
ఫొటో క్యాప్షన్, త్రివేణి సంగమం వద్ద కాపలా బాధ్యత నాదే అంటున్న జాగిలం
ఘాట్ వద్ద చిన్నారులు
ఫొటో క్యాప్షన్, నదీ తీరం... చల్లని గాలి...వెచ్చని టీ

కుంభమేళా అనేది కేవలం ఆధ్యాత్మిక-సాంస్కృతిక కార్యక్రమం మాత్రమే కాదు, అతిపెద్ద ఆర్థిక లావాదేవీలు జరిగే కార్యక్రమం కూడా. కుంభమేళాకు సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉన్నవారు, పెద్ద ఎత్తున లాభాలు పొందే అవకాశం ఉంటుంది.

అయితే, ఏర్పాట్లలో భాగంగా సంగమం ప్రాంతానికి తరచూ వీఐపీలు వస్తూ పోతున్నారు. ఇది కాస్త మొదట్లో స్థానిక వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా మారింది.

త్రివేణి సంగమం
ఫొటో క్యాప్షన్, త్రివేణి సంగమ జలాలను క్యాన్లలో భక్తులు ఇళ్లకు తీసుకువెళతారు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)